pizza
Bheemavaram Bullodu music launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 December 2013
Hyderabad

ప్రతిష్టాత్మక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సునిల్ హీరోగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో డి. సురేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం 'భీమవరం బుల్లోడు'. ఎస్తర్ కథానాయిక. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఆదివారం (22.12) సునిల్ స్వస్థలం భీమవరంలో విడుదల చేశారు. డి.ఎన్.ఆర్. కాలేజీ గన్నాబత్తుల ప్లేగ్రౌండ్లో ఈ ఆడియో ఆవిష్కరణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో మార్కెట్లోకి విడుదలయ్యింది.

తొలి పాటను మాగంటిబాబు, గోకరాజు నరసింహరాజు, నాగేశ్వరరావు విడుదల చేశారు.
సూపర్ మాన్ థీమ్ సాంగ్ ను అంబికా కృష్ణ, ఎ.ఎస్.రాజు, రఘురామ రాజు ఆవిష్కరించారు.
మూడో పాటను జయప్రకాష్ రెడ్డి విడుదల చేశారు.
నాలుగో పాటను అశోక్ కుమార్ లాంఛ్ చేసారు.
ఐదో పాటను పృథ్వీ, అనూప్ ఆవిష్కరించారు.

ఆడియో సీడీని డి.సురేష్ బాబు ఆవిష్కరించారు.
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేదికపై సురేష్ బాబు కేక్ కట్ చేశారు.

మాగంటి బాబు మాట్లాడుతూ - "మా భీమవరంలో ఈ ఆడియో వేడుకను జరిపినందుకు సురేష్ బాబుకి ధన్యవాదాలు. ఈ పాటలు, సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఎంత నల్లగా ఉన్నా సునిల్ మా భీమవరం బుల్లోడే (నవ్వుతూ)'' అన్నారు.
గోకరాజు నరసింహరాజు మాట్లాడుతూ - ''మా కాలేజీలో చదువుకున్న సునీల్ ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉంది. సునీల్ ఎక్కడైతే ఆడుకున్నాడో అదే ప్లే బ్యాగ్రౌండ్లో ఈ ఆడియో వేడుక జరగడం మరింత ఆనందంగా ఉంది'' అన్నారు.

నాగేశ్వరావు మాట్లాడుతూ - ''ఇక్కడ మాకో థియేటర్ ఉంది. మా థియేటర్ లో విడుదలైన తొలి చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన సినిమానే కావడం విశేషం. మా భీమవరం బుల్లోడు సునీల్ నటించిన ఈ 'భీమవరం బుల్లోడు' సినిమా ఆడియో వేడుక ఇక్కడ జరగడం ఆనందంగా ఉంది'' అన్నారు.

అంబికా కృష్ణ మాట్లాడుతూ - ''50సంవత్సరాల చరిత్ర గల సురేష్ ప్రొడకన్స్ సంస్థ మొదటిగా ఎన్టీఆర్ తో 'రాముడు భీముడు' చిత్రాన్ని నిర్మించింది. ఆ సంస్థలో సినిమా చేయడం సునీల్ అదృష్టం. బొద్దుగా ఉండే సునీల్ సిక్స్ ప్యాక్ కి మారాడు. కష్టపడిన వాళ్ళు పైకి వస్తారనడానికి సునీల్ ఓ నిదర్శనం. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.

జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ - ''నేను సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడెక్ట్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. 50యేళ్ల లో  134 సినిమాలు నిర్మించిన ఘనత ఈ సంస్థది. ప్రస్తుతం భీమవరం  మీద ఓ మంచి సినిమా తీసారు. అందులో భీమవరం కుర్రాడు సునీల్ నటించడం విశేషం'' అని చెప్పారు.
చంద్రబోస్ మాట్లాడుతూ - ''రచయితగా నా ప్రయాణం ప్రారంభమైంది సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'తాజమహల్'తో. అప్పట్నుంచి పాటలు రాస్తూనే ఉన్నాను. ఇక నేను రాసిన పాటల్లో 'మౌనంగానే ఎదగమని...' పాటకు ప్రతిరూపం సునీల్'' అని తెలిపారు.

అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ - ''బంగారు పంటలు పండే భీమవరంలో ఈ వేడుక జరగడం, అది కూడా  సురేష్ ప్రొడక్షన్స్ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ సినిమా రూపొందడం విశేషం'' అన్నారు.

అశోక్ కుమార్ మాట్లాడుతూ - ''చిరంజీవిగారు ఎవరి సహాయం లేకుండా పైకి వచ్చిన వ్యక్తి. సునీల్ కూడా అంతే. కమెడీయన్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగాడు. నాకెప్పుడైనా టెన్షన్ గా ఉంటే సునీల్ కామెడీ చేసిన సన్నివేశాలను చూస్తూ నవ్వుకుంటాను. అందుకే తను హీరో అయినప్పుడు మంచి కమెడీయన్ని మిస్ అవుతున్నామని అనిపించింది. కానీ తన ఎదుగుదలకు ఆనందంగా ఉంది. చిరంజీవిగారు ఎలాగైతే డ్యాన్స్ చేస్తారో, సునీల్ కూడా అలానే చేస్తాడు. సో... తనలో చిరంజీవిగారిని చూసుకోవచ్చు'' అన్నారు.

ఉదయ్ శంకర్ మాట్లాడుతూ - "ఈ సినిమా బాగా రావడానికి ఇద్దరే కారణం. ఒకరు సురేష్ బాబు. మరొకరు ఈ భీమవరం బుల్లోడు సునిల్'' అని చెప్పారు.

సునిల్ మాట్లాడుతూ - ''ఒకప్పుడు ఇదే ప్రాంగణంలో నేను డాన్స్ చేశాను. అప్పట్లో మా మాస్టార్లు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇక్కడికి వచ్చినవాళ్లందరూ నా స్నేహితులు, ఆప్తులే. నేనీ స్థాయికి రావడానికి కారణం అందరి ఆశీస్సులే. 'వర్షం' సినిమా వేడుక ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడికి వచ్చాను. మళ్లీ ఇదే రావడం. నన్ను చూడటం కోసం ఇంతమంది వస్తారని ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. పది సినిమాల్లో చేసే కామెడీని ఈ ఒక్క సినిమాలో చేశాను. ఈ చిత్రం వంద రోజుల వేడుకను కూడా ఇక్కడే చేస్తాం. ఈ ఆడియో వేడుకకు విచ్చేసిన అం
దరికీ ధన్యవాదాలు'' అంటూ "వర్షంలో పిడుగు.. భీమవరంలో ఈ బుల్లోడి అడుగు పడితే దద్దరిల్లాల్సిందే' డైలాగ్ చెప్పారు.

ఈ వేడుకలో రాజా రవీంద్ర, గౌతంరాజు, శివపార్వతి, బెంగళూరు పద్మ తదితరులతో పాటు పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved