pizza
Nithiin - Trivikram's A Aa music launch
పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ‘ఆఆ’ ఆడియో ఆవిష్కరణ
ou are at idlebrain.com > News > Functions
Follow Us

02 May 2016
Hyderabad

శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య దేవర రాధాకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం అఆఅనసూయ రామలింగం’ వర్సెస్ ఆనంద్ విహారిఅన్నది ఉప శీర్షిక. మిక్కి జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది.   

నితిన్, సమంత థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

బిగ్ సీడీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఆడియో సీడీలను పవన్ కల్యాణ్ ను విడుదల చేసి యూనిట్ సభ్యులకు సీడీలను అందించారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘’నితిన్ కు నేనంటే ఎంతిష్టమో ఈరోజు తను చెప్పేవరకు తెలియదు. నితిన్ కు ఈ సినిమాకు పెద్ద విజయాన్ని తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గబ్బర్ సింగ్ షూటింగ్ లో ఉన్నప్పుడు ఇష్క్ సినిమా షూటింగ్ కోసం నావద్దకు వచ్చినప్పుడు నా తమ్ముడిలా అనిపించాడు. నా సినిమాలు, నా పని తప్ప వేరే సినిమాలు గురించి పట్టించుకోను. అయితే నితిన్ వచ్చినప్పుడు తనకు చాలా రోజులుగా హిట్స లేవు మీరేల్తే బావుంటుదని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. తమ్ముడు ఇబ్బందుల్లో ఉంటే ధైర్యంగా మనం నిలబడతాం కదా, అలాగే నేను మనస్ఫూర్తిగా వచ్చాను. ఆ సినిమా విజయం వారి కష్టం. అలాగే ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించాలని, ఉన్నత స్థానానికి చేరాలని, తెలుగులో కాదు, భారతదేశంలోనే తను పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిక్కి జె.మేయర్ డ్యాన్స్ చేయాలనేంత బాగా మ్యూజిక్ అందించారు. నిర్మాత చినబాబుగారు మంచి నిర్మాత. నాతో కూడా ఆయన ఓ సినిమా చేశారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. నేను గోకులంలో సీత సినిమా చేసేటప్పుడు త్రివిక్రమ్ గారు అసిస్టెంట్ రైటర్ గా వర్క్ చేశారు. ఏదో సీన్ లో పోసానిగారు లేకుంటే త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. ఆయన అప్పటి నుండి పరిచయం ఉంది. అలాగే చిరునవ్వుతో సినిమా రీరికార్డింగ్ సమయంలో రెస్టారెంట్ సినిమా చూసి డైలాగ్స్ బావున్నాయే అనుకున్నాను. త్రివిక్రమ్ గారిని కలవలేదు కానీ చాలా కాలం నుండి పరిచయం ఉంది.  సినిమా తీయడమే కాదు, నిజజీవితంలో కూడా విలువలు పాటించే వ్యక్తి కాబట్టి ఆయనంటే నాకు గౌరవం. అందుకనే మా మధ్య స్నేహం గౌరవ ప్రదంగా ఉంటుంది. త్రివిక్రమ్ లాంటి రచయిత తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు గర్విస్తుంది. అత్తారింటికి దారేది చిత్రం కంటే ముందు నుండే ఈ కథ తెలుసు. అందంగా ఉండే కథ, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. త్రివిక్రమ్ గారి అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ, రచన నితిన్ కు ఓ గొప్ప విజయాన్ని సాధించి పెట్టాలి.

ప్రతి విజువల్ అందంగా ఉంది. తెలుగు చిత్రసీమకు మరో బలమైన విజయం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను’’ అన్నారు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘’జీవితంలో, గెలవడంలో, ప్రయాణంలోనూ మనం ఎక్కడ మొదలు పెట్టామనే విషయాన్ని మరచిపోయే అవకాశం ఉంది. మనం మన మూలాల్ని వెతికే ప్రయత్నం చేస్తుండాలి. అలాంటి ప్రయత్నమే అఆ. కొన్ని జ్ఞాప‌కాలు ఎప్పటికీ మరచిపోలేం. కొన్ని ప్రయాణాలను ఎప్పటికీ ఆపాలనిపించదు. కొన్ని అనుభూతుల్ని ఎంత పంచుకున్నా తరిగిపోదు. మన అనుభూతులు, మాటలు వెనక్కి తిరిగి చూసుకుంటే బావుంటాయి. ఎలాగైతే మనం రాసేసిన డైరీ తిరిగి చదవాలనుకుంటామో అలాంటి ప్రయత్నమే అఆ సినిమా. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాను ఎక్కించడానికి నాకు వెన్నుదన్నుగా, బలంగా నిలబడ్డ వ్యక్తి చినబాబుగారు. ఇది హీరో సినిమానా, హీరోయిన్ సినిమానా అని నమ్మకుండా కథను నమ్మ సినిమా చేసినందుకు నితిన్ కు థాంక్స్. సమంత ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు డేట్స్ అడ్జస్ట్ చేసి సపోర్ట్ చేసింది. నదియాగారిని డైలాగ్స్ పరంగా చాలా కష్టపడింది. అనుపమ, హరితేజ వంటి వారు చక్కగా యాక్ట్ చేశారు. ఈ కథ చెప్పడానికి మిక్కి జె.మేయర్ ను కలసి కథ చెప్పడం స్టార్ట్ చేసిన పది నిమిషాలకే ఓ ట్యూన్ ఇచ్చేశాడాయన. అంత స్పాంటేనియస్ మ్యూజిక్ డైరెక్టర్. ఎప్పుడు ట్యూన్స్ ఇచ్చాడు, ఎప్పుడు కంప్లీట్ చేశామో తెలియనంత ఫాస్ట్ గా మ్యూజిక్ ను అందించారు. రామజోగయ్యశాస్త్రిగారు మంచి లిరిక్స్ అందించారు. సీతారామశాస్త్రిగారి తర్వాత తెలుగు పాటకు గౌరవం తెచ్చే పాటల రచయిత రామజోగయ్యగారు. అలాగే కృష్ణచైతన్య కూడా అడగ్గానే వెంటనే ఓ సాంగ్ రాసిచ్చారు. సినిమాటోగ్రాఫర్ నటరాజన్ గారే చాలా రిచ్ గా చూపించారు. పాటలు, సినిమా అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాను’’ అన్నారు.

నితిన్ మాట్లాడుతూ ‘’త్రివిక్రమ్ గారి స్టయిల్ చెప్పాలంటే అందమైన ఆహ్లాదకరమైన సినిమా. పవన్ కల్యాణ్ గారి స్టయిల్ చెప్పాలంటే అ..ఆ. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. చినబాబుగారు మా అందరినీ నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా చేశారు. సమంతతో వర్క్ చేయడం గ్రేట్. నదియా, నరేష్ గారితో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియెన్స్. మిక్కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. శ్యామల శ్యామల.. సాంగ్ నాకు ఫేవరేట్ సాంగ్. త్రివిక్రమ్ గారి గురించి ఆయన వాకింగ్ డిక్షనరీ, ఎన్ సైక్లోపీడియా, గూగుల్. ఆయనతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన నాకు గురువుగారు. ఆయనతో వర్క్ చేసిన ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేశాను. వాటిని గుర్తు పెట్టుకుంటాను. నేను సినిమాల్లోకి రావడానికి తొలిప్రేమ, పవన్ కల్యాణ్ గారు కారణం. జయం సినిమా ఆడిషన్ కు వెళ్లినప్పుడు తేజగారు డ్యాన్స్ చేయమంటే పవన్ గారు తమ్ముడు, బద్రి సినిమాలో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ వేశాను. తర్వాత యాక్టింగ్ చేయమన్నారు. యాక్టింగ్ చేయమంటే తమ్ముడు సినిమాలో ఓ సీన్ చేశాను. అది తేజగారికి బాగా నచ్చడంతో ఆయన నన్ను హీరోగా తీసుకున్నారు. అలా తెలిసో తెలియకో పవన్ గారు నన్ను ఇన్ స్ఫైర్ చేశారు. తర్వాత నేను ప్లాప్స్ లో ఉండగా ఇష్క్ ఆడియో వేడుకకు పవన్ గారు వచ్చారు. అక్కడ నుండి సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ఆడియో వేడుకకు పవన్ గారు రావడం ఎంతో హ్యపీగా ఉంది. కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.

Glam galleries from the event

సమంత మాట్లాడుతూ ‘’మా దర్శకుడు, నిర్మాత, హీరో కోసం సినిమా పెద్ద హిట్ కావాలి’’అన్నారు.

మిక్కి జె.మేయర్ మాట్లాడుతూ ‘’త్రివిక్రమ్ గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అవకాశం ఇచ్చినందుకు ఆయనకు, నిర్మాత చినబాబుగారికి థాంక్స్. పాటలు అందరికీ నచ్చుతాయని భావిస్తున్నాను. నితిన్ గారి పెర్  ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుంది. యూనిట్ సభ్యులకు థాంక్స్’’ అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ``తొలిప్రేమ చిత్రాన్ని సంధ్యా థియేట‌ర్లో చూస్తూ చూస్తూ నితిన్ హీరో అయ్యాడు. త‌న ఆడియో ఫంక్ష‌న్‌కు ప‌వ‌న్ వ‌స్తే హిట్ అవుతాడ‌ని అనుకుంటాడు నితిన్‌. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ `` అని చెప్పారు.

అజ‌య్ మాట్లాడుతూ ``టైటిల్‌టీజ‌ర్ ఎంత ప్ర‌శాంతంగా ఉందోసినిమా కూడా అంతే ప్ర‌శాంతంగా ఉంటుంది`` అని తెలిపారు.

అనుప‌మ మాట్లాడుతూ ``నేను మ‌ల‌యాళీ. ఇది నా తొలి తెలుగు సినిమా. ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. త్రివిక్ర‌మ్‌గారు చేసిన స‌పోర్ట్ ను మ‌ర్చిపోలేను`` అని చెప్పారు.

శ‌ర‌త్ మ‌రార్ మాట్లాడుతూ ``మిక్కీ చాలా బాగా సంగీతాన్నిచ్చారు. పాజిటివ్ ఎన‌ర్జీ వినిపిస్తోంది. టీమ్‌కి ఆల్ ద బెస్ట్`` అని చెప్పారు.

నదియ మాట్లాడుతూ ``సిన్సియ‌ర్ ఎఫెర్ట్ పెట్టి ఆడియ‌న్స్ ఎక్స్ పెక్టేష‌న్స్ ని రీచ్ కావాల‌ని కృషి చేశాం. మిక్కీ చాలా బాగా చేశారు. త‌న సంగీతానికి స్టెప్పులు వేసే వ‌య‌సును దాటేశాను. త్రివిక్ర‌మ్‌తో ప‌నిచేయ‌డం చాలా గొప్ప‌గా భావిస్తున్నా. మా నిర్మాత‌లు చాలా స‌పోర్ట్ చేశారు`` అని అన్నారు.

 

న‌రేష్ మాట్లాడుతూ ``నా కెరీర్‌లో కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఇది చాలా పెద్ద సినిమా. ఇది కేవ‌లం బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా మాత్ర‌మే కాదు. గుర్తుండి పోయే సినిమా అవుతుంది. జంధ్యాల వెళ్లిపోయార‌నుకున్నాకానీ మ‌ర‌లా నేను త్రివిక్ర‌మ్‌లో చూస్తున్నా`` అని తెలిపారు.

మారుతి మాట్లాడుతూ ``నాకు ప‌వ‌న్‌గారంటే చాలా ఇష్టం. ఆయ‌న ఫంక్ష‌న్‌లో ఉన్న‌ప్పుడు మాట్లాడ‌ట‌మంటే కాళ్లు వ‌ణుకుతున్నాయి. త్రివిక్ర‌మ్‌గారి సినిమా గురించి ఇవాళ కొత్త‌గా మాట్లాడుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న ప్ర‌తి సినిమా ప్ర‌తి డైర‌క్ట‌ర్‌కీ పుస్త‌కంలాంటిది. ఆయ‌న‌వ‌న్నీ తీసి చ‌దివితే చాలు పుస్త‌కం రాసేయ‌వ‌చ్చు.నితిన్‌స‌మంత కాంబినేష‌న్ చాలా బావుంటుంది. ఈ సంస్థ నా సొంత బ్యాన‌ర్‌లాంటిది. రాధాకృష్ణ‌గారు అద్భుత‌మైన నిర్మాత‌. క‌థ చెప్పాక చివ‌రి రోజు మాత్ర‌మే సినిమా చూసేటంత మంచి నిర్మాత‌. మిక్కీ మంచి సంగీతాన్ని అందించారు`` అని చెప్పారు.

ఈశ్వ‌రీరావు మాట్లాడుతూ ``అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అని అన్నారు.

శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ ``జ‌న‌ర‌ల్‌గా సినిమాలు చేస్తే డ‌బ్బులు వ‌స్తాయి. త్రివిక్ర‌మ్‌తో సినిమా చేస్తే చాలా మంచి విజ్ఞానం వ‌స్తుంది. హ‌రితేజ చాలా బాగా చేసింది. న‌దియ‌గారి ప‌క్క‌న సెక్ర‌ట‌రీగా చేశానుఅని తెలిపారు.

కృష్ణ‌చైత‌న్య మాట్లాడుతూ ``నేను త్రివిక్ర‌మ్‌గారికి పిచ్చి ఫ్యాన్‌ని. ఐదు రోజులురోజుకు మూడు నాలుగు గంట‌లు నేను నేర్చుకోవ‌డానికి స్కోప్ దొరికింది`` అని అన్నారు. 

రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ ``ఇందులో నాలుగు మంచి పాట‌లు కుదిరాయి. త్రివిక్ర‌మ్‌గారు చాలా బాగా రాయిస్తారు. ఫైన‌లైజేష‌న్ స‌మ‌యంలో ఆయ‌న‌తో ఉండ‌టం చాలా ఎంజాయ్ చేస్తాను. కృష్ణ‌చైత‌న్య ఒక పాట రాశారు. మిక్కీత్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ చాలా బావుంటుంద‌ని ఫీల‌య్యా. మిక్కీ త‌న పాత ప‌ద్ధ‌తిని ప‌క్క‌న‌పెట్టి కొత్త‌గా చేశారు. లిరిక‌ల్ వేల్యూ ఉన్న ఆల్బ‌మ్ ఇది. వెళ్లిపోకే శ్యామ‌లా అనేది నా మ‌న‌సుకు ద‌గ్గ‌రైన పాట‌. పాజిటివ్ బ‌జ్ ఈ సినిమా గురించి ఉంది`` అని తెలిపారు.

నదియఅనన్య,ఈశ్వరీ రావుసన,గిరిబాబు,పోసాని,నరేష్రావురమేష్అవసరాల్ శ్రీనివాస్ప్రవీణ్,రఘుబాబుపమ్మి సాయిశ్రీనివాస్ రెడ్డి ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కి జె.మేయర్, కెమెరా: నటరాజ్, సుబ్రమణియన్, ఆర్ట్: ఎ.యస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు), కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved