pizza
CBI Vs Lovers music launch
`సిబిఐ వ‌ర్సెస్ ల‌వ‌ర్స్` ఆడియో లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


4 March 2019
Hyderabad

ఇరుకళల‌ పరమేశ్వరి ప్రొడక్షన్స్ ప‌తాకంపై నెట్రంబాక హ‌రిప్ర‌సాద్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.హ‌రిత ప్రియా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం `సిబిఐ వర్సెస్ ల‌వర్స్‌`. వంశీ , జైన్ నాని, దివ్య‌, శ్రావ‌ణి నిక్కి జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సుమ‌న్‌, స‌త్య ప్ర‌కాష్ లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఘ‌న శ్యామ్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రం ఆడియో ఈ రోజు హైద‌రాబాద్ లోని ఫిలించాంబ‌ర్‌లో జరిగింది. తొలి సీడీని న‌టుడు సుమ‌న్ ఆవిష్క‌రించి మ‌రో న‌టుడు స‌త్య ప్ర‌కాష్ కు అందించారు.

అనంత‌రం సుమ‌న్ మాట్లాడుతూ...``సిబిఐ కు ల‌వ‌ర్స్ కు ముడిపెడుతూ ఒక ఇంట్ర‌స్టెంగ్ టైటిల్ లో సినిమా చేశాడు దర్శ‌కుడు. పాట‌లు, ట్రైల‌ర్ ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. ఇటీవ‌ల కాలంలో చిన్న సినిమాలు, కొత్తద‌నంతో కూడిన చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆదరిస్తున్నారు. ఆ కోవ‌లో ఈ సినిమా కూడా ఉంటుంది. ఇక ప్ర‌భుత్వాలు థియేట‌ర్స్ విష‌యంలో క‌ల‌గ‌జేసుకుని చిన్న చిత్రాల‌కు అండ‌గా నిలిస్తే ఇంకా ఎన్నో చిన్న చిత్రాలు వ‌చ్చి ఎంతో మందికి ప‌ని దొరుకుతుంది. అంతా కొత్త‌వారైనా ఎంతో హార్క్డ్ చేసి ఈ సినిమా చేశారు. నేను, స‌త్య ప్ర‌కాష్ ఇందులో మంచి పాత్ర‌లు చేసాము`` అన్నారు.

న‌టుడు స‌త్య ప్ర‌కాష్ మాట్లాడుతూ... `శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన ఈ ఆడియో ఫంక్ష‌న్ జ‌ర‌గ‌డం శుభ సూచ‌కం. పాట‌లు, ట్రైల‌ర్స్ బావున్నాయి. సినిమా క‌చ్చితంగా మంచి విజ‌యం సాధిస్తుంద‌న్నారు.

నిర్మాత ఎన్‌.హ‌రిత ప్రియా రెడ్డి మాట్లాడుతూ...``తొంద‌ర పాటు నిర్ణ‌యాల వ‌ల్ల స్టూడెంట్స్ ఎలాంటి ప‌రిణామాలు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంద‌నే కాన్సెప్ట్ తో ఈ సినిమా చేసాం. ద‌ర్శ‌కుడు చెప్పిన దానికంటే కూడా చాలా బాగా తీసారు. స్టూడెంట్స్, పేరెంట్స్ అంద‌రూ చూడాల్సిన చిత్ర‌మిది. టీమ్ అంద‌రూ ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న విధంగా సినిమా చేయగ‌లిగాము. దీని త‌ర్వాత `బ్ర‌హ్మ‌ముహూర్తం` అనే మ‌రో సినిమా నిర్మించ‌నున్నాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు నెట్రంబాక హ‌రి ప్ర‌సాద్ రెడ్డి మాట్లాడుతూ...`` త‌ప్పు చేసిన వారికి శిక్ష త‌ప్ప‌దు అనే సందేశం మా చిత్రం ద్వారా ఇస్తున్నాం. అలాగే అన్ని వ‌ర్గాల వారికి న‌చ్చే ఎంట‌ర్టైన్మెంట్ మా చిత్రంలో ఉంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తాం`` అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో కాదంబ‌ర్ కిర‌ణ్ తో పాటు వంశీ, జైన్ నాని, దివ్య , శ్రావణి నిక్కి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఘన శ్యామ్‌, సినిమాటోగ్ర‌ఫీ: వెంకయ్య; ఎడిటర్‌: వెంకటేశ్వర రావు; నిర్మాత: ఎన్‌.హరిత ప్రియా రెడ్డి, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః నెట్రంబాక హ‌రి ప్ర‌సాద్ రెడ్డి.

 


Photo Gallery (photos by G Narasaiah)

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved