pizza
Supreme 50 Days Function
‘సుప్రీమ్’ 50 రోజుల వేడుక
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 June 2016
Hyderabad

సాయిధరమ్ తేజ్ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్ గా, అనిల్ రావిపూడి దర్శకత్వం లో శిరీష్ నిర్మించిన చిత్రం 'సుప్రీమ్'. మే 5న విడుదలైన ఈ చిత్రం 50రోజులు విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బడుతున్న సంద‌ర్బ‌ర్భంగా 50రోజుల వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో నిర్మాత దిల్‌రాజు, సాయిధ‌ర‌మ్ తేజ్‌, రాశిఖ‌న్నా, అనిల్ రావిపూడి, సాయికార్తీక్‌, ర‌ఘుబాబు, శ్రీనివాస‌రెడ్డి స‌హా ప‌లువురు చిత్ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ``ఆరోగ్య‌క‌ర‌మైన సినిమా. ఇప్పుడున్న నిర్మాతల్లో మంచి నిర్మాత‌లు చాలా త‌క్కువ అయిపోయారు. అందులో దిల్‌రాజు ఒక‌రు. అన్నీ ర‌కాల సినిమాలు తీస్తున్నారు. ప‌టాస్ త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అద్భుత‌మైన స‌క్సెస్‌ను అందుకుంది. సాయిధ‌ర‌మ్ పాత్ర ఇలాంటి స‌క్సెస్ మ‌రిన్ని అందుకోవాలి. మిచెల్ గాంధీ పాత్ర‌, దివ్యాంగులు ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోతారు.దిల్‌రాజు, సాయిధ‌ర‌మ్ తేజ్‌, రాశిఖ‌న్నా, అనిల్ రావిపూడి స‌హా చిత్ర‌యూనిట్‌కు కంగ్రాట్స్‌`` అన్నారు.

సాయికార్తీక్ మాట్లాడుతూ ``సినిమా 50రోజులు కాదు, 100వేడుక‌ను జరుపుకోవాలి. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజుగారికి థాంక్స్‌`` అన్నారు.

Rashi Khanna Glam gallery from the eventరాశిఖ‌న్నా మాట్లాడుతూ ``బెల్లం శ్రీదేవి పాత్ర‌ను ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్‌. దిల్‌రాజు, శిరీష్ గారితో క‌లిసి ఈ బ్యాన‌ర్‌లో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. సినిమాను అద్భుతంగా స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌`` అన్నారు.

సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ ``రేయ్ చిత్రంతో నాకు వైవియ‌స్‌.చౌద‌రిగారు తొలి అవ‌కాశం ఇస్తే, పిల్లానువ్వులేని జీవితంతో గీతాఆర్ట్స్‌, దిల్‌రాజుగారు క‌లిసి నాకు తొలి స‌క్సెస్‌నిచ్చారు. దిల్‌రాజుగారు నా కెరీర్‌లో కీల‌క‌పాత్ర పోషించారు. త‌ర్వాత సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్ చిత్రాలు ఆయ‌న బ్యాన‌ర్‌లో చేశాను. అన్నీ సినిమాలు నాకు స‌క్సెస్ ఇచ్చాయి. సినిమాల్లోనే కాదు, ఏదైనా స‌మ‌స్యులున్నా ఆయ‌న అండ‌గా నిల‌బ‌డుతున్నారు. అందుకు దిల్‌రాజుగారికి థాంక్స్‌. అలాగే శిరీష్‌గారు బ‌డ్జెట్‌కు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అనిల్ రావిపూడిగారు అన్నీ ఎమోషన్స్‌తో సినిమాను తెర‌కెక్కించారు. బాలు అనే క్యారెక్ట‌ర్‌ను నాకు ఎక్కించేశారు. అందుకే నేను ఏటీఎమ్ సీన్‌కు బాగా క‌నెక్ట్ అయ్యాను. అలాగే మంచి సంగీతం అందించిన సాయికార్తీక్‌గారికి, సినిమాటోగ్రాఫ‌ర్ సాయిశ్రీరాంగారు స‌హా అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

దర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ``ఈ సక్సెస్ అంద‌రి టీం వ‌ర్క్‌. బ‌డ్జెట్ విష‌యంలో కాస్తా ఎక్కువే అయినా నిర్మాత‌లు వెనుకాడ‌లేదు.ఈ సినిమాకు ప‌నిచేసిన న‌టీన‌టులు, ఆర్టిస్టులు నాపై ప్రేమ‌తో ప‌నిచేశారు. నేను ఏ న‌టుడుతో చేసినా మంచి ర్యాపో ఉంటుంది. సాయిధ‌ర‌మ్ చాలా కో ఆప‌రేట్ చేశాడు.రాజేంద్ర‌ప్ర‌సాద్ ఏ క్యారెక్ట‌ర్‌కు అయినా న్యాయం చేయ‌గ‌ల గొప్ప న‌టుడు. త్వ‌ర‌లో ఆయ‌న్ను బాగా వాడ‌బోతున్నాను. రాశిఖ‌న్నాత‌న క్యారెక్ట‌ర్‌కు న్యాయం చేసింది. వెన్నెల‌కిషోర్‌, శ్రీనివాస‌రెడ్డి, పోసాని, జ‌యంప్ర‌కాష్ రెడ్డి, ర‌ఘుబాబు స‌హా అంద‌రికీ ప్ర‌త్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు`` అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ ``కెరీర్ బిగినింగ్‌లో నాకే కాదు, ఎవ‌రికైనా స‌క్సెస్‌లు గుర్తుండిపోతాయి. సాయిధ‌ర‌మ్‌కు ఎన్ని స‌క్సెస్‌లు వ‌చ్చిన తొలి 50రోజులు వేడుక జ‌రుపుకుంటున్న సినిమా ఇది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ 14 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. నిర్మాతగా శిరీష్ పేరుతో వ‌చ్చిన తొలి సినిమా ఇది. మంచి క‌థ‌ను ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇస్తే, సినిమాకు అడిగిన‌వ‌న్నీ నిర్మాత‌లు మేం స‌మ‌కూర్చాం. అంద‌రి స‌మిష్టి కృషే ఈ నిజ‌మైన హిట్‌కు కార‌ణం`` అన్నారు.

ర‌ఘుబాబు, జ‌యంప్ర‌కాష్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు కూడా సినిమా స‌క్సెస్‌కు త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved