pizza
Attack music launch
ఎటాక్ ఆడియో విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

20 March 2016
Hyderabad

మంచుమనోజ్, జగపతిబాబు, వడ్డేనవీన్, ప్రకాష్ రాజ్, సురభి ప్రధాన తారాగణంగా సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ సమర్పణలో శ్రీ శుభ శ్వేత ఫిలింస్ పతాకంపై రూపొందిన చిత్రం ఎటాక్. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. వరుణ్, తేజ, శ్వేతలాన సి.వి.రావు నిర్మాతలు. రవిశంకర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. బిగ్ సీడీని రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించారు. ఆడియో సీడీలను మంచు మనోజ్ విడుదల చేయగా తొలి సీడీని రాంగోపాల్ వర్మ, సి.కల్యాణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా...

సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘’వర్మగారు ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఈ సినిమాను పూర్తి చేసుకుంటూ వచ్చాం. ఈ సమ్మర్ కు పరీక్షలు అయిపోయాక రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నాం. ఈ సినిమా చూసిన వారందరూ వర్మ ఈజ్ బ్యాక్ అంటారు. ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది. మంచు మనోజ్ కు మరుపురాని చిత్రంగా నిలుస్తుంది. సినిమా రామాయణం, మహాభారత కథలను గుర్తుకు తెచ్చేలా సాగుతుంది. సురభి ఇప్పటి వరకు హీరోయిన్ గా చేసిన సినిమాలకు భిన్నంగా పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. ఎన్టీఆర్ గారితో పాటు ఆయన ఫ్యామిలీలోని హరికృష్ణగారిని మిగతావారిని గుర్తుకు తెచ్చేలా సినిమా ఉంటుంది. ఇది సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది ‘’ అన్నారు.

రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ ‘’కల్యాణ్ గారు ఈ సినిమాకు ముందు నన్ను కలిసి నా కాలర్ పట్టుకుని నువ్వు చేయాల్సిన సినిమాలివి కావంటూ రెండు గంటలు పాటు క్లాస్ పీకారు. నా నుండి డ్రై డ్రామా, యాక్షన్ మూవీలను ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేస్తారని అన్నారు. ఈ సినిమా విషయానికి వస్తే మనోజ్ కళ్లలో ఓ మాగ్నటిజం ఉంటుంది. అలాంటి ఇన్ టెన్సిటి ఉన్న క్యారెక్టర్ కోసం మనోజ్ తీసుకున్నాను. తను ఫెంటాస్టిక్ జాబ్ చేశాడు. గజల్ శ్రీనివాస్ గారు ఈ చిత్రంలో ఓ పాట పాడారు. అలాగే చిరంజీవిగారి కొట్టండి, తిట్టండి .,..అనే పాటను బేస్ చేసుకుని ఈ సినిమాలో మరోపాటను రాయించాను. అయితే ఈ పాట వేరే స్టయిల్ లో ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే నాకున్న యాట్యిట్యూడ్ తో అందరిలోని రాక్షసుణ్ణి నిద్ర లేపాను. ధూల్ పేట వంటి ఏరియాలో చిత్రీకరణ చేశాను కాబట్టి గ్లామర్ పార్ట్ కోసం సురభిని హీరోయిన్ గా పెట్టాను. అందరూ బాగా సపోర్ట్ చేశారు’’ అన్నారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ ‘’రాంగోపాల్ వర్మగారు ఫిలిం మేకింగ్ లో ఓ యూనివర్సిటీలాంటి వ్యక్తి. అందుకే ఈసినిమాలో వర్క్ చేసిన వాళ్లందరూ ఏదో డబ్బుకోసమని కాకుండా ఆయనతో వర్క్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేసినట్టు కనపడింది. కళ్యాణ్ గారితో చిన్నప్పటి నుండి పరిచయం ఉంది. ఆయన బ్యానర్ లో సినిమా చేయడం హ్యపీగా ఉంది. ఆయన అడిగితే ఫ్యూచర్ లో కూడా సినిమ చేయడానికి నేను సిద్ధమే. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం వర్క్ చేశారు. అలాగే జగపతిబాబుగారు, ప్రకాష్ రాజ్ గారు, వడ్డే నవీన్ వంటి యాక్టర్స్ తో కలిసి యాక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే రవిశంకర్ అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వగా, అంజి తన సినిమాటోగ్రపీతో సీన్  హైలైట్ గా చూపించాడు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

Glam galleries from the event

సిరా శ్రీ మాట్లాడుతూ ‘’వర్మగారు సాధారణంగా చేసిన సినిమాలనే చేస్తారు. ఏదో చుట్టేసేలా సినిమాలను తీస్తారనే అపవాదు ఆయనపై ఉంది. ఈ అపవాదులన్నీ ఈ సినిమాతో తుడిచి పెట్టుకుపోతాయి. కంప్లీట్ కొత్త ఫార్మేట్ మూవీ. లిరిక్స్ రాయించిన తర్వాత ట్యూన్స్ కట్టించారు. ఈ సినిమాతో ఆయనకు హాలీవుడ్ దర్శకుల గురించే కాదు, రామాయణం, మహాభారతంపై ఉన్న గ్రిప్ తెలుస్తుంది. రాంగోపాల్ వర్మగారు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేయడమే కాదు, మా అందరితో హార్డ్ వర్క్ చేయించి చేసిన సినిమా’’ అన్నారు.

గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘’నాకు దర్శకుడుగా వర్మ అంటే ఎంతో ఇష్టం. ఇప్పటి వరకు నేను నా పాటకు తప్ప ఏ ఇతర సినిమా పాటలకు ప్లే బ్యాక్ సింగర్ గా పాడలేదు. అవకాశాలు వచ్చినా వద్దన్నాను. అయితే తొలిసారి ఈ సినిమాతో సింగర్ గా మారడం సింహద్వారం నుండి ప్లే బ్యాక్ సింగర్ అయినట్లు ఉంది’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో సురభి, పూనమ్ కౌర్, అంజి, రవిశంకర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మలినేని లక్ష్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

అభిమన్యుసింగ్, మంజు భార్గవి, చలపతిరావు, నర్సింగ్ యాదవ్, లక్ష్మయ్య చౌదరి తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి రచన: సమీర్ చంద్ర, పాటలు: సిరాశ్రీ, లైన్ ప్రొడ్యూసర్: ప్రసాద్ గుమ్ములూరి, ఎడిటర్: అన్వర్ అలీ, యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, మార్షల్ రమణ, ఆర్ట్: టి.నాగేంద్ర ఠాగూర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మ్యూజిక్: రవిశంకర్, సినిమాటోగ్రఫీ: అంజి, కో ప్రొడ్యూసర్: మలినేని లక్ష్మయ్య చౌదరి, నిర్మాతలు: వరుణ్, తేజ, శ్వేతలాన, సి.వి.రావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాంగోపాల్ వర్మ. 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved