pizza
ANR National awards 2018-2019
ప్రతిష్టాత్మకమైన 'ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్' నా చేతుల మీదుగా అందించడం గౌరవంగా భావిస్తున్నాను - మెగా స్టార్ చిరంజీవి.( 2018 శ్రీదేవి తరపున బోని కపూర్, 2019 నటి రేఖ)
You are at idlebrain.com > News > Functions
Follow Us


17 November 2019
Hyderabad

It's A Privilege For Me To Present The Prestigious 'ANR National Award' - Megastar Chiranjeevi (Boney Kapoor on behalf of Sridevi for 2018, Rekha for 2019)

ANR National Award is one of the most prestigious awards in the film industry. It is institutionalized by Akkineni International Foundation in the name of Natasamrat Dr. Akkineni Nageswara Rao garu. This award will be presented to honor the personalities who carved a niche for themselves in the films and for their contribution to the Indian film industry. The first award was presented to Bollywood actor Dev Anand in 2006. Recently All-India Director 'Baahubali' SS Rajamouli was honored with the ANR National Award for the year 2017. Legendary actors Sridevi and Rekha are conferred with this prestigious award for the years 2018 and 2019. The award presentation ceremony was held in a grand manner on November 17th at Annapurna 7 acres, Hyderabad. Megastar Chiranjeevi graced the event as chief guest.

King Akkineni Nagarjuna said, " 'Cinema is my mother and father. Cinema is everything for me. It gave me everything I have. As respect towards Cinema, I want to honor prominent personalities of Cinema with 'ANR National Award'.', These were the words my father Akkineni Nageswara Rao garu while initiating this award. His determination is driving us today. We are following his words and thoughts. This award will honor legendary personalities in the film industry and will carry forward the legacy of ANR garu. My father always wanted to present this award to Sridevi garu and Rekha garu. We were unable to give this award to them while he was alive. Along with this award, He is still here among all of us. His presence will always be felt. I am very happy that today his wish is being fulfilled. People call T Subbarami Reddy garu as Kalabandhu but I call him Andari Bandhu. He was very close to my father ANR garu and He maintains the same kind of relationship with me too. I worked with Sridevi garu for four films. My first film with her was 'Akhari Poratam'. She carries an aura into the set. She is a goddess of grace. Everyone says that the beauty and talent she posses were god's gift. But, I say that Boney Kapoor was a real gift to her. I knew both of them for a long time. Sridevi is lucky to have Boney Kapoor as her husband. While 'Himmatwala' made her a star in Bollywood, It is 'Mr. India' Produced by Boney Kapoor made her a national superstar. ANR garu and Sridevi garu live on as long as Cinema is alive. Rekha gari's first film in a full-length role was a Telugu film, 'Rangularatnam'. Rekha garu is a very kind-hearted person. She dubbed for Sridevi garu in 'Aakhri Rasta'. I am privileged to honor her with this award today. Our Chief Guest here today, Padmabhushan Megastar Chiranjeevi garu is very close to me as a brother. I can't express our bonding in words. When I told him about this award he has cut-short his US trip and came here today."

ANR National Award Committee Chairman, Kalabandhu Dr. T Subbarami Reddy said, " Today, Maha Natudu ANR garu who is very close to my heart will be watching this award with pride and happiness. We have Megastar Chiranjeevi garu who has made our Telugu film proud with 'SyeRaa Narasimha Reddy' on one side and A great Producer, Husband Boney Kapoor on another side on this stage. Today wherever I go, I come across people saying that they are my fans. It is because of my friend ANR garu. When ANR garu was conferred with Dadasaheb Phalke award he said to me that he wanted to start 'ANR National Film Award' and honor prominent personalities who contributed to the film industry. He wished that this award must go on whether he is alive or not. During his last days, he wished to present this award to Sridevi garu and Rekha garu. I heartfully appreciate Nagarjuna for fulfilling his father's wish today. Along with beauty, Sridevi has a very good heart. She earned fame nationwide with her talent. Rekha garu is a synonym of beauty for the last 35 years. She is a very disciplined person. I am very happy to present this award today to both of these great film personalities."

Boney Kapoor said, " I am proud today to receive this award on behalf of Sridevi. Thanks to Akkineni Foundation, Akkineni family and T Subbarami Reddy garu for this prestigious award."

Megastar Chiranjeevi said, " My mother admires ANR garu a lot. Maybe that's why I developed a huge admiration for the Cinema. I wanted to come to this industry after the completion of my education. I always feel happy about becoming Hero during the times of Legendary personalities NTR garu, ANR garu. I was lucky to act with Nageswara Rao garu in 'Mechanic Alludu' film. His guidance about this industry has helped me. He is like a 'Guru' for me. He was a walking encyclopedia. It's a great honor for me to share a bond with such a great personality. Till his last breath, Nageswara Rao garu was a very strong person both physically and mentally. This Prestigious ANR National Award which is being presented to Stalwarts of the Indian film industry will soon join the league of Dadasaheb Phalke Award. I am honored to present this award to Legendary Personalities like Sridevi and Rekha garlu. Thanks to Nagarjuna garu for letting me present such a great award to great actors. I worked with 3,4 films with Sridevi garu. E

ven during the shoot, she used to talk about the cinema. She was completely dedicated to Cinema. It's very sad that she left us very early. She acted in almost all Indian languages and became The Lady Superstar of India. I am very happy that this award is giving an opportunity to once again remember her on this stage. I received a Filmfare award from ageless stunning beauty Rekha garu. I invited her as a chief guest for the 80's club event held at my home this year. It is an honor to Rekha garu to be presented with ANR Award and likewise, it's an honor for me to present this award to Rekha garu. My heartful thanks to the whole Akkineni Family for the opportunity."

Rekha said, " I spent 10 years here in this Annapurna studios. This is a happy moment for me to come back here today. Nageswara Rao garu guided me with a lot of things about the industry and acting. His words helped me a lot in my career. As per my mother's last wish, I did a Telugu film after a long time. I will do a Telugu film soon by clearly learning Telugu like Sridevi garu."

Amala Akkineni said, " Congrats to Boney Kapoor on behalf of Sridevi garu and Rekha garu for receiving 'ANR National Award'. It's been 7 years since we started Annapurna College Of Film and Media. It grew day by day since then and became an international school today. Now we are having international students. More than 450 students are getting trained in this school. I am very happy that their Graduation Ceremony will be conducted here along with this Award Function."

66 students of Annapurna School of Film and Media were presented with their Graduation Certificates by Popular Producer Boney Kapoor and Popular Actor Rekha.

Amala Akkineni and Dr. Anuradha Rao ( Dean of Annapurna College of Film and Media) offered a salute of honor.

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో `ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు` ఒకటి. నటసామ్రాట్‌, డా. అక్కినేని నాగేశ్వరరావుగారి గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ చేత స్థాపించబడింది. ఈ అవార్డు ఒక వ్యక్తి జీవితకాల విజయాలు, భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికిగాను అందజేయబడుతుంది. 2018 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రముఖ నటి శ్రీదేవి, 2019 సంవత్సరానికి గాను నటి రేఖకు ఈ అవార్డు లభించింది. న‌వంబ‌ర్‌17న అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఈ కార్య‌క్ర‌మం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై ఈ అవార్డ్ ను శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, నటి రేఖ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో...

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - " సినిమా మాత్రమే నాకు తల్లి తండ్రి, అదే నాకు అన్నీ ఇచ్చింది. కృతజ్ఞతగా ఆ తల్లి ఋణం తీర్చుకోవడానికి ఒక అవార్డ్ స్థాపించడం జరిగింది. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చే వారికి ఇవ్వాలని 'ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్' సృష్టించబడింది. ఇవి ఈ అవార్డ్స్ గురించి నాన్న చెప్పిన మాటలు. ఆయన సంకల్పమే మమ్మల్ని నడిపిస్తుంది. ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాము. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చే వారికి ఈ 'ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్' ఇచ్చి వారిని సగౌరవంగా సన్మానించుకొని వారి పేరుతో పాటు నాన్న పేరు కూడా చిరకాలం ఉండేలా ఈ అవార్డు కార్యక్రమం జరుగుతుంది. శ్రీదేవిగారికి, రేఖ గారికి ఈ అవార్డ్ ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు. ఆయన ఉన్నప్పుడు ఈ అవార్డ్ ఇవ్వలేక పోయాం. కానీ తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఈ అవార్డ్ ఉంటుంది. ఈ వేదిక మీద అవార్డ్ తో పాటు నాన్న ఇక్కడే మనమధ్యనే ఉన్నారు. ఆయన సంకల్పం నెరవేరుతుందని చాలా సంతోషిస్తున్నారు. సుబ్బరామిరెడ్డిగారిలో ఒక గమ్మత్తైన క్వాలిటీ ఉంది. నాన్నగారికి ఎంత క్లోజ్‌ ఫ్రెండో అందరికీ అంతే క్లోజ్ గా ఉంటారు. `పూల రెక్కలు , కొన్ని తేనే చుక్కలు రంగరిస్తివో ఒక బొమ్మ చేస్తివో ' ఇవి శ్రీదేవి మీద సీతారామశాస్రి గారు రాసిన పదాలు. అవి అక్షరాలనిజం. శ్రీదేవి తో నేను నాలుగు సినిమాలు చేశాను. మొదటి సినిమా 'ఆఖరి పోరాటం'. ఆవిడ సెట్ కి వస్తున్నప్పుడు అప్పటిదాకా గొడవ గొడవగా ఉండే సెట్ సైలెంట్ గా అయిపోయేది. శ్రీదేవి 'ది గాడెస్ ఆఫ్ గ్రేస్'. శ్రీదేవి గారికి దేవుడిచ్చిన అందం అభినయం ఆమె అదృష్టం అన్నారు. కానీ దానికన్నా ఎక్కువ అదృష్టం బోని కపూర్ గారు భర్తగా లభించడం. వారిద్దరూ నాకు చాలా కాలంగా తెలుసు. 'హిమ్మత్ వాలా' అనే సినిమా ఆమెను హిందీలో స్టార్ ని చేస్తే బోని కపూర్ గారు తీసిన' మిస్టర్ ఇండియా' ఆమెను నేషనల్ సూపర్ స్టార్ గా చేసింది. సినిమా పరిశ్రమ ఉన్నంత వరకూ ఎఎన్‌ఆర్‌ గారు, శ్రీదేవి గారు బ్రతికే ఉంటారు. అలాగే రేఖ గారి మొదటి సినిమా ఒక తెలుగు సినిమా'రంగుల రాట్నం'. రేఖ గారు మనసు ఎంత మంచిది అంతే శ్రీదేవి గారు 'ఆఖరి రాస్తా' హిందీ సినిమాకి రేఖ గారు డబ్బింగ్ చెప్పారు. ఆమెకి ఈ అవార్డ్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈరోజు మా ముఖ్య అతిధి పద్మభూషణ్ చిరంజీవి గారు, మా అన్నయ్య, నాకు అత్యంత ఆత్మీయులు. చిరంజీవి గారితో నాకున్న అనుబంధం గురించి మాటల్లో చెప్పలేను. ఈ అవార్డ్ కి పిలవగానే యూఎస్ ట్రిప్ మానుకొని ఇక్కడికి వచ్చారు" అన్నారు.

ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్ క‌మిటి చైర్మ‌న్, కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ఈ రోజు ఈ అవార్డ్ ఫంక్షన్ ని దేవలోకం నుండి, కళా ప్రపంచం నుండి నా ఆప్త మహా నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు గారు చూసి సంబరపడుతూ ఉంటారు. అలాగే 'సైరా నరసింహరెడ్డి' గా నటించి యావత్ భారత దేశం గర్వించే విధంగా తెలుగు ఖ్యాతి ని చాటిన మెగాస్టార్ చిరంజీవి గారు ఒకవైపు, అలాగే గొప్ప నిర్మాత, శ్రీదేవి భర్త అయిన బోనీ కపూర్ గారు మరోవైపు ఉన్నారు. ఈరోజు నేను ఎక్కడికి పోయినా నాకు అభిమానులు ఉన్నారంటే అది అక్కినేని నాగేశ్వర రావు గారు నా స్నేహితుడు అవ్వడమే కారణం. అటువంటి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు త‌న‌కి `దాదాసాహెబ్‌ ఫాల్కే` అవార్డు వచ్చినప్పుడు నన్ను పిలిచి భవిష్యత్తులో 'ఎఎన్‌ఆర్ నేష‌న‌ల్ ఫిలిం అవార్డు' స్థాపించి నేను ఉన్నా, లేకున్నా నాతరంవారిచే నేష‌న‌ల్ లెవ‌ల్‌లో సినీ ప‌రిశ్ర‌మ‌లోని గొప్ప గొప్ప వ్యక్తులకు ఈ అవార్డుని ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఆయన ఆఖరి రోజుల్లో నేను శ్రీదేవి, రేఖ లకు ఈ అవార్డ్ ఇవ్వాలని కోరుకున్నారు. ఈరోజు అంత బాద్య‌త‌గా త‌న తండ్రి కోరిక‌ను నెర‌వేరుస్తున్నందుకు నాగార్జున గారిని హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను. అలాగే అందం తో పాటు హృదయ సౌందర్యం ఉన్న నటి. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రేఖ గారు 35 సంవత్సరాలుగా అంతే అందంగా ఉన్నారు. వెరీ డిసిప్లేన్డ్ పర్సనాలిటీ. వీరిద్దరికి ఈ అవార్డ్ ఇవ్వడం హ్యాపీ గా ఉంది`` అన్నారు.

బోని కపూర్ మాట్లాడుతూ - " అందరికి నమస్కారం. శ్రీ దేవి తరపున ఈ అవార్డ్ అందుకుంటున్నందుకు గర్వంగా ఉంది. ఈ అవార్డ్ ని అందించిన అక్కినేని ఫౌండేషన్, అక్కినేని ఫ్యామిలీ కి అలాగే సుబ్బరామి రెడ్డి గారికి ధన్యవాదాలు "అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - "మా అమ్మ గారికి నాగేశ్వర రావు గారు అంటే అంత అభిమానం కాబట్టే నాకు సినిమా అంటే అంత అభిమానం ఏర్పడింది. అందుకే చదువు అయిపోగానే ఇండస్ట్రీ కి రావాలని కోరుకున్నాను, వచ్చాను. ఎన్.టి.ఆర్ గారు ఏఎన్ఆర్ లాంటి లెజెండరీ పర్సన్స్ ఉన్న టైమ్ లో నేను హీరోగా నిలదొక్కుకోవడం హ్యాపీ గా ఉంది. అలాగే నాగేశ్వర రావు గారితో మెకానిక్ అల్లుడు సినిమాలో నటించడం నా అదృష్టం. ఆయన ఈ ఇండస్ట్రీ గురించి చెప్పిన ఎన్నో విషయాల వల్లే నేను ఈ రోజు ఈ స్థానానికి రావడానికి దోహద పడింది. ఆరకంగా నాగేశ్వర రావు గారు నాకు గురు తుల్యులు. ఆయన నడిచే నిగంటువు, ఒక ఎన్సైక్లోపీడియా. అలాంటి మహా నటుడితో నాకు సాంగత్యం ఉండడం నా పూర్వజన్మ సుకృతం. నాగేశ్వర రావు గారు చివరి రోజు వరకూ మానసికంగా, శారీరకంగా ఎంతో బలంగా ఉండేవారు. ఎంతో మంది మహామహులకి ఇస్తున్న ఈ ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు ఎదో ఒక రోజుకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అంత గొప్ప అవార్డ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాచేతుల మీదుగా శ్రీదేవి, రేఖ లాంటి లెజెండరీ పెర్సొనాలిటీస్ కి ఈ అవార్డ్ ఇవ్వడం ఎంతో సముచితం. ఇంత గొప్ప అవార్డ్ నా చేతుల మీదుగా ఇచ్చే అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి దన్యవాదాలు. ఆవిడతో నేను మూడు నాలుగు సినిమాలు చేశాను. శ్రీదేవి గారు షూటింగ్ లో టైమ్ దొరికితే సినిమా గురించే మాట్లాడేవారు. ఆవిడకి సినిమా గురించి తప్ప మరేమి తెలీదు. ఆవిడ మనమధ్య లేకపోవడం బాధాకరం. అన్ని భారతీయ భాషలలో నటించి లేడీ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ అవార్డ్ ఇచ్చి ఆవిడను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. అలాగే ఏజ్ లెస్ స్టన్నింగ్ బ్యూటీ రేఖ చేతుల మీదుగా నేను ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నాను. అలాగే ఈ సంవత్సరం మా ఇంట్లో జరిగే 80స్ క్లబ్ కి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. ఈ ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్ ఆవిడకి రావడం ఆమెకు గౌరవం, నా చేతుల మీదుగా ఈ అవార్డ్ ఇవ్వడం నాకు గౌరవం. ఈ అవకాశం ఇచ్చిన అక్కినేని ఫ్యామిలీ కి నా హృదయ పూర్వక దన్యవాదాలు" అన్నారు.

నటి రేఖ మాట్లాడుతూ - " నేను ఈ అన్నపూర్ణ స్టూడియోస్ లో దాదాపు 10 సంవత్సరాలు గడిపాను. మళ్ళీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నాగేశ్వర రావు గారు నాకు ఇండస్ట్రీ గురించి, నటన గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. అవి నా కెరీర్ కి ఎంతో ఉపయోగపడ్డాయి. చాలా కాలం తర్వాత మా అమ్మగారి చివరి కోరిక కోసం ఒక తెలుగు సినిమా చేశాను. త్వరలోనే తెలుగు స్పష్టంగా శ్రీదేవి గారి లాగా నేర్చుకొని తెలుగులో సినిమా చేస్తాను" అన్నారు.

అమల అక్కినేని మాట్లాడుతూ - " ముందుగా 'ఎఎన్‌ఆర్‌ అవార్డ్' శ్రీదేవి గారి తరుపున అందుకున్న బోని కపూర్ గారికి, రేఖ గారికి శుభాకాంక్షలు. అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా స్థాపించి ఏడేళ్ళు అవుతుంది. అది రోజురోజుకీ పెరిగి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అయింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ కూడా వస్తున్నారు. దాదాపు 450 మంది స్టూడెంట్స్‌ ఉన్నారు. వారి గ్రాడ్యుయేషన్‌ సెర్మనీ ఈ అవార్డు ఫంక్షన్‌తో కలిపి చేయడం సంతోషంగా ఉంది" అన్నారు.

ఈ కార్యక్రమంలో 66 మంది అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా స్టూడెంట్స్ కి ప్రముఖ నిర్మాత బోని కపూర్, రేఖ చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్స్‌ అందజేశారు.

అనంతరం అమల అక్కినేని, డా. అనురాధ రావు (అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా డీన్) గౌరవ వందనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో..విజయ్ దేవరకొండ, సుమంత్, నాగచైతన్య, అఖిల్, నిహారిక, మంచు లక్ష్మి, అడివి శేష్, సుశాంత్, శ్రీకాంత్, కార్తికేయ, లావణ్య త్రిపాఠి, నిర్మాత పి.వి.పి, సుప్రియ, తదితరులు హాజరయ్యారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved