pizza
Sushanth's Aatadukundam Raa music launch
`ఆటాడుకుందాం..రా` ఆడియో ఆవిష్కరణ

You are at idlebrain.com > News > Functions
Follow Us

05 August 2016
Hyderaba
d

సుశాంత్‌ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌శ్రీజి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావుఎ.నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం 'ఆటాడుకుందాం.. రా' (జస్ట్‌ చిల్‌). అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యకమ్రం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో అఖిల్‌ అక్కినేనిచిత్ర నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుఎ.నాగసుశీలపృథ్విహీరో సుశాంత్‌మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌చిత్ర దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డికార్తీక్‌రెడ్డిజెమిని కిరణ్‌లావణ్య త్రిపాఠిపల్నాటి సూర్యప్రతాప్‌బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌సుమంత్‌డా.బ్రహ్మానందంభాస్కరభట్లశ్రీధర్‌ సీపానసాయికార్తీక్‌మురళీశర్మకల్యాణ్‌కృష్ణసందీప్‌కిషన్‌మల్కాపురం శివకుమార్‌డైమండ్‌ రత్నంసినిమాటోగ్రాపఱశివేంద్ర తదితరులు పాల్గొన్నారు.

థియేట్రికల్‌ ట్రైలర్‌ను అనూప్‌ రూబెన్స్‌ఎ.నాగసుశీలసుమంత్‌లు విడుదల చేశారు.

బిగ్‌ సీడీనిఆడియో సీడీలను అక్కినేని అఖిల్‌ విడుదల చేశారు. తొలి సీడీలను సుశాంత్‌అనూప్‌ రూబెన్స్‌ అందుకున్నారు.

అక్కినేని అఖిల్‌ మాట్లాడుతూ ''రెండో సినిమా చేసే ముందు నాకు చార్జింగ్‌ తగ్గిపోయింది. ఈ సినిమాలో చేయడం వల్ల మళ్లీ చార్జింగ్‌ అయినట్టు ఉంది. మా ఫ్యామిలీలో ఒకరు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయ్యుంటే అది అనూపే అనుకోవచ్చు. మా సినిమాలన్నింటికీ ప్రాణం పోసేస్తాడు. మా నాన్నకు తమ్ముడిలా అన్నయ్యకు అన్నయ్యలా పనిచేస్తాడు. సుశాంత్‌ను సూశీ అని పిలుస్తాను. తనకు సినిమాలు తప్ప వేరే లోకమే ఉండదు. ఈ సినిమా తనకు పెద్ద హిట్‌ మూవీ అవుతుంది. డైరెక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డిగారికి అభినందనలు. అక్కినేని అభిమానులు పండుగ సీజన్‌ స్టార్ట్‌ అయ్యి వరుస సినిమాలు వస్తాయి. ఎంటైర్‌ టీంకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

సుశాంత్‌ మాట్లాడుతూ ''తాతగారి లెగసీని మావయ్య కంటిన్యూ చేశారు. సోగ్గాడే చిన్ని నాయనాతో కొడుతున్నామని చెప్పి మరీ కొట్టారు. ఆయన స్టేజ్‌కు మేమింకా రాలేదు కానీమా సినిమా బావుంటుంది. అమ్మ నాన్న ఎంతో సపోర్ట్‌ చేశారు. అమ్మ అయితే కెరీర్‌ పరంగా కూడా సపోర్ట్‌ చేశారు. శ్రీనివాసరావుగారు నాపై నమ్మకంతో మొదటి నుండి సపోర్ట్‌ చేస్తున్నారు. సినిమా సినిమాకు ఎదుగుతున్నాను. ఆయన నమ్మకంతో ఈ సినిమా హిట్‌ అవుతుంది. అందుకు ఆయనకు స్పెషల్‌ థాంక్స్‌. అనూప్‌ అడ్డా కన్నా మంచి ఆల్బమ్‌ ఇస్తానని అన్నట్లే మంచి ఆల్బమ్‌ ఇచ్చారు. శ్రీధర్‌ సీపానగారు మంచి కథ ఇచ్చారు. ఆ కథను శ్రీనివాస్‌రెడ్డిగారు నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లారు. అక్కినేని అభిమానులు నన్ను ఎలా చూడాలనుకుంటారో అలా ఈ సినిమాలో చూస్తారు. అభిమానులు గర్వపడేలా సినిమా ఉంటుంది. నా మనసుకు నచ్చిన సినిమాలే చేస్తాను. ఓ సినిమాపై వర్క్‌ చేస్తే లేట్‌ అవడంతో ఇంత గ్యాప్‌ వచ్చింది. నాగచైతన్య ఈ చిత్రంలో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇస్తున్నాడు. అందుకోసం నేను తనకు ఫోన్‌ చేయగానే వెంటనే చేయడానికి ఒప్పుకున్నాడు. అలాగే అఖిల్‌ కూడా ఈ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్‌లో కనపడతాడు. అందుకు తనకు కూడా థాంక్స్‌. శివేంద్రగారు మంచి సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.  

ఎ.నాగసుశీల మాట్లాడుతూ ''సాంగ్స్‌థియేట్రికల్‌ ట్రైలర్‌ బావుంది. డెఫనెట్‌గా మనం హిట్‌ కొడుతున్నాం. శ్రీనివాసరావుగారు ముందు నుండి నాకెంతో సపోర్ట్‌ చేస్తున్నారు. అనూప్‌ మా ఫ్యామిలీ మెంబర్‌. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

నిర్మాత చింతలపూడి మాట్లాడుతూ ''ఒట్టేసి చెబుతున్నా ఈ సినిమా హిట్‌. శ్రీధర్‌ సీపాన కథదమ్మున్న కెమెరామెన్‌దమ్మున్న డైరెక్టర్‌ నాగేశ్వరరెడ్డిగారుఅనూఫ్‌ రూబెన్స్‌ వంటి మంచి టెక్నిషియన్స్‌తో సినిమా రూపొందింది. ఫస్ట్‌కాపీ రెడీగాఉంది. ఇండిపెండెంట్‌ డేకు రెండు రోజుల ముందుగానీ లేదా రెండు రోజుల తర్వాతగానీ సినిమా విడుదలవుతుంది. స్ట్రాంగ్‌ బయ్యర్స్‌ ఉన్నారు. ఎనీ టైం సినిమా రిలీజ్‌ చేయడానికి రెడీగానే ఉన్నాం. అక్కినేని హీరోలతో పాటు బయట హీరోలతో కూడా శ్రీజి ఫిలింస్‌ సినిమాలు చేస్తుంది. మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం'' అన్నారు.

సుమంత్‌ మాట్లాడుతూ ''సుశాంత్‌ డేడికేషన్‌ తన ఫైట్స్‌లో కానీడ్యాన్సుల్లో కనపడుతుంది. తనకు అభినందనలు. అనూప్‌ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. నాగేశ్వరరెడ్డిగారు సక్సెస్‌ కొనసాగాలని కోరుకుంటున్నాను. నా సినిమా అంతా రెడీ అయ్యింది. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో రిలీజ్‌ చేస్తాను. తర్వాత చైతు రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. మావయ్య సినిమా ఉంది. అక్కినేని అభిమానులకు పండుగ స్టార్ట్‌ అవుతుంది'' అన్నారు.

జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ''ఆటాడుకుందాం..రా కంటే ముందు నాలుగేళ్ల క్రితం నేను సుశాంత్‌తో సినిమా చేయాల్సింది కానీ మిస్‌ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా చేయడానికి చింతలపూడి ప్రభాకర్‌గారునాగసుశీలగారే కారణం. అలాగే తెలుగు సినిమాకు పునాదిరాయి అయిన అన్నపూర్ణ బ్యానర్‌ సమర్పణలో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆ బ్యానర్‌లో త్వరలోనే సినిమా చేయాలనుకుంటున్నాను. శ్రీధర్‌సీపాన ఎక్స్‌ట్రార్డినరీ కథను ఇచ్చాడు. చాలా బలమైన పాయింట్‌ కథలో ఉంది. అనూప్‌ ఎన్నో సూపర్‌హిట్‌ పాటలిచ్చాడు. ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చాడు. నాలుగు అద్భుతమైన పాటలిచ్చాడు. సినిమాటోగ్రాఫర్‌ శివ ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా తీశాడు. ఇలా అందరూ ఎంతో సపోర్ట్‌ చేశారు. నిర్మాత శ్రీనివాస్‌రావుగారు,సుశాంత్‌ ప్రతి సినిమాకు స్టార్‌డమ్‌ను పెంచుతూ వచ్చారు. మంచి సినిమా చేసే అవకాశాన్ని నాకు కూడా కల్పించారు. సినిమా కచ్చితంగా సూపర్‌హిట్‌ ఇచ్చాడు. సుశాంత్‌ నాకు ఎంతో ఎనర్జీనిచ్చాడు.ప్రతిరోజూ ఓ టానిక్‌లాగా ఎంతో ఇన్‌స్ఫైర్‌ చేస్తుంటాడు. తనకి స్పెషల్‌ థాంక్స్‌'' అన్నారు.

Glam galleries from the event

అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ ''అడ్డా తర్వాత సుశాంత్‌తో చేస్తున్న చిత్రమిది. సుశాంత్‌ చాలా మంచి వ్యక్తి. తన గత చిత్రాలకు భిన్నంగా చేసిన మూవీ. తను పెర్‌ఫారెన్స్‌తో అదరగొట్టాడు. అందరికీ అభినందనలు'' అన్నారు.

కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ ''సుశాంత్‌ ప్రతి సినిమాకు నెక్ట్స్‌ లెవల్‌కు వెళుతున్నాడు. అడ్డా కంటే ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది. సినిమా అంటే ఫోకస్డ్‌డేడికేషన్‌ ఉన్న వ్యక్తి. కానీ చాలా రోజులు గ్యాప్‌ తీసుకుని సినిమాలు చేస్తున్నాడు. కానీ తను సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నిర్మాత శ్రీనివాస్‌రావుగారి ప్రొడక్షన్‌ వాల్యూస్‌ చాలా రిచ్‌గా ఉంటాయి. నాగేశ్వరరెడ్డిగారు వరుస సక్సెస్‌లు కొడుతున్నారు. అనూప్‌ యూత్‌కు ఊగిపోయే మ్యూజిక్‌ ఇచ్చాడు. ఎంటైర్‌ టీంకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

పల్నాటి సూర్యప్రతాప్‌ మాట్లాడుతూ ''నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన బ్యానర్‌ ఇది. కరెంట్‌కు పనిచేసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. సుశాంత్‌ లుక్‌ బావుంది. అనూప్‌ చాలా మంచి మ్యూజిక్‌ అందించారు. సినిమా చూడటానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. నాగేశ్వరరెడ్డిగారు సినిమాలు ఎప్పుడూ కామెడితో ఉంటాయి. ఈ సినిమా ఇంకా కొత్తగా ఉంది'' అన్నారు.

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ''సినిమా యూనిట్‌కు అంతా ఆల్‌ ది బెస్ట్‌. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

డా.బ్రహ్మానందం మాట్లాడుతూ ''సుశాంత్‌ చాలా టాలెంటెడ్‌ హీరో. ఈ సినిమాలో తను నటించిన తీరు చాలా బావుంది. చాలా పెద్ద క్యారెక్టర్‌ చేశాను. మంచి టాలెంట్‌ ఉన్న డైరెక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి నిర్మాతల దర్శకుడు. మంచి టీం సభ్యులందరూ కలిసి పనిచేసిన చిత్రం. పవర్‌ఫుల్‌ ప్యాక్‌డ్‌ కామెడి. రఘుబాబుపోసానిపృథ్వివెన్నెలకిషోర్‌ వంటి మంచి కమెడియన్స్‌ నటించారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.

కల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ ''నాగార్జునగారు ధైర్యం వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఆయన అలా ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే చాలా మంది మంచి టెక్నిషియన్స్‌ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన నా రియల్‌ హీరో. అక్కినేనిగారి ఆశీస్సులు సుశాంత్‌కు ఎప్పుడూ ఉంటాయి. నాగసుశీలగారు చాలా లక్కీ హ్యాండ్‌. ఇప్పుడున్న దర్శకుల్లో నాగేశ్వరరెడ్డిగారు సినిమాలు రిలీఫ్‌ ఇస్తాయి. అనూప్‌ తన మ్యూజిక్‌తో సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళతాడు. సుశాంత్‌కు పంచెకట్టు బావుంది. నిర్మాతగారు నాకు ఎప్పటి నుండో పరిచయం ఉంది. ఆయనకు ఈ సినిమాతో పెద్ద సక్సెస్‌ రావాలని కోరుకుంటూ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ ''సుశాంత్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలబడుతుందనడంలో సందేహం లేదు. టీజర్‌సాంగ్స్‌ అన్నీ బావున్నాయి. మా బ్యానర్‌లోనే ఈసినిమాను నైజాంలో విడుదల చేస్తున్నాం. సుశాంత్‌ ప్రతి ఏడాది రెండు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అవకాశం వస్తే మా సురక్ష్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను'' అన్నారు.

                        సుశాంత్‌సోనమ్‌ ప్రీత్‌ బజ్వాబ్రహ్మానందంమురళీశర్మపోసాని కృష్ణమురళివెన్నెల కిషోర్‌రఘుబాబుపృథ్వీఫిరోజ్‌ అబ్బాసిసుధఆనంద్‌రమాప్రభరజితహరీష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్రఎడిటింగ్‌: గౌతంరాజుఆర్ట్‌: నారాయణరెడ్డిఫైట్స్‌: వెంకట్‌రామ్‌ సుంకరఛీఫ్‌ కో-డైరెక్టర్‌. డి.సాయికృష్ణకో-డైరెక్టర్‌: కొండా ఉప్పలప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రవికుమార్‌ యండమూరికథ-మాటలు: శ్రీధర్‌ సీపాననిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావుఎ.నాగసుశీల,

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved