pizza
Dandu Music Launch
‘దండు’ ఆడియో రిలీజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 March 2016
Hyderabad

నీరజ్ శామ్, సాయికుమార్, నేహ సక్సేనా, దిశా ప్రధాన తారాగణంగా మంగమూరి శేషగిరి రావు యశస్విని ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘దండు’. సంజీవ్ మేగోటి దర్శకత్వం, సంగీత దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దండు’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీవాస్, మల్టీడైమన్షన్ వాసు, ముప్పలనేని శివ, మల్కాపురం శివకుమార్, రాజ్ కందుకూరి, రామసత్యనారాయణ, సంధ్యారవి, నీరజ్ శామ్, నేహ సక్సేనా, తదితర చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. బిగ్ సీడీని శ్రీవాస్, ముప్పలనేనిశివ, ఆడియో సీడీలను మల్టీడైమన్షన్ వాసు, రామసత్యనారాయణ, మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా....

శ్రీవాస్ మాట్లాడుతూ ‘’కన్నడంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద సక్సెస్ ను సాధించాలి. సాంగ్స్ పిక్చరైజేషన్ బావుంది. రిచ్ గా కనపడుతున్నాయి. సాయికుమార్ పవర్ ఫుల్ పాత్రలో కననపడుతున్నారు. కమర్షియల్ సినిమాకున్న అన్నీ వాల్యూస్ ఉన్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించి యూనిట్ కు మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు.

మల్టీడైమన్షన్ వాసు మాట్లాడుతూ ‘’టీం వర్క్ తో చేసిన సినిమా. రీసెంట్ గా కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఇక్కడ కూడా పెద్ద సక్సెస్ సాధించి దర్శక నిర్మాతలకు, యూనిట్ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు.

Glam galleries from the event

ముప్పలనేని శివ మాట్లాడుతూ ‘’అల్రెడి చాలా రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగా నచ్చింది. ఇప్పుడు సాంగ్స్ చూశాను. బావున్నాయి. మాస్, క్లాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘’పవర్ ఫుల్ టైటిల్. సంధ్యా రవి కష్టపడి ఈ స్థాయిని చేరుకున్నాడు. ఈ సినిమాతో నిర్మాతగా మరింత మంచి స్థానాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. మ్యూజక్ బావుంది. యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

దర్శకుడు, సంగీత దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ‘’రెండున్నరేళ్ళు కష్టపడి తీసిన సినిమా. నా కుటుంబ సభ్యుల సహా అందరూ ఎంతో సపోర్ట్ గా నిలిచారు. మంగమూరి శేషగిరి రావు, సంధ్యారవి సహా పాతికమందికి దాకా నాకు అండగా దండులా సపోర్ట్ చేశారు. 1970-96 సంవత్సరాల్లో ఆదోనిలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా ఈ కథను తయారుచేసుకున్నాను. చిన్న సినిమాగా స్టార్ట్ చేస్తే మంచి కథ ఉండటం, అందరి సపోర్ట్ తో పెద్ద సినిమాగా రూపొందింది. కన్నడంలో శుక్రవారం ఈ సినిమాతో పాటు ఐదు సినిమాలు విడుదలైతే మా సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. పెద్ద సక్సెస్ అయింది. అలాంటి సక్సెస్ తెలుగు ప్రేక్షకులు కూడా అందిస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.

సంధ్యా రవి మాట్లాడుతూ ‘’దర్శకుడు, హీరో సహా అందరూ ఉన్న కమిట్ మెంట్ చూసి నేను సపోర్ట్ చేశాను. సినిమాకు అండగా నిలబడ్డ అందరికీ థాంక్స్ ‘’ అన్నారు.
రఘుబాబు, తులసి, ఢిల్లీ రాజేశ్వరి, గౌతం రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హరీస్ ఎస్.ఎన్, ఫైట్స్: థ్రిల్లర్ మంజు, సతీష్, శివ, డ్యాన్స్: కపిల్, ఆర్.కె, సాహిత్యం: పోతుల రవికిరణ్, విగినా రఫీ, సంగీతం: సంజీవ్ మెగోటి, ఎడిటింగ్: సర్వాణి శివకుమార్, అర్చన, సహ నిర్మాతలు: మెగోటి ఉమామహేశ్వరి, సత్యవతి, ఇ.రాము, లండన్ గణేష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంజీవ్ మేగోటి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved