pizza
Hushaaru 50 Days Celebrations
`హుషారు` 50 డేస్ సెల‌బ్రేష‌న్స్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


4 February 2019
Hyderabad

బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'హుషారు'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 14న విడుదలై 50 రోజుల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో 50 డేస్‌ను సెల‌బ్రేట్ చేశారు. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - ``మా `హుషారు` సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్. సినిమా ఇంత పెద్ద విజ‌యాన్ని సాధిస్తుంద‌ని నేను ఊహించ‌లేదు. కొన్ని ఏరియాల్లో షిఫ్టింగ్‌తో.. శ్రీ మ‌యూరిలో ఫుల్ ర‌న్‌తో 50 రోజులు వ‌ర‌కు సినిమా ర‌న్ అయ్యింది. హార్డ్‌వ‌ర్క్‌కి మంచి పేరు వ‌స్తుంద‌నడానికి మా సినిమానే కార‌ణం. ఈ సినిమా కోసం యూనిట్ అంద‌రం ఏడాదిన్న‌ర పాటు క‌ష్ట‌ప‌డ్డాం. నాకు కూడా గొప్ప ఎక్స్‌పీరియెన్స్‌. సినిమాకు సంబంధించిన పాట‌లు, ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చిన రెస్పాన్స్‌తో మాలో న‌మ్మ‌కం బాగా పెరిగింది. శ్రీహ‌ర్ష చాలా ఓపిక‌గా, ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశాడు. ఎంటైర్ యూనిట్‌కు, నాకు స‌హ‌క‌రించిన వారికి థాంక్స్‌`` అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ``సినిమా ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ రోజునే సినిమా బాగా ఉంద‌ని, ఆడేలా ఉందని చెప్పాను. నిజంగానే సినిమాను ప్రేక్ష‌కులు ఆదరించారు. ఈరోజుల్లో సినిమా ఆడేదే క‌ష్టం. అలాంటిది 50 రోజులు పూర్తి చేసుకోవ‌డం అంటే సాధార‌ణ విష‌యం కాదు. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

తేజ్ కొర్ర‌పాటి మాట్లాడుతూ - ``వేణుగోపాల్‌గారి వ‌ద్ద నేను అసిస్టెంట్‌గా ప‌నిచేశాను. ఈ సినిమాలో నాపై న‌మ్మ‌కంతో యాక్ట‌ర్‌ని చేశారు. నా నెక్ట్స్ సినిమా కూడా ఇంతే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

దినేష్ మాట్లాడుతూ - ``ఈరోజుల్లో చిన్న సినిమా 50 రోజులు ఆడుతుందంటే చాలా పెద్ద విష‌యం. డైరెక్ట‌ర్ హ‌ర్ష‌, నిర్మాత వేణుగోపాల్‌గారికి థాంక్స్‌. అంద‌రం బాగా క‌ష్ట‌ప‌డ్డాం. ఎమోష‌న‌ల్‌గా ఈ సినిమా నాకెంతో స్పెష‌ల్‌`` అన్నారు.

తేజ‌స్ కంచెర్ల మాట్లాడుతూ - ``సినిమాను చాలా పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కు చాలా పెద్ద థాంక్స్‌`` అన్నారు.

ప్రియా వ‌డ్ల‌మాని మాట్లాడుతూ - ``మా చిన్న సినిమా 50 రోజులు ఆడటం గొప్ప విష‌యం. ఈ స‌క్సెస్‌కు కార‌ణ‌మైన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

ద‌క్ష‌న‌గార్క‌ర్ మాట్లాడుతూ - ``సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు, సినిమాను ఇంత గొప్ప‌గా చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌`` అన్నారు.

శ్రీహ‌ర్ష కొనుగంటి మాట్లాడుతూ - ``నా లైఫ్‌లో ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తిరోజూ బెస్ట్ మెమొరీ. ప్రేక్ష‌కులు సినిమాను రిపీటెడ్‌గా చూసి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. నేను చెప్పిన 5 నిమిషాల క‌థ విని.. ఎగ్జ‌యిట్ అయ్యి సినిమాను చేయ‌డానికి నాతో ట్రావెల్ చేశారు. ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్‌కు మా కంటే ఎక్స్‌పీరియెన్స్ ఉన్నా.. మాతో ఫ్రెండ్స్‌లా క‌లిసి పోయి సినిమా చేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved