pizza
KS 100 music launch
`KS 100` పాట‌లు విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


23 March 2019
Hyderabad

మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం "కెఎస్100".. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా కి షేర్ దర్శకత్వం వహిస్తున్నారు.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు న‌వ‌నీత్‌చారి సంగీతం అందించారు. ఈ సినిమా పాట‌ల‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ...

ల‌య‌న్ సాయివెంక‌ట్ మాట్లాడుతూ ``సిరాజ్ ఈ సినిమాతో షేర్‌గా మ‌న ముందుకు వ‌స్తున్నాడు. సిరాజ్ గ‌తంలో చాలా సినిమాల‌ను చేశాడు. గ‌తంలో షాలిని అనే చిన్న సినిమాను వంద‌రోజులు సినిమాను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేయించాడు. ఈరోజు షేర్‌గా పేరు మార్చుకుని స‌మీర్‌ఖాన్‌తో సినిమా చేస్తున్నాడు. ఆర్‌.ఎక్స్ 100 సినిమాను పోలి ఈ సినిమా ఉంటుందా? అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇది దాన్ని మించి ఉండేలా షేర్ డిజైన్ చేసుకున్నాడు. త‌ప్ప‌కుండా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.

నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ - ``ఈ సినిమా చేయ‌డానికి కార‌ణం డైరెక్ట‌ర్ షేర్‌గారే. క‌థ విన‌గానే న‌చ్చింది. షేర్‌ను ప్రోత్స‌హించాను. త‌ను మంచి బ‌డ్జెట్‌లో సినిమాను నీట్‌గా రూపొందించారు`` అన్నారు.

హీరో స‌మీర్ ఖాన్ మాట్లాడుతూ - ``ఆడియో విడుద‌లైంది. టైటిల్‌కు అర్థ‌మేంట‌ని చాలా మంది అడుగుతున్నారు. అయితే సినిమా చూడాల్సిందే. సోష‌ల్ మీడియాలో టైటిల్‌పై వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేదు. కుటుంబం అంతా క‌లిసి చూసే సినిమా. హార‌ర్ కంటెంట్ కూడా ఉంది. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ న‌వనీత్ చారి మాట్లాడుతూ - ``పాట‌ల‌న్నీ చాలా బాగా వ‌చ్చాయి. అలాగే మా గురువుగారు రాంమోహ‌న్‌గారు బ్యాగ్రౌండ్ స్కోర్‌ను చ‌క్క‌గా అందించారు. త‌ప్ప‌కుండా సినిమా ప్ర‌తి మూమెంట్ మెప్పించేలా ఉంటుంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు షేర్ మాట్లాడుతూ - ``సిరాజ్ అనే నా పేరును ఈ సినిమా కోసం షేర్‌గా మార్చుకున్నాను. ఇదొక హార‌ర్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌, రొమాన్స్ కూడా ఉంటుంది. ఈ సినిమాను అమ్మాయిల కోసం తీశాను. అమ్మాయిలు దారుణ‌మైన ప‌రిస్థితుల‌ను ఫేస్ చేస్తున్నారు. వారి ప్ర‌తి అడుగులో ధైర్యం, ఇన్‌స్పిరేష‌న్ ఇద్దామ‌ని ఈ సినిమా తీశాను. న‌వీన‌త్‌, రామ్మోహ‌న్ మంచి సంగీతం అందించారు. స‌మీర్‌ఖాన్ ఇంట‌ర్నేష‌న్ మోడ‌ల్ హీరోగా న‌టించాడు. అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. ఆడియెన్‌లా ఫీలై ఈ సినిమా చేశాను. ఆర్టిస్టులంద‌రికీ చాలా మంచి పేరు తెస్తుంది. 100 శాతం ఈ సినిమా సూప‌ర్‌హిట్ అవుతుంది`` అన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved