pizza
Lakshmi music launch
'లక్ష్మి' ఆడియో ఆవిష్కరణ
You are at idlebrain.com > News > Functions
Follow Us


12 August 2018
Hyderabad

ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకాలపై ప్రభుదేవా, ఐశ్వర్య రాజేశ్‌, బేబి దిత్య, సల్మాన్‌ యూసఫ్‌ ఖాన్‌, కొవై సరళ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'లక్ష్మి'. శామ్‌ సి.ఎస్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్‌ను జాగర్లమూడి క్రిష్‌ ఆవిష్కరించారు. ఆడియో సీడీల‌ను వి.వి.వినాయ‌క్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా...

ప్ర‌భుదేవా మాట్లాడుతూ - ``క‌ల్యాణ్‌గారితో తొలిసారి చేస్తున్న సినిమా ఇది. ప్ర‌మోద్‌, శృతి, ర‌వి నిర్మాత‌లు. నేను ముంబై వెళితే డైరెక్ట‌ర్‌ని అయిపోతాను. చెన్నై వెళితే హీరో అయిపోతాను. తెలుగు రాష్ట్రాల‌కు వ‌స్తేనే డాన్స్ మాస్ట‌ర్‌ని అయిపోతుంటాను. వినాయ‌క్‌, క్రిష్‌ల‌కు థాంక్స్‌. ఇక్క‌డ‌కు వ‌స్తే.. పుట్టింటికి వ‌చ్చిన‌ప్ప‌టి ఫీలింగ్ క‌లుగుతుంది. నేను ముంబైలో దర్శ‌కుడిగా స‌క్సెస్ సాధించిన సినిమాలు వాంటెడ్‌, రౌడీ రాథోడ్ చిత్రాలు తెలుగు చిత్రాలే. నేను ఎద‌గ‌డానికి తెలుగు సినిమాలే కార‌ణం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డాన్స్ ఫిలిం అనే కాదు.. మంచి ఎమోష‌న‌ల్ మూవీ. పిల్ల‌లు డాన్స్‌తో మెప్పించ‌డ‌మే కాదు.. ఏడిపిస్తారు. విజ‌య్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బెస్ట్ ఫిలిం ఇది. ఐశ్వ‌ర్య రాజేశ్‌, స‌త్యం రాజేశ్‌, స‌త్యం అందరితో చ‌క్క‌గా న‌టించారు. పిల్ల‌లు చ‌క్క‌గా డాన్సులు చేశారు. దిత్య చాలా చ‌క్క‌గా డాన్స్ చేసింది. డాన్స్ ఫిలిం చేయాల‌ని విజ‌య్ వ‌చ్చి చెప్ప‌గానే.. డాన్స్ ఫిలిం అంటే ఓ లెవ‌ల్‌లో చేయాలి.. లేకుంటే చెయ్యొద్దు అన్నాను. ప‌రావాలేదు.. చేద్దాం సార్ అన్నారు. అన్న‌ట్లుగా ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్క డాన్స‌ర్‌ను తీసుకొచ్చారు. వి
జ‌య్ ట్రెమెండ‌స్‌గా సినిమా చేశారు`` అన్నారు.

డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్ మాట్లాడుతూ - ``న‌న్ను న‌మ్మి సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన నిర్మాత‌ల‌కు థాంక్స్. తెలుగులో స‌పోర్ట్ చేస్తున్న క‌ల్యాణ్‌గారికి థాంక్స్‌. అసిస్టెంట్ డాన్స్ మాస్ట‌ర్స్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా స‌పోర్ట్ చేశారు. ప్రభుదేవాగారు న‌టుడుగానే కాదు, గాడ్‌ఫాద‌ర్‌లాగా ఈ సినిమాకు మాకు స‌పోర్ట్ అందించారు. అభినేత్రి త‌ర్వాత ల‌క్ష్మి సినిమా చేశాను. ప్ర‌భుదేవాగారు అద్భుత‌మైన క్రియేట‌ర్‌. సినిమాటోగ్రాఫ‌ర్‌గా నిర‌వ్‌షాకు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ శామ్‌కి అభినంద‌న‌లు. ఇక సినిమాలో న‌టించిన చిన్న‌పిల్ల‌లు సినిమా షూటింగ్ స్టార్ట్ కావ‌డానికి ముందు 75 రోజులు ప్రాక్టీస్ చేశారు. అందరికీ థాంక్స్‌`` అన్నారు.

సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``ఈ లక్ష్మి సినిమాను చాలా ఇష్ట‌ప‌డి తెలుగులో విడుద‌ల చేస్తున్నాను. అందుకు కార‌ణం ప్ర‌భుదేవాగారు. డాన్స్ అంటే ఏమిటో.. వాళ్ల‌లో సెంటిమెంట్స్‌, ఎటాచ్‌మెంట్స్‌, రివేంజ్ ఎలా ఉంటుంది అనేది ఈసినిమాలో చూడొచ్చు. డైరెక్ట‌ర్ విజ‌య్ నాకు అబ్బాయిలాంటోడు. త‌న తండ్రితో నాకు మంచి అనుబంధం ఉంది. విజ‌య్‌తో సెన్సేష‌న‌ల్ సినిమా చేయ‌బోతున్నాం. ఓ బయోగ్ర‌ఫీ అనౌన్స్ చేయ‌బోతున్నాం. ఇక ల‌క్ష్మి సినిమా విష‌యానికి వ‌స్తే.. మంచి ఫీల్‌తో సాగే చిత్ర‌మిది. ఐశ్వ‌ర్య రాజేశ్ తెలుగు అమ్మాయి. చ‌క్క‌టి పెర్ఫార్మ‌ర్‌. ఈ నెల 24న సినిమా విడుద‌ల‌వుతుంది. క‌చ్చితంగా పెద్ద స‌క్సెస్ అవుతుంది`` అన్నారు.

వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ - ``ఇక్క‌డున్న పిల్ల‌లు భ‌విష్య‌త్‌లో మంచి స్థానాల‌ను పొందుతారు. ఇండ‌స్ట్రీలో ప్ర‌భుమాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా, న‌టుడిగా, డైరెక్ట‌ర్‌గా లైమ్ లైట్‌లో ఉన్నారు. త‌మిళ‌నాడు, ఆంధ్ర‌లో క్రేజ్ ఉండొచ్చు. కానీ ముంబైలో కూడా ఆయ‌న‌కు గొప్ప రెస్పెక్ట్ ఉంది. అది మామూలు విష‌యం కాదు. డైరెక్ట‌ర్ విజ‌య్ అర్థ‌వంత‌మైన సినిమాలు చేస్తుంటారు. మంచి అవార్డులు సాధించారు. సినిమా పెద్ద హిట్ అవుతుంది. నా కెరీర్‌లో నేను డైరెక్ట్ చేసిన ల‌క్ష్మి సినిమా టైటిల్‌నే ఈ సినిమాకు పెట్టినందుకు చాలా ఆనంద‌మేసింది. క‌ల్యాణ్‌గారికి ఈ సినిమా లైఫ్ లాంగ్ ఓ జ్ఞాప‌కంగా ఉండిపోతుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ శామ్‌, కెమెరా మెన్ నీర‌వ్ షాకు థాంక్స్‌`` అన్నారు.

బేబి దిత్య మాట్లాడుతూ - ``విజ‌య్‌గారు న‌న్ను న‌మ్మి నాకు సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. తెలుగు, త‌మిళంలో సినిమా చేసే క్ర‌మంలో విజ‌య్‌గారు.. ఆయ‌న టీమ్ నాకు స‌హ‌కారం అందించారు. ప్ర‌భుగారికి, విజ‌య్‌గారికి థాంక్స్`` అన్నారు.

ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ మాట్లాడుతూ - ``క‌ళ‌ల‌కు హ‌ద్దులు, ప్రాంతాలుండ‌వు అని న‌మ్మే క‌ల్యాణ్‌గారితో మంచి అనుబంధం ఉంది. ప్ర‌భుదేవాగారంటే ఎంతో అభిమానం. ఆయ‌న అంద‌రికీ ప్రేమికుడు. ల‌క్ష్మి అంద‌రికీ విజ‌యాన్ని తెచ్చిపెడుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు.

జాగర్లమూడి క్రిష్‌ మాట్లాడుతూ - ''నాకు డైరెక్టర్‌ విజయ్‌ బ్రదర్‌లాంటివాడు. ఇద్దరం ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్‌ చేశాం. ఇక ప్రభుదేవాగారికి సరైన శిష్యులు దొరికినట్లు ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తుంది. కాస్త ఫుటేజ్‌ చూశాను. ఈ డాన్స్‌ సెలబ్రేషన్స్‌ను తెరపై చూడాలనుకుంటున్నాను. తప్పకుండా అందరినీ సినిమా మెప్పిస్తుంది'' అన్నారు.

మురళీమోహన్‌ మాట్లాడుతూ - ''సాంగ్‌ చూస్తుంటే సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతుంది. రొటీన్‌ సినిమాలను మాత్రమే చూసే ప్రేక్షకులు.. వైరటీ సినిమాలను చక్కగా ఆదరిస్తున్నారు. ఇంటర్నేషనల్‌ మూవీ చూస్తున్నట్లు ఉంది. పిల్లలు చేసే డాన్సులు చూస్తుంటే సినిమా బ్రహ్మాండమైన హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను'' అన్నారు.

సత్యం రాజేశ్‌ మాట్లాడుతూ - ''డైరెక్టర్‌ విజయ్‌గారు చాలా తక్కువగా మాట్లాడుతారు. కానీ ఎక్కువ పనిచేస్తారు. ఓ వయసు వచ్చిన తర్వాత ప్రభుదేవాగారిని చూస్తూ ఉన్నాను. సినిమా షూటింగ్‌కి వెళ్లిన తర్వాత ప్రభుదేవాగారినే చూస్తుండిపోయాను. సినిమా గురించి చెప్పాలంటే దిత్య.. డాన్సులతో అదరగొట్టింది. అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌'' అన్నారు.

ఐశ్వ‌ర్య రాజేశ్ మాట్లాడుతూ - ``20 త‌మిళ చిత్రాలు, మ‌ల‌యాళం, హిందీ సినిమా చేశాను. తెలుగు అమ్మాయి అయిన నేను .. తెలుగులో మాత్రం సినిమా చేయ‌లేదే అని ఆలోచించేదాన్ని ఆ స‌మ‌యంలో విజ‌య్‌గారు న‌న్ను క‌లిసి ల‌క్ష్మి సినిమా గురించి చెప్పి ఇది.. తెలుగు, త‌మిళ బై లింగ్వుల్ మూవీ అని చెప్పారు. ఈ సినిమాలో దిత్య అమ్మ పాత్ర‌లో న‌టించాను. ల‌క్ష్మి చాలా మంచి మూవీ. అంద‌రికీ గుర్తుండిపోయే క్యారెక్ట‌ర్‌. ప్ర‌భుదేవాగారితో క‌లిసి న‌టించినందుకు థాంక్స్. కుటుంబం అంతా క‌లిసి చూసే చిత్ర‌మిది. మ‌రో తెలుగు సినిమాలో న‌టించబోతున్నాను. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ`` అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: శామ్‌ సి.ఎస్‌, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, ఎడిటింగ్‌: అంథోని, కథ: విజయ్‌, నిరవ్‌షా, మాటలు: సత్య, సాహిత్యం: వనమాలి, కొరియోగ్రఫీ: పరేశ్‌ శిరోద్కర్‌, రుయేల్‌ డౌశాన్‌ వరిండని, షాంప శొంతాలయ, నిర్మాణం: ప్రమోద్‌ ఫిలింస్‌ ప్రతీక్‌ చక్రవర్తి, శృష్టి నల్లప్ప, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ ఆర్‌.రవీంద్రన్‌, రచన, దర్శకత్వం: విజయ్‌

 

 

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved