pizza
Keshava music launch
`కేశ‌వ‌` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 May 2017
Hyderabad

దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై నిఖిల్‌,రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `కేశ‌వ‌`. స‌న్ని ఎం.ఆర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ జె.ఆర్‌.సి క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జ‌రిగింది. టీ న్యూస్ ఎండి సంతోష్‌ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేసి తొలి సీడీని గుణ‌శేఖ‌ర్‌, శ‌ర్వానంద్‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భ‌ర‌త్ నారంగ్‌, స‌మీర్‌, వెన్నెల‌కిషోర్‌, సుధాక‌ర్‌రెడ్డి, రాజా ర‌వీంద్ర‌, ప్రియ‌ద‌ర్శి, కృష్ణ‌చైత‌న్య‌, నిఖిల్ త‌ల్లిదండ్రులు వీణ‌, శ్యామ్‌, అభిషేక్ నామా తండ్రి మ‌ధుసూద‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...

సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ - ``అభిషేక్‌కు సినిమా అంటే పిచ్చి. త‌ను క‌చ్చితంగా పెద్ద ప్రొడ్యూస‌ర్ అవుతాడ‌ని ముందుగానే చెప్పాను. సుధీర్‌వ‌ర్మ‌, నిఖిల్ వంటి హిట్ కాంబినేష‌న్‌లో సినిమా చేయాల‌నుకోవ‌డం మంచి ప‌రిణామం.ఇది డెఫ‌నెట్‌గా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

నందినీ రెడ్డి మాట్లాడుతూ - ``అభిషేక్‌గారికి, వివేక్ కూచిబొట్ల అంద‌రికీ థాంక్స్‌. స్వామిరారా స‌మ‌యంలో సుదీర్‌వ‌ర్మ‌ను క‌లిశాను. అదే స‌మ‌యంలో సుదీర్‌కు, స‌న్నికి, నిఖిల్‌కు అభినంద‌న‌లు. నిఖిల్ రియ‌ల్ ఫైట‌ర్‌. ముందు ముందు మంచి సినిమాలు చేస్తాడ‌ని భావిస్తున్నాను`` అన్నారు.

రీతూవ‌ర్మ మాట్లాడుతూ - ``కేశ‌వ‌లో భాగం కావ‌డం సంతోషంగా ఉంది. అభిషేక్‌గారికి, సుధీర్‌వ‌ర్మ‌కు థాంక్స్‌. నిఖిల్ వండ‌ర్‌ఫుల్ కోయాక్ట‌ర్. స‌న్నిగారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఎంటైర్ టీంకు అబినంద‌న‌లు`` అన్నారు.

ఇషా గోపీక‌ర్ మాట్లాడుతూ - ``సుధీర్ వ‌ర్మ‌కు, అభిషేక్‌కు థాంక్స్‌. తెలుగు ఎక్కువ‌గా సినిమాలు చేయాల‌నుకుంటున్నాను`` అన్నారు.

అడివి శేషు మాట్లాడుతూ - ``నేను ముందుగానే ట్రైల‌ర్ చూశాను. చాలా బాగా న‌చ్చింది. తొలిరోజునే సినిమా చూడాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

చందు మొండేటి మాట్లాడుతూ - ``సుదీర్ వ‌ర్మ‌, నిఖిల్ నాకు ఇద్ద‌రూ మంచి స్నేహితులు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

శ‌ర్వానంద్ మాట్లాడుతూ - ``కేశ‌వ సినిమా ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మ నా ఫేవ‌రెట్ ద‌ర్శ‌కుల్లో ఒక‌రు. ఇలాంటి ద‌ర్శ‌కులు ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌స‌రం. నాతో కూడా ఒక సినిమా చేయ‌మ‌ని అడుగుతున్నాను. మ‌రి చూడాలి. అభిషేక్ పిక్చ‌ర్స్ డిస్ట్రిబ్యూష‌న్ నుండి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాతో వారికి మంచి హిట్ రావాలి. నిఖిల్ గురించి ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. త‌ను డిఫ‌రెంట్ జోన‌ర్స్ మూవీస్ చేసుకుంటూ హిట్ సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. త‌ను అలాగే మంచి స‌క్సెస్ సాధించాలి. రీతూ తెలుగు అమ్మాయి. త‌న‌తో కూడా క‌లిసి ప‌నిచేయాల‌ని అనుకుంటున్నాను. మా తమ్ముడు విక్ర‌మ్ ఆంధ్ర మొత్తం ఈ సినిమా హ‌క్కుల‌ను కొనుకున్నాడు. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

Glam galleries from the event

టీ న్యూస్ సంతోష్ మాట్లాడుతూ - ``నిఖిల్ స‌హా ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు`` అన్నారు.

గుణ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - ``స‌న్ని మ్యూజిక్ చాలా బావుంది. సన్ని ఎంత మంచి మ్యూజిక్ డైరెక్ట‌ర‌నే విష‌యాన్ని కీర‌వాణిగారు చెప్పేశారు. అంత కంటే గొప్ప‌గా మ‌నం చెప్ప‌లేం. కాల‌భైర‌వ స్తోత్రం వింటుంటే, బాహుబ‌లిలో శివ‌స్తోత్రం విన్న‌ప్పుడు వ‌చ్చిన పాజిటివ్ ఫీలింగ్ క‌లుగుతుంది. ట్రెడిష‌నల్ మ్యూజిక్‌ను ఇప్ప‌టి త‌రంలో అంద‌రికీ న‌చ్చేలా చేసిన స‌న్నిని అభినందిస్తున్నాను. సుధీర్‌వ‌ర్మ స్వామిరారాతో తెలుగు వారంద‌రికీ ప‌రిచ‌యం అయ్యారు. నిఖిల్ ప్ర‌తి సినిమాకు ట్రాన్స్‌ఫార‌మ్ చేసుకుంటూ వ‌రుస స‌క్సెస్‌లు సాధిస్తున్నాడు. త‌న‌ని తాను గొప్ప‌గా ప్రెజంట్ చేసుకుంటున్నాడు. సినిమాలోని ఐదు పాట‌లు డిఫ‌రెంట్‌గా ఉన్నాయి. సినిమా హోల్ టైం ఎంట‌ర్‌టైన‌ర్ అని చెప్ప‌వ‌చ్చు. సినిమా చూడాల‌ని కుతూహ‌లంగాఉంది. ఈ టీజ‌ర్‌ను అల్లుఅర్జున్ చాలా మెచ్చుకున్నారు. అభిషేక్ నామా డిస్ట్రిబ్యూట‌రే కాదు, గొప్ప ప్రేక్ష‌కుడు. త్వ‌ర‌లోనే గొప్ప నిర్మాత‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో నిలిచిపోతాడు. కొత్త‌గా ఉన్న సినిమాలు హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

స‌న్ని ఎం.ఆర్ మాట్లాడుతూ - ``సుధీర్, నిఖిల్ స‌హా అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

సుధీర్ వ‌ర్మ మాట్లాడుతూ - ``ఈ సినిమా జ‌ర‌గ‌డానికి కార‌ణం నిఖిల్‌. స్టోరీ విన‌గానే నిఖిల్ గానీ, అభిషేక్‌గారు వెంట‌నే సినిమా చేయ‌డానికి అంగీక‌రించారు. అభిషేక్‌గారు నెక్ట్స్ సినిమాను ఎప్పుడు చేద్దామ‌ని అంటున్నారు. దివాక‌ర్‌, సన్ని, ప్ర‌శాంత్ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌లో చూపించాను. నిఖిల్ నాకు బ్ర‌ద‌ర్‌. ఈ సినిమాలో డైరెక్ట‌ర్ అనుకున్న దానికంటే క్యారెక్ట‌ర్ ప‌రంగా బాగా చేశాడు. రీతూ, ఇషాగోపీక‌ర్‌గారు అద్భుతంగా చేశారు. ఇషాగారు సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్ చేశారు.స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

నిఖిల్ మాట్లాడుతూ - ``డిఫ‌రెంట్ సినిమా చేసేట‌ప్పుడు మ‌న‌కు స‌పోర్ట్ చాలా అవ‌స‌రం. ఆ స‌పోర్ట్ నాకు ప్రేక్ష‌కుల‌తో పాటు చందు, సుధీర్, చైతు, మీడియా అందించారు. నాకు రెస్పెక్ట్ ఇస్తుంది. అభిషేక్‌గారు నాకు పెద్ద‌న్న‌లాంటివాడు. ఆయ‌న వంద సినిమాలు చేసి పెద్ద ఎత్తుకు ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. మే 19న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తోన్న కేశ‌వ‌ను అంద‌రూ చూసి ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాను`` అన్నారు.

అభిషేక్ నామా మాట్లాడుతూ - ``సినిమా మే 19న విడుద‌లవుతుంది. సినిమాను పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్ట్‌: రఘు కులకర్ణి, కెమెరా: దివాకర్‌ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్‌. సమర్పణ: దేవాన్ష్‌ నామా, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, నిర్మాత: అభిషేక్‌ నామా, కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సుధీర్‌వర్మ.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved