pizza
Pantham 2nd song launch
గోపీచంద్ `పంతం` సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేసిన తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 June 2018
Hyderabad

Actor Gopichand’s next film Pantham producer by K.K. Radhamohan on his Sri Satya Sai Arts banner is set to release on July 5. The team recently wrapped up shoot and is busy with post production now.

The team had released their first single First Time recently much to a positive response. And now, they have released the second number from the album, Right Now. Telangana’s Cinematography Minister Talasani Srinivas Yadav unveiled it.

Speaking at the event, the politician said, “Gopi Sunder has come up with great music for the film. And I can see that a very accomplished team has worked on the film. Gopichand is a great actor and I wish this film proves to be a success for him taking him to newer heights. It is a good time for the film industry with several good films hitting the screens. I hope this is one such film that will bring laurels to the team.”

Producer K.K. Radhamohan said, “We are very proud to be associated with this milestone film of Gopichand garu. We have left no stone unturned to ensure his 25th film will remain special to him. I thank Talasani garu for unveiling the song. We have planned a grand audio launch on June 21 and can’t wait for the audience to listen to all the songs which Gopi Sunder has done a great job with.”

Directed by K. Chakravarthy, who wrote the screenplay for films like Balupu, Power and Jai Lava Kusa, the film is Gopichand’s landmark 25th movie.

Mehreen will be seen in an interesting role in the movie.”

Music: Gopi Sunder

DOP: Prasad Murella

Art: A.S. Prakash
Dialogues: Ramesh Reddy

Screenplay: K Chakravarthy and Bobby (K.S. Ravindra)

Co-director: Bellamkonda Satyam Babu

Producer: K.K. Radhamohan

Story and direction: K. Chakravarthy (Chakri)

గోపీచంద్ `పంతం` సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేసిన తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. గోపీచంద్ 25వ చిత్ర‌మిది. కె.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా జూలై 5న సినిమా విడుద‌ల‌వుతుంది. మోహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ `రైట్ నౌ...` ను తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిష్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ...

త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మాట్లాడుతూ - ``గోపీచంద్‌గారు హీరోగా చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్‌గారు నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. గోపీసుంద‌ర్‌గారు మంచి సంగీతం అందించారు. మంచి అనుభ‌వం ఉన్న టీమ్ సినిమా కోసం వ‌ర్క్ చేశారు. యూనిట్ స‌భ్యులంద‌రికీ అభినంద‌నలు తెలుపుతున్నాను. గోపీచంద్‌గారు టాలెంటెడ్ హీరో. త‌న‌కు ఈ సినిమా మ‌రో హిట్ చిత్రంగా మంచి పేరు తేవాలి. ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా విల‌సిల్లుతుంది. చాలా హిట్ చిత్రాలు వ‌స్తున్నాయి. జూలై 5న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం డైరెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తికి మంచి పేరు.. నిర్మాత రాధామోహ‌న్‌గారికి మంచి డ‌బ్బులు తేవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ మాట్లాడుతూ - ``సినిమా రంగం చాలా గొప్ప రంగం. త‌ల‌సాని శ్రీనివాస్‌గారు సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా ఉన్న ఈ సినిమా రంగం ఇంకా అభివృద్ధిలోకి రావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్‌లో గోపీచంద్‌గారితో చేసిన తొలి సినిమా. చాలా ప్రెస్టీజియ‌స్‌గా నిర్మించాం. గోపీసుంద‌ర్‌గారు సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను ఈ నెల 21న విడుద‌ల చేస్తున్నాం. అలాగే నేడు త‌ల‌సానిగారి చేతుల మీదుగా రెండో సాంగ్ విడుద‌ల కావ‌డం ఇంకా ఆనందాన్నిస్తుంది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 5న విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

గోపీచంద్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో మెహ‌రీన్ నాయిక‌. పృథ్విరాజ్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఈ చిత్రానికి క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌, మాట‌లు: ర‌మేశ్ రెడ్డి, స్క్రీన్‌ప్లే: కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ (కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైర‌క్ట‌ర్‌: బెల్లంకొండ స‌త్యం బాబు, సంగీతం: గోపీ సుంద‌ర్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్‌, క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: కె.చ‌క్ర‌వ‌ర్తి.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved