pizza
Akhanda 50 days celebrations at Sudarshan 35mm
Akhanda Is A Success Of The Fans, Audience, And The Industry: Nandamuri Balakrishna
అఖండమైన సినిమాలు వచ్చేలా నన్ను, బోయపాటి శ్రీనుని ఆ దేవదేవుడే కలిపాడు - అఖండ అర్థ శతదినోత్సవం వేడుకలో నందమూరి బాలకృష్ణ

ఈ అఖండ విజయాన్ని ఎన్.టి.ఆర్ గారికి అంకితం ఇస్తున్నాం - అఖండ అర్థ శతదినోత్సవం వేడుకలో డైరెక్టర్ బోయపాటి శ్రీను
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 January 2022
Hyderabad

Nandamuri Balakrishna starrer 'Akhanda' celebrated its 50 days feat amidst jubilation and cheers from the fans at Sudarshan 35 mm theater at RTC X Roads in Hyderabad on Thursday evening. Balakrishna and Akhanda team surprised the fans and the audience watching the movie along with them.

Speaking on the occasion, Nandamuri Balakrishna said, "Coming to RTC X Roads, reminds me of the days bringing breakfast to my father in Ramakrishna Studio. I came to this theater for Samara Simha Reddy's 100 days celebrations. Akhanda's success is due to the audience and the hard work of the team. I was enthused to play a devotee of Shiva, keeping my father in mind. Just like the Sankranthi festival, this is the Akhanda festival. People flocked to the theaters as if they had come on pilgrimages even during the COVID. The patronage is the same across the globe. This 50 days’ celebration is being celebrated by fans in many places and I am proud of that. This is my hattrick success with Boyapati. Our combination is innate. That is why God keeps uniting us".

He also thanked fans for the success. "I thank god for giving me millions of fans. Whatever I did, fans always kept encouraging me. My father was the ideal for me. This overwhelming success is the success of the Telugu film industry. It is a tribute to Hindu society, religion, and practices. The film manages to entertain as well as informative. The fans and the audience are the factors that made this film such an amazing success. This is not a Pan-India movie, this is a Pan-World Cinema. Thaman's music made the film stand out. I hope you encourage the film similarly when it releases on Disney+ Hotstar from Friday," he added.

The Fifty-day memorabilia was then handed over to the distributors and exhibitors by Balakrishna.

Director Boyapati Srinu is a happy man. He started his speech equating Nandamuri fans to his brothers. "With the blessings of God as well as the support of the fans and Telugu audience, Akhanda became a big hit. Balayya Babu's trust in me and the co-operation of the producers played a big role. The film running for 50 days in hundred theaters is really a sensation. The audience will definitely encourage if we make a good movie. That is proved once again. This victory belongs to Nandamuri fans, the Telugu audience, and the Telugu industry. I am dedicating this success to Legend NTR," he said.

Also present on the occasion were Nizam distributor Sirish Reddy, Sudarshan Theater owner Bala Govindaraju, Manager Balu, and others.

అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాలమధ్య నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం అర్థ శతదినోత్సవ వేడుక జరిగింది. గురువారంనాడు సాయంత్రం హైదరాబాద్లోని ఆర్.టి.సి. క్రాస్రోడ్లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్ ఇందుకు వేదికైంది. ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తుండగానే బాలకృష్ణ విచ్చేసి అభిమానులను అలరించారు. వారి ఆనందానికి అవధులు లేవు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఆర్.టి.సి. క్రాస్ రోడ్కు వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. స్టూడియోలో నాన్నగారికోసం టిఫిన్ తీసుకు వచ్చేవాడినంటూ అప్పటి రోజులను ప్రేక్షకులకు తెలియజేశారు. మరోవైపు సమరసింహారెడ్డి శతదినోత్స వేడుకకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

చిత్ర విజయాన్ని గురించి ప్రస్తావిస్తూ,, ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమిష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఇది ఆంధ్ర, తెలంగాణేకాదు, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా అలాగే యావత్ ప్రపంచ పండుగ అఖండ అర్థ శతదినోత్సవం. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా వుంది. ఈ సినిమా విజయాన్ని చేసేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఇక బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. అందుకే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు.

మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈఅఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం.

ఈ సినిమాలో తీసుకున్న అంశం హిందూ సమాజం, ధర్మం, పద్ధతులు. వాటిజోలికి ఎవరైనా వస్తే దేవుడు అఖండలా వచ్చి వారికి బుద్ధి చెబుతాడు. కలుషితమైనపోయిన సమాజానికి ప్రక్షాణనగా ఈ సినిమా వుంది. ఈ సినిమా ఇంత అద్భుతమైన విజయానికి కారకులు అభిమానులు, ప్రేక్షకులే. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ వరల్డ్ సినిమా. ఇక తమన్ సంగీతం ఈ చిత్రానికి అదరగొట్టేలా చేసింది. రిలీజ్ కాకముందు ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు. రిలీజ్ అయ్యాక థమన్ సంగీతంలా అదిరింది అన్నారు. తెలుగు పరిశ్రమ ఇలాగే మూడు పువ్వులు ఆరుకాయలుగా వుండాలి అని ఆకాంక్షించారు.

అనంతరం యాభైరోజుల జ్ఞాపికలు బాలకృష్ణ ఎగ్జిబిటర్లకు పంపిణీదారులకు అందజేశారు.

ఫైనల్ గా బాలకృష్ణ మాట్లాడుతూ, అఖండ సినిమాను థియేటర్లలో చూసి ఎంతో పెద్ద ఘనవిజయాన్ని సాధించారు. అదేవిధంగా రేపు సాయంత్రం 6గంటల నుంచి డిస్నీప్లస్ హార్ట్ స్టార్లో కూడా చూసి ఎంజాయ్ చేయండి అని తెలిపారు.

దర్శకుడు బోయపాటి శ్రీను, జై బాలయ్య అంటూ అభిమానులను హుషారెత్తిస్తూ మాట్లాడారు. సోదర సమానులైన నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో అలాగే అభిమానుల అండతో తెలుగు ప్రేక్షకుల అండదండలతో బాలయ్యబాబు నా మీద పెట్టుకున్న నమ్మకంతో ఈ సినిమాకు సహకరించిన నిర్మాతలకూ అఖండ విజయం సాధించి పెట్టింది. దాదాపు వందకుపైగా థియేటర్లలో ఆడుతోంది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. ఈ విజయం నందమూరి అబిమానులది. తెలుగు ప్రేక్షకులది. తెలుగు పరిశ్రమ ది. ఈ విజయాన్ని ఎన్.టి.ఆర్.గారికి అంకితమిస్తూ, మా కాంబినేషన్ ఎప్పడు తీసినా మీ ఆదరాభిమానాలు వుండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, నందమూరి కుటుంబానికి, ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ, మీ అభిమానాన్ని యాభైరోజులు ఏకధాటిగా చూపించారు. అందుకే కృతజ్ఞతలు తెలిపేందుకు మీ ముందుకు వచ్చాం. మనం ఏదైనా కల కంటే అది నిజమైతే ఆనందంగా వుంటుంది. నిజాయితీగా చెబుతున్నా... ఇలా అఖండ సినిమా విడుదల అవుతుందనీ, యాభై రోజులు అడుతుందనీ, ఇంకా థియేటర్లలో కొనసాగుతుందనీ కానీ నేను కానీ, ఎవరూ కానీ కల కనలేదు. ఆ కలను నిజంచేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముందుముందు ఇలాగే మీ అభిమానం వుండాలంటూ జై బాలయ్య అంటూ ముగించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నైజాం పంపిణీదారుడు శిరీష్ రెడ్డి, సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవిందరాజు, మేనేజర్ బాలు తదితరులు పాల్గొన్నారు.


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved