Idlebrain.Com
home
audio
movie
celeb
box-office
research
nostolgia
usa special
bollywood
hyd scene


Bheemaneni Srinivas to remake Tamil film Sundara Pandyan

4 October 2012
Hyderabad

Follow Us

తమిళ 'సుందర పాండ్యన్' ను తెలుగు లో పునర్నిర్మించనున్న 'భీమనేని'

రీమేక్ చిత్రాల దర్శకునిగా వినుతి కెక్కిన 'భీమనేని శ్రీనివాసరావు' సుడిగాడు చిత్రం తో మరోమారు సంచలన విజయం సాధించిన విషయం విదితమే. ఈ చిత్రం తరువాత ఆయన మరోమారు రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించటానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల తమిళం లో విజయం సాధించిన 'సుందర పాండ్యన్' రీమేక్ హక్కులను గట్టి పోటీని ఎదుర్కొని తన స్వంతం చేసుకున్నారు 'భీమనేని'. ఈ చిత్రాన్నే తెలుగు లో ఆయన స్వీయ దర్శకత్వంలో పునర్నిర్మించ నున్నారు. కధ,కధనాలు వైవిధ్యం గా ఉండే ఈ చిత్రం ను తమిళం లో దర్శకుడు, కధానాయకుడు కూడా అయిన 'sasikumaar నటించగా,ఆయన వద్ద దర్శకత్వ శాఖలో సహాయకునిగా పనిచేసిన ఎస్.ఆర్.ప్రభాకర్ 'సుందర పాండ్యన్'ను తెర కె క్కించారు. తెలుగు లో ఈచిత్రం లో నటించే 'కధానాయకుడు, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలుస్తాయి.


 

emailabout usprivacy policycopy rightsidle stuff