వానపల్లి బాబురావు సమర్పణ లో సాయి రత్న ప్రొడక్షన్స్ బ్యానర్ పై కృష్ణుడు, సందీప్తి, అమ్మ రాజశేఖర్ , దర్శకులు సాగర్, రేలంగి నరసింహారావు, వి సముద్ర, మాస్టర్ అభిరాం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్స్తున్న చిత్రం 'శీనుగాడు'. ఫణి రాజ్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్ సంగీతాన్నిఅందించారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ ఈ రోజు ఫిలిం చాంబర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మేడికొండ మురళి కృష్ణ , సాగర్, ప్రసన్నకుమార్, అశోక్ కుమార్, ఎన్.శంకర్, సంజీవ్, కృష్ణుడు తదితరులు హాజరయ్యారు.
ఎన్.శంకర్ ట్రైలర్ ను విడుదల చేసారు.అనంతరం ...
మేడికొండ మురళి కృష్ణ మాట్లాడుతూ...
రామసత్యనారాయణ గారు నేను ఫిలిం కెరియర్ ను ఒకే సారి ప్రారంభించాము. కాకపోతే అయన ఎక్కువ సినిమాలు తీసారు. ఆతను నిర్మించే ఈ చిత్రం సక్సెస్ అయ్యి రామానాయుడు గారంత నిర్మాత కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
సాగర్ మాట్లాడుతూ..
నేను ఈ చిత్రం లో జడ్జీ పాత్ర చేశాను. చాల మంచి కథ ఇది. దర్శకుడు చాల తెలివి గల వ్యక్తి . చాల ఫాస్ట్ గా మా చేత వర్క్ల్ చేయించుకున్నాడు. మంచి భవిష్యత్తు ఉందతనికి. మ్యూజిక్, ట్రైలర్ లు బావున్నాయి. సినిమా సక్సెస్ అయ్యి మా అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
రచయిత సంజీవ్ మాట్లాడుతూ ...
ఈ కథ నాకు ముందే తెలుసు. చాలా మంచి కథ. ఎక్కడ కూడా అశ్లీలతకు తావు లేని చిత్రం. పాటలు కూడా భావయుక్తం గా, ప్రతి పదం అర్థమయేలా ఉన్నాయి. మంచి సినిమా గా పేరు పొందాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
దర్శకుడు ఫణి రాజ్ మాట్లాడుతూ ......
నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు. నేను కథ చెప్పి అడగగానే నటించడానికి ఒప్పుకున్న దర్శకులు సాగర్ , రేలంగి నరసింహారావు, వి సముద్ర గార్లకు నా పాదాభివందనాలు. అమ్మిరాజు గారి అబ్బాయి అభిరామ్ చాలా అద్భుతంగా నటించాడు. అర్జున్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నాకు సహకరించి నా టీం అంతటికీ నా థాంక్స్. ప్రేక్షకులు మా సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
కృష్ణుడు మాట్లాడుతూ...
శీనుగాడు చాలా మంచి కథ . దర్శకుడు ఈ కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పాను. నేను ఈ సినిమాలో లాయర్ గా మంచి క్యారెక్టర్ చేశాను. అభిరాం నటనకు చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు డెఫినెట్ గా వస్తుంది అని అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ ....
కొత్త వారిని ప్రోత్సహించడమే నాకిష్టం. ఫణిరాజ్ పని పట్ల శ్రద్ద కలిగిన వ్యక్తి. సినిమాను చాలా ఫాస్ట్ గా పూర్తి చేసాడు. నాకు సహకరించినా సీనియర్ దర్శకులందరికీ నా కృతజ్ఞతలు. సమాజానికి సందేశాన్నిఇవ్వాలనే ఓ మంచి కథ ఫణి నాకు చెప్పాడు. ఇద్దరు అనాధ పిల్లలకు ఎదురైన సమస్యలను ఏ విధంగా ఎదుర్కొన్నారనేది కథాంశం.ఈ కథ నాకు నచ్చి వెంటనే చిత్రీకరణ ప్రారంభించాము. సినిమా చాలా బాగా వచ్చింది. అర్జున్ అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో నటించిన మాస్టర్ అభిరాం కి మంచి భవిష్యత్త్ ఉంది.అతనికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తప్పకుండా నంది అవార్డు వచ్చి తీరుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులంతా సినిమా సక్సెస్ కావాలని అభిలాషించారు. అలాగే చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
|