pizza
Lakshmi Devi Samarpinchu Nede Choodandi Music Launch
'
లక్ష్మీదేవీ సమర్పించు నేడే చూడండి` ఆడియో ఆవిష్కరణ
You are at idlebrain.com > News > Functions
Follow Us

9 August 2016
Hyderaba
d

కృష్ణజననిఅఖిల్‌భార్గవిచరణ్‌ప్రజ్ఞ జంటలుగా కలర్స్‌ అండ్‌ క్లాప్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో జాకి అతిక్‌ దర్శకత్వంలో మేరువ సుబ్బారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం'లక్ష్మీదేవీ సమర్పించు నేడే చూడండి`.  శ్రీకోటి సంగీతం అందించిన  సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ముఖ్యఅతిథిగా పాల్గొని థియేట్రికల్ ట్రైలర్, బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీలను సీనియర్ నరేష్, తనికెళ్ళభరణి అందుకున్నారు. ఈ సందర్భంగా....

దర్శకరత్నడా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ ``కొత్త టీం కలిసి చేసిన ప్రయత్నమిది. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆడియో వేడుకకు వచ్చాను. ఇప్పుడు సినిమాలు తీయడం కాదు. వాటిని విడుదల చేయడం కష్టమైంది. విడుదలైనా ప్రేక్షకులకు సరైన ప్రమోషన్స్ లేక తెలియకుండానే పోతున్నాయి. అలాగే ఈ చిత్ర నిర్మాతలు కూడా ప్రమోషన్స్ విషయంలో కేర్ తీసుకోవాలి. ఈ కథ విన్నాను. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి సినిమా తీయడమే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇది అందరికీ కూడా నచ్చే చిత్రం కావాలని కోరుకుంటూ యూనిట్ సభ్యులను అభినందిస్తున్నాను`` అన్నారు.

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ ``నా ఆప్తమిత్రుడు గౌతంరాజు తనయుడు కృష్ణ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. నాకెంతో సంతోషంగా ఉంది. టైటిల్ చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. సినిమా కూడా మంచి ఎంటర్ టైనింగ్ ఉంటుందని భావిస్తూ యూనిట్ కు మంచి పేరు తెచ్చే చిత్రంగా ఇది నిలవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.  

సి.జె.శోభ మాట్లాడుతూ ``నిర్మాత‌లు చాలా మంచి కాన్సెప్ట్‌ తో సినిమా చేశారు. సినిమా పూర్త‌య్యింది. మంచి క‌థ‌. ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటూనే నేటి నిర్మాత‌ల ప‌రిస్థితిని తెలియ‌జేసే చిత్రం ఈ నిర్మాత‌లు మంచి అవ‌గాహ‌నతో ముందుకెళ్తున్నార‌ని తెలుస్తుంది`` అన్నారు.

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ``సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ యూనిట్ కు అభినందనలు తెలియజేస్తున్నాను`` అన్నారు.

Glam galleries from the event

శివాజీ రాజా మాట్లాడుతూ ``ఈరోజుల్లో సినిమాలు తీయడమే కష్టం. చిన్న సినిమాలు హిట్ కావాలి. దాని వల్ల ఇండస్ట్రీకి హుషారు వస్తుంది. కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి`` అన్నారు.

గౌతంరాజు మాట్లాడుతూ ``నాకు ఇష్టం లేకపోయినా మా అబ్బాయి తన ఇష్టంతో ఇండస్ట్రీలోకి వస్తున్నాడు. సినిమాలో ఓ పాత్ర కోసం నిర్మాతలు నా వద్దకు వచ్చారు. హీరో కోసం వెతుకుతున్నారని తెలిసి మా అబ్బాయి గురించి చెప్పాను. వారు మా అబ్బాయిని చూడగానే నచ్చడంతో హీరోగా చేయమని అడిగారు. అలా తను ఈ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందుకు తనకు థాంక్స్`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకోటి మాట్లాడుతూ ``దర్శకుడు జాకీ అతిక్ నేను చేసిన ఆల్బమ్ విని నాకు సంగీతం చేసే అవకాశం ఇచ్చారు. మంచి మ్యూజిక్ కుదిరింది. దర్శక నిర్మాతలకు థాంక్స్. సిరాజ్ గారు క్వాలిటీ కోసం ఎక్కడా రాజీ పడకుండా అవుట్ పుట్ రాబట్టుకున్నారు. మా సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరకుంటున్నాను`` అన్నారు.

సహ నిర్మాత సిరాజ్ మాట్లాడుతూ ``ఈ సినిమా మేకింగ్ విషయంలో సుబ్బారెడ్డిగారు, కృష్ణారెడ్డిగారు ఎంతగానో సపోర్ట్ చేశారు. డిస్ట్రిబ్యూటర్స్ గా గత పదిహేనేళ్లుగా ఇండస్ట్రీని చూస్తున్నాం. జాకీ అథిక్ చెప్పిన లైన్ నచ్చడంతో కాన్సెప్ట్ ను డెవలప్ చేశాం. అందుకు తగిన విధంగా నటీనటులను ఎంచుకున్నాం. 45నిమిషాల పాటు ఉండే విఎఫ్.ఎక్స్ చాలా హైలైట్ గా ఉంటుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.

నిర్మాత యం.సుబ్బారెడ్డి మాట్లాడుతూ `` ఈ సినిమా త‌ప్ప‌కుండా మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని అనుకుంటున్నాను`` అన్నారు.

దర్శకుడు జాకీ అతిక్ మాట్లాడుతూ ``నిర్మాతలు, నటీనటులు, టెక్నిషియన్స్ సపోర్ట్ తో మంచి సినిమాను చేశాం. ప్రేక్షకుల సహకారం ఉండాలని కోరుకుంటున్నాం`` అన్నారు.

సీనియ‌ర్ న‌రేష్‌సిజెశోభ‌గుండు సుదర్శన్,  తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు

ఈ చిత్రానికి సంగీతం : శ్రీకోటిఫొటోగ్రఫీ: రఘు.ఆర్‌.బళ్ళారిసహనిర్మాత : సిరాజ్‌నిర్మాత : మేరువ సుబ్బారెడ్డి,  క‌థ,మాటలు,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: జాకి అతిక్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved