pizza

Love Cheyyala Vadda music launch

ల‌వ్ చేయాలా వ‌ద్దా పాట‌లు విడుద‌ల‌

You are at idlebrain.com > News > Functions
Follow Us

13 February 2016
Hyderabad

జికె సినిమాస్ ప‌తాకంపై రూపొందుతున్న సినిమా ల‌వ్ చేయాలా వ‌ద్దా. ఫాల్ ఇన్ ల‌స్ట్ అనేది ఉప‌శీర్షిక‌. ఈ సినిమాలో కార్తిక్ హీరో. జి.వి.ర‌మ‌ణ‌, సి.సంతోష్ కుమారి నిర్మాత‌లు. జి.నౌషాద్ ద‌ర్శ‌కుడు. ఎస్‌.బి. ఉద్ధ‌వ్ ఎడిటింగ్ చేశారు. గౌత‌మ్ డానీ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఆడియో వేడుక హైద‌రాబాద్‌లో శ‌నివారం రాత్రి జ‌రిగింది. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ పాల్గొని సీడీల‌ను ఆవిష్క‌రించారు.

తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ ``ల‌వ్ చేయాలా వ‌ద్దా అనే ఈ సినిమాను పూర్తిగా వైజాగ్ వారే తీశారు. ఈ ఆడియో హిట్ కావాలి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా వైజాగ్‌లో చేస్తే బావుంటుంది. క‌ల్యాణ్ కృష్ణ చాలా మంచి హిట్ ఇచ్చాడు. అత‌నిలాగా ఇప్పుడు వ‌చ్చే ద‌ర్శ‌కులు కూడా విన‌యంగా ఉండాలి. ఒక సినిమా హిట్ కాగానే ఎవ‌రితో మాట్లాడితే ఎవ‌రేం దోచుకుపోతారోన‌న్న‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు. ఇక్క‌డ ఎవ‌రూ ఎవ‌రినీ ఏమీ చేయ‌రు. చిన్న సినిమాలు స‌క్సెస్ అయి చాలా మంది నిర్మాత‌లు రావాలి. వైజాగ్ కూడా సినిమా హ‌బ్ కావాలి`` అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ``వైజాగ్‌లో టాలెంట్‌కి కొద‌వ‌లేదు. నేను, మా బ్ర‌ద‌ర్ చాలా క‌ష్ట‌ప‌డి పైకొచ్చాం. హాలీవుడ్ స్థాయిలో వైజాగ్ పేరు మారుమోగిపోవాలి`` అని తెలిపారు.

Glam galleries from the event

కార్తిక్ మాట్లాడుతూ ``నేను ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు ఇడియ‌ట్ చూశాను. రేష్ గా అమ్మాయిల‌తో బిహేవ్ చేసేవాడిని. అప్పుడు జ‌రిగిన ఓ ఘ‌ట‌న వ‌ల‌న అప్ప‌టి నుంచి రేష్‌గా ఉండ‌టం మానేశాను. అయితే ప‌దేళ్ళ త‌ర్వాత ఈ సినిమాలో అలాంటి పాత్ర‌నే చేయాల్సి వ‌చ్చింది. డేనీ మంచి సంగీతాన్నిచ్చారు. ఇంకో హీరోలాగా అనిపిస్తుంటాడు. ఉద్ధ‌వ్ ట్రైల‌ర్‌ను చాలా బాగా క‌ట్ చేశారు. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``వ‌చ్చి ఆశీర్వ‌దించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్. మా సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది`` అని చెప్పారు.

బ‌సిరెడ్డి మాట్లాడుతూ ``డిఫ‌రెంట్ కైండ్ ఆఫ్ మూవీ`` అని అన్నారు.

సుధాక‌ర్ మాట్లాడుతూ ``ఉందిలేవే సినిమాలో కార్తిక్ నాతో క‌లిసి యాక్ట్ చేశాడు. మ‌ల్టీ టాలెండ్ ప‌ర్స‌న్‌. సింపుల్‌గా ఉంటాడు`` అని అన్నారు.

క‌ల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ``పెద్ద సినిమాలు హిట్ అయితే బాక్సాఫీస్‌కి రెవెన్యూ వ‌స్తుంది. చిన్న సినిమాలు హిట్ అయితే చాలా మంది స్ఫూర్తి పొందుతారు. చాలా మంది నిర్మాత‌లు సినిమాలు తీయ‌డానికి ముందుకొస్తారు`` అని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో నందిని రెడ్డి, స్నిగ్ధ‌, త్రినాథ‌రావు న‌క్కిన త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved