pizza
Accident music launch
'యాక్సిడెంట్‌' ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 May 2017
Hyderabad

కృష్ణ, నేహారెడ్డి హీరో హీరోయిన్లుగా శ్రీ జయలక్ష్మి ఆర్ట్స్‌ బ్యానర్‌పై నంది వెంకట రెడ్డి దర్శకత్వంలో సింహాద్రి గణేష్‌ నిర్మిస్తోన్న చిత్రం 'యాక్సిడెంట్‌'. విజయ్‌ బాలాజీ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రతాని రామకృష్ణా గౌడ్‌ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా...

ప్రతాని రామకృష్ణా గౌడ్‌ మాట్లాడుతూ - రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి ఐదు వేల వరకు యాక్సిడెంట్స్‌ జరుగుతున్నాయి. ఇలాంటి యాక్సిడెంట్‌ జరగకూడదు అని ప్రభుత్వం బాధ్యత వహించడంపై దర్శక నిర్మాతలు ఆలోచించి చేసిన సినిమా ఇది. సమాజానికి ఉపయోగపడే సినిమా చేసినందుకు యూనిట్‌ను అభినందిస్తున్నాను.

నిర్మాత సింహాద్రి గణేష్‌ మాట్లాడుతూ - ''ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగిన విధంగా హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ను జోడించి సినిమా చేశాం. నటీనటులు, టెక్నిషియన్స్‌ ఎంతగానో సపోర్ట్‌ చేశారు. దర్శకుడు వెంకట్‌రెడ్డిగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు'' అన్నారు.

Glam gallery from the event

దర్శకుడు నంది వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ - ''సమాజంలో జరుగుతున్న యాక్సిడెంట్స్‌ వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయనే కాన్సెప్ట్‌తో చేసిన సినిమా. హీరో హీరోయిన్స్‌ చక్కటి సపోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేశాం. నిర్మాతగారికి థాంక్స్‌'' అన్నారు.

కృష్ణ, నేహారెడ్డి, వడ్డేపల్లి నవీన్‌, శ్రీదేవి, నిషా, వెంకటేష్‌, హరీష్‌, పవన్‌, డా.ఎ.వి.ఆర్‌, రచ్చ రవి, అప్పారావు, సింహాద్రి గణేష్‌, హనీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, మ్యూజిక్‌: విజయ్‌ బాలాజీ, ఎడిటర్‌: సంతోష్‌, నిర్మాత: సింహాద్రి గణేష్‌, దర్శకత్వం: నంది వెంకట రెడ్డి.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved