pizza
Sunil's Jakkanna music launch
`జ‌క్క‌న్న` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 June 2016
Hyderabad

సునీల్, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం `జక్కన్న`. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దినేష్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన మెగాస్టార్ చిరంజీవి బిగ్ సీడీని విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను చిరంజీవి విడుద‌ల చేసి తొలి సీడీని హీరో సునీల్‌కు అందించారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మ‌న్నార్ చోప్రా, సినిమాటోగ్రాఫ‌ర్ విడుద‌ల చేశారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో గోల్డెన్ స్టార్ సునీల్‌, హీరోయిన్ మ‌న్నార్ చోప్రా, ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ అకెళ్ళ‌, నిర్మాత ఆర్‌.సుద‌ర్శ‌న్ రెడ్డి, సినిమాటోగ్రాప‌ర్ రాంప్ర‌సాద్‌, ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ దినేష్‌, ఎన్‌.శంక‌ర్‌, ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌, రాజ్‌త‌రుణ్‌, రాజార‌వీంద్ర‌, డిస్ట్రిబ్యూట‌ర్ సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ``సునీల్ నాపై చూపించే అభిమానం, అప్యాయ‌తే న‌న్నిక్క‌డికి ర‌ప్పించాయి. నేనంటే అభిమాన‌మ‌ని. నా డ్యాన్సుల‌ను స్టేజ్‌పై వేసి ఈ స్టేజ్‌కు వ‌చ్చాన‌ని సునీల్ ఎప్పుడు అంటుంటాడు. ఒక అభిమాని ఎదిగాడంటే త‌ల్లిదండ్రులు త‌ర్వాత గ‌ర్వించే వ్య‌క్తిని నేనే. ఈరోజు సునీల్ ఎంతో మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా నిల‌బ‌డ్డాడు. క‌ష్టాన్ని న‌మ్ముకుంటే సినిమా ప‌రిశ్రమ‌లో ఎవ‌రైనా ఎదుగుతార‌ని చెప్ప‌డానికి సునీల్ మంచి ఉదాహ‌ర‌ణ‌. సునీల్ త‌న‌ను తాను ట్రాన్స్‌ఫామ్ ఎలా చేసుకున్నాడో చూస్తుంటే ఆశ్చ‌ర్యంగా ఉంది. పుష్టిగా ఉండే సునీల్ కండ‌ల‌వీరుడిగా మారి అంద‌రినీ మోటివేట్ చేస్తున్నాడు. మ‌నిషి క‌ష్ట‌ప‌డితే ఏదైనా అనుకుంటే సాధించ‌గ‌లుగుతాడ‌న‌డానికి సునీల్ బెస్ట్ ఎగ్జాంపుల్‌. ఇప్పుడు ఈ సినిమాలో సునీల్ డ్యాన్సులు చూస్తుంటే మ‌న‌కున్న బెస్ట్ డ్యాన‌ర్స్‌ లో సునీల్ ఒక‌డని చెప్ప‌వ‌చ్చు. అలాగే కామెడి ప‌రంగా, హీరోయిజ‌మ్ ప‌రంగా జ‌క్క‌న్న చ‌క్క‌గా రూపుదిద్దుకుంద‌ని తెలుస్తుంది. ద‌ర్శ‌కుడు వంశీ ఈ చిత్రాన్ని చ‌క్క‌గా తెర‌కెక్కించాడ‌ని తెలుస్తుంది. ట్రైల‌ర్ చూస్తుంటే ప్యామిలీ డ్రామా, రొమాన్స్‌, కామెడి, యాక్ష‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్‌తో నిండు
గా క‌న‌ప‌డుతుంది. ఇది ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా అల‌రిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. సుద‌ర్శ‌న్ రెడ్డిగారు ఆయ‌న వంతు కృషితో సినిమాను చ‌క్క‌గా నిర్మించారు. దినేష్‌గారు టెక్నిషియ‌న్‌గా ఎంతో పేరు సంపాదించుకుని ఈ చిత్రంతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మారాడు. త‌న‌ని మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్నాను. సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంది. కొంత గ్యాప్ త‌ర్వాత వస్తున్న ఈ సినిమా సునీల్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందిస్తుంది`` అన్నారు.

హీరో సునీల్ మాట్లాడుతూ ``అన్నయ్య చిరంజీవిగారి సినిమాను లైన్ లో నిలబడి పోట్లాడి టికెట్ తీసుకుని సినిమా చూసి నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంత కంటే ఏం కావాలి. చిరంజీవిగారి వల్లే ఈరోజు నేనిక్కడ నిలబడి ఉన్నాను. ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నాకోసం ఇక్కడకు వచ్చారు.ఆయనకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అందుకే దేవుడు ఎవరికైతే బరువు మోయగలరో వారికే దాన్నిస్తాడు. ఇక సినిమా గురించి చెప్పాలంటే సినిమా అంతా కామెడీయే నిండి ఉంటుంది. కామెడికే బోర్ కొట్టేలా ప్ర‌తి స‌న్నివేశం ఉంటుంది. క‌థ కొత్త‌ద‌నంతో పాటు భ‌వానీ ప్ర‌సాద్ అద్భుత‌మైన డైలాగ్స్ రాశారు. సినిమాటోగ్ర‌ఫీ రాంప్ర‌సాద్‌గారు నన్నెంతో అందంగా చూపించారు. దినేష్ ఎంతో బ్యూటీపుల్ మ్యూజిక్ అందించారు. ద‌ర్శ‌కుడు వంశీ అకెళ్ళ నాతో పాటు రెండేళ్ళ పాటు ట్రావెల్ చేశాడు. కొత్త ఆలోచ‌న‌కు ఎంట‌ర్‌టైన్మెంట్ మిక్స్ చేసి తీసిన సినిమా ఇది. నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో విప‌రీత‌మైన కామెడి చేసిన సినిమా ఇది. సుదర్శ‌న్‌రెడ్డిగారి న‌మ్మ‌కంతోనే ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ర‌త‌న్‌రెడ్డి, ర‌ఘు, హ‌రీష్‌గారు ఎంతో అండ‌గా నిల‌బ‌డ్డారు. మ‌న్నార్ చోప్రా చాలా ఎన‌ర్జిటిక్‌గా న‌టించింది. మంచి హార్డ్‌వ‌ర్క‌ర్‌
. ఇక‌పై ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తాన‌ని ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమాకు స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌`` అన్నారు.

చిత్ర నిర్మాత ఆర్‌.సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ ``సునీల్‌తో సినిమా చేయాల‌నుకుంటే సునీల్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనడంతో ముందు భ‌య‌ప‌డ్డాను. కానీ నేను ఇంత దూరం రావ‌డానికి కార‌ణం సునీల్‌గారే. సినిమా కోసం త‌న స్వంత ఖ‌ర్చుతో కొంత మంది రైట‌ర్స్‌ను పెట్టుకుని క‌థ‌ను అందంగా రాయించుకున్నారు. ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి ఏకైక కార‌ణం సునీల్‌గారే. రాంప్ర‌సాద్‌గారు మంచి సినిమాటోగ్ర‌ఫీ అందివ్వగా, దినేష్‌గారు ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించారు. ప్ర‌తి ఒక్క‌రూ సినిమా బాగా రావ‌డానికి ఎంతో స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

Mannara Chopra Glam gallery from the event

ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ మాట్లాడుతూ ``నాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ దినేష్ త‌మ్ముడిలాంటివాడు. చాలా మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ ద‌గ్గ‌ర వెయ్యి సినిమాల‌కు పైగా కీ బోర్డ్ ప్లేయ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. హీరో సునీల్ క‌మెడియ‌న్ నుండి హీరోగా మార‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. ఆయ‌నంటే నాకు ఇష్టం. దినేష్ జ‌ర్నీ నాకు తెలుసు. చాలా క‌ష్ట‌ప‌డి వ‌చ్చాడు. ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ‌కు, నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డిగారు స‌హా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ దినేష్ మాట్లాడుతూ ``ఈ సినిమాలో నాపై న‌మ్మ‌కంతో అవ‌కాశం ఇచ్చిన సునీల్‌, ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ అకెళ్ళ‌, నిర్మాత సుద‌ర్శ‌న్‌రెడ్డిగారికి థాంక్స్‌. నా త‌ల్లిదండ్రుల కార‌ణంగానే నేను మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాగ‌లిగాను. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ ``చిరంజీవిగారు ఎవ‌రి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగారు. అలాగానే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకండా హీరో సునీల్ క‌మెడియ‌న్ నుండి హీరో స్థాయికి ఎదిగారు. నిర్మాత సుద‌ర్శ‌న్‌రెడ్డిగారితో చాలా కాలంగా మంచి ప‌రిచయం ఉంది. థ‌మ‌న్‌, దినేష్ నా సినిమాల‌కు కీబోర్డ్ ప్లేయ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. థ‌మ‌న్ త‌ర్వాత ఇప్పుడు దినేష్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మారుతున్నాడు. డైరెక్ట‌ర్ వంశీ జ‌క్క‌న్న అనే సినిమాను మ‌న ముందుకు తీసుకువ‌స్తున్నారు. అంద‌రికీ న‌చ్చే చిత్రంగా నిలుస్తుంది`` అన్నారు.

ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ ``సునీల్ గారు క‌మెడియ‌న్ నుండి హీరో స్థాయికి చాలా క‌ష్ట‌ప‌డి ఎదిగారు. సుద‌ర్శ‌న్‌రెడ్డిగారికి ఈ సినిమా మ‌రో స‌క్సెస్ ను సాధించి పెడుతుంది. రాంప్ర‌సాద్‌గారి సినిమాటోగ్ర‌ఫీ, దినేష్‌గారి మ్యూజిక్ సినిమాకు ప్ల‌స్ అవుతాయి. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

రాజ్‌త‌రుణ్ మాట్లాడుతూ ``సునీల్‌గారు హీరో కావ‌డం వ‌ల్ల తెలుగు ఇండ‌స్ట్రీ మంచి క‌మెడియ‌న్‌ను కోల్పోయింది. ఆయ‌న ప‌డే క‌ష్టం, వ‌ర్క్‌లో ఆయ‌న‌కున్న డేడికేష‌న్‌,, మంచిత‌నం మ‌రెవ‌రిలో చూడ‌లేం. వంశీకృష్ణ అకెళ్ళ‌, నిర్మాత సుద‌ర్శ‌న్‌రెడ్డి స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

మ‌న్నార్ చోప్రా మాట్లాడుతూ ``నాకు సినిమాలో ఎలా న‌టించాలి, సెట్‌లో ఎలా ఉండాలో తెలిసేది కాదు. నాకు యూనిట్ స‌భ్యులు ఎంతో స‌పోర్ట్ చేశారు.

కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, రాజా రవీంద్ర తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, మ్యూజిక్: దినేష్, ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, డైలాగ్స్: భవాని ప్రసాద్, కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి, నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved