pizza
Law music launch
నవంబర్ 23న రిలీజ్ అవుతున్న ‘‘లా’’ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుంది- అంబికా కృష్ణ
You are at idlebrain.com > News > Functions
Follow Us


12 November 2018
Hyderabad

కమల్ కామరాజు,మౌర్యాణి, పూజా రామచంద్రన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన మూవీ ‘‘లా’’ (లవ్ అండ్ వార్). గగన్ గోపాల్ ముల్కా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని శ్రీ విఘ్నేశ్వర ఫిలింస్ బ్యానర్ మీద రమేష్ బాబు మున్నా,మద్దిపాటి శివ సంయుక్తంగా నిర్మించారు.సత్య కశ్యప్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ పాటలను సోమవారం విజయవాడలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు.తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అట్టహాసంగా జరిగిన ఈ ఆడియో ఫంక్షన్ కు ఆంధ్రప్రదేశ్ ఎఫ్.డి.సి చైర్మైన్ అంబికా కృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

అంబికా క్రిష్ణ మాట్లాడుతూ
‘‘లా’’ టైటిల్ చాలా బాగుంది..‘‘లా’’ కి ‘‘లవ్ అండ్ వార్’’ అని కొత్త అర్థం చెప్పారు డైరెక్టర్ గగన్ గోపాల్ గారు. హీరో కమల్ కామరాజు,మౌర్య ఇద్దరు చాలా అందంగా ఉన్నారు.ఇద్దరికీ మంచి పేరు వస్తుందని నేను నమ్ముతున్నాను.. ఈ మధ్య కొత్త జీవోను తీసుకొచ్చాం..4 కోట్ల రూపాయల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా తీస్తే టాక్స్ లన్నీ రద్దు చేస్తాం. అంతేగాకుండా లొకేషన్లు అన్నీ ఫ్రీ గా ఇస్తాం.‘‘లా’’ మూవీ లాంటి టీమ్ ను ఎంకరేజ్ చేసేందుకే ఇలాంటి జీవోను తీసుకొచ్చాం.ఈ అవకాశాన్ని అందరు ఉపయోగించుకోవాలి.ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని టీమ్ అందరికీ విషెస్ తెలియజేస్తున్నాను.

హీరో కమల్ కామరాజు మట్లాడుతూ:
విజయవాడలో మా సినిమా ఆడియో లాంచ్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఎఫ్.డి.సి చైర్మైన్ అంబికా కృష్ణ గారికి స్పెషల్ థాంక్స్.డైరెక్టర్ గగన్ రాసిన ఈ మూవీ స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలం..ఈ సినిమాకు స్క్రిప్ట్ యే హీరో..మౌర్యాని,పూజ రోల్స్ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ సినిమా నేను చేయడానికి ప్రధాన కారణం ఈ కథే.మంచి ట్విస్టులు ఉంటాయి. నిర్మాతలు రమేష్ బాబు మున్నా,మద్దిపాటి శివ లేకపోతే ఈ సినిమాలేదు.చాలా సపోర్ట్ ఇచ్చారు.ఈ సినిమా కోసం టెక్నీషియన్లందరూ చాలా కష్టపడ్డారు.వాళ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.నవంబర్ 23న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.దయచేసి అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను.

హీరోయిన్ మౌర్యాని మాట్లాడుతూ:
లవ్ అండ్ వార్ మూవీ ని చాలా ఇష్టపడి చేసిన మూవీ.అందరికీ మంచి ఇంపార్టెన్స్ ఉన్న సినిమా అది.చాలా ట్విస్టులున్నాయి ఈ సినిమాలో.నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరూ గెస్ చేయలేరు.షూటింగ్ అంతా విజయవాడలోనే తీసాం.కమల్,పూజ రామచంద్రన్,మంజు భార్గవి గారితో వర్క్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది..ఈ సినిమా దయచేసి చూడండి.అందరికీ నచ్చుతుంది.

పూజా రామచంద్రన్ మాట్లాడుతూ:
ఈ రోజు విజయవాడలో ‘‘లా’’ ఆడియో లాంచ్ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది.డిఫరెంట్ కాన్పెప్ట్ ఉన్న సినిమా ‘‘లా’’ నా రోల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.డైరెక్టర్ గగన్ గారికి,ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్స్.

మ్యూజిక్ డైరెక్టర్ సత్య కశ్యప్ మాట్లాడుతూ:
లా మూవీకి సంగీతం అదించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గగన్ గారికి,నిర్మాత మున్నా గారికి చాలా థాంక్స్.ఈ పాటలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నా.

డైరెక్టర్ గగన్ గోపాల్ మాట్లాడుతూ:
మా ‘‘లా’’ మూవీ కథను అందరు ఆర్టిస్టులు ఒకే సిట్టింగ్ లో ఓకే చేశారు.కొత్త డైరెక్టర్ అయినా కానీ నాకు అందరూ బాగా సపోర్ట్ చేశారు.ముఖ్యంగా కమల్ కామరాజు,మౌర్యాని,పూజా లు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చాలా కో ఆపరేట్ చేశారు.. ప్రొడ్యూసర్లు మూవీ చూసిన తర్వాత మనమే రిలీజ్ చేద్దాం అని కాన్ఫిడెంట్ ఇచ్చారు.

ప్రొడ్యూసర్ రమేష్ బాబు మాట్లాడుతూ:
‘‘లా’’ మూవీ చూసి నచ్చితే పది మందికి చెప్పండి,నచ్చకపోతే వంద మందికి చెప్పండి కానీ తప్పకుండా మూవీ చూడండి.

నటి మంజు భార్గవి మట్లాడుతూ:
డైరెక్టర్ గగన్ గారు నేను సీరియల్స్ చేస్తున్నప్పటి నుండి పరిచయం..ఓ సినిమా తీస్తున్నాను క్యారెక్టర్ చేయాలన్నారు.కథ కూడా చాలా బాగుంది.మంచి పాయింట్ తో రాబోతున్న ఈ మూవీని అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా.

నవంబర్ 23న రిలీజ్ కాబోతున్న ‘లా’ చిత్రంలో పూజా రామచంద్రన్, మంజుభార్గవి, ఛత్రపతి శేఖర్ , రవి మల్లాడి కీలక పాత్రలు పోషించారు.

లా( లవ్ అండ్ వార్)
ఆర్టిస్ట్స్ :. కమల్ కామరాజు,మౌర్యాణి,పూజా రామచంద్రన్,మంజు భార్గవి,ఛత్రపతి శేఖర్,రవి మల్లేడి,క్రిష్ఱమూర్తి,వానపల్లి పెద్దిరాజు,నవనీత్,అవంతిక

టెక్నిషియన్స్:

లిరిక్స్: పూర్ణశర్మ, కరణాకర్,
ఆర్ట్ : నూరిశెట్టి ఉత్తమ్ కుమార్,
కొరియోగ్రఫి: రాజ్ పైడి,
ఫైట్స్: డ్రాగెన్ ప్రకాశ్,
ఎడిటింగ్: ఎస్. ఎస్. సుంకర
కెమెరామెన్: పి. అమర్ కుమార్
మ్యూజిక్: సత్య కశ్యప్
పి ఆర్ ఓ : జి యస్ కె మీడియా
ప్రొడక్షన్ కంట్రోలర్ : కామిరెడ్డి బాబు రెడ్డి
సహానిర్మాత : మద్దిపాటి శివ,
నిర్మాత : రమేష్ బాబు మున్నా,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: గగన్ గోపాల్ . ముల్కా

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved