pizza
Moodu Puvvulu Aaru Kayalu music launch
`మూడు పువ్వులు ఆరు కాయ‌లు` మ్యూజిక్ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


07 October 2018
Hyderabad

స్మైల్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై రూపొందుతోన్న సినిమా `మూడు పువ్వులు ఆరు కాయ‌లు`. వ‌బ్బిన. వెంక‌ట్రావు నిర్మాత‌. డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస్ స‌మ‌ర్పిస్తున్నారు. రామ‌స్వామి ద‌ర్శ‌కుడు. అర్థ‌నారి ఫేమ్ అర్జున్ య‌జ‌త్‌, సౌమ్య వేణుగోపాల్‌, భ‌ర‌త్ బండారు, పావ‌ని, రామ‌స్వామి, సీమా చౌద‌రి కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక హైద‌రాబాద్‌లో శ‌నివారం రాత్రి జ‌రిగింది. చిత్ర ట్రైల‌ర్‌ను భాస్క‌ర‌భ‌ట్ల‌, సాయికార్తిక్ విడుద‌ల చేశారు. ఇదే వేదిక మీద బిగ్ సీడీని , ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు.

నిర్మాత మాట్లాడుతూ ``మాసంస్థ‌లో ఇది మా తొలి సినిమా. అంద‌రూ వ‌చ్చినందుకు ఆనందంగా ఉంది. మా టీమ్ అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డి చేశారు. నా మొదటి సినిమాకు అంద‌రూ స‌హ‌క‌రించినందుకు చాలా గౌర‌వంగా ఉంది. పీఆర్వో పుల‌గం చిన్నారాయ‌ణ‌గారికి అభినంద‌న‌లు`` అని అన్నారు.

రామ‌స్వామి మాట్లాడుతూ ``నిజంగా ఈ రోజు మూడు పువ్వులు ఆరు కాయ‌లే. అక్టోబ‌ర్ 12న నేను డైర‌క్ట‌ర్‌ని. ఫ‌స్ట్ షో థియేట‌ర్లో ప‌డాల‌న్న‌ది నా క‌ల‌. ప్రేమంటే చంపుకోవ‌డ‌మో, చావ‌డ‌మో కాదు. చ‌చ్చేదాకా క‌లిసి బ్ర‌త‌క‌టం. క‌న్న‌వాళ్ల క‌ల‌ల‌తో పాటు, ఆశించిన‌ ల‌క్ష్యాన్ని చేరుకోగ‌లిగితే ప్ర‌తి ఒక్క‌రి జీవితం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా వ‌ర్ధిల్లుతుంది. నేనేం చేయాల‌నుకున్నా నిర్మాత సాయం చేశారు. మా నిర్మాత‌, స‌మ‌ర్ప‌కులు క‌లిసి రెండు భుజాల‌యి న‌న్ను న‌డిపించారు. కృష్ణ‌సాయిగారు చాలా మంచి సంగీతాన్నిచ్చారు. భాస్క‌ర‌భ‌ట్ల మంచి మెలోడీ పాట‌ను రాశారు. చంద్ర‌బోస్‌గారు మంచి పాట‌ను రాశారు. ఆ పాట గురించి క‌చ్చితంగా ఇండ‌స్ట్రీలో అంద‌రూ మాట్లాడుకుంటార‌ని న‌మ్ముతున్నా. ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంగారు మంచి పాట పాడారు. ఈ సినిమాకు నేనే హీరో కాదు. కాక‌పోతే కామెడీ కేర‌క్ట‌ర్ మాత్ర‌మే. క‌థ‌లో మూడు జంట‌లుంటాయి. అర్జున్ య‌జ‌త్, భ‌ర‌త్ బండారు చాలా బాగా న‌టించారు. పావ‌ని చాలా బాగా న‌టించింది. త‌న‌కి మంచి భ‌విష్య‌త్తు ఉంటుంది. సినిమా చూసిన వారు బావుంది. చాలా బావుంది అనే అంటారు. మా పీఆర్వో, సోద‌ర స‌మానులు పుల‌గం చిన్నారాయ‌ణ‌కు థాంక్స్`` అని అన్నారు.

డా. మ‌ల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ ``అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న మా తొలి సినిమా మూడు పువ్వులు ఆరు కాయ‌లు. ఈ సినిమాకు నేను స‌మ‌ర్ప‌కుడిని. నాకు కృష్ణ‌సాయిగారు అత్యంత ఆప్తులు. మంచి సంగీతాన్నిచ్చారు. మా పీఆర్వో మాకు చాలా స‌పోర్ట్ చేశారు. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను`` అని అన్నారు.

భ‌ర‌త్ మాట్లాడుతూ ``మా సినిమా యువ‌త‌కు చాలా బాగా న‌చ్చుతుంది. నాకు తెలిసి అంద‌రికీ ల‌వ్ స్టోరీలు ఉండి ఉంటాయి. ఏదో ఒక స‌మ‌యంలో వారి జీవితంలో ఉంటాయి. నాకు ల‌వ్ స్టోరీలు లేవు. న‌న్ను కొంద‌రు అమ్మాయిలు మోసం చేశారు. సినిమాలోనూ అదే త‌ర‌హా పాత్ర చేశాను`` అని అన్నారు.

అర్జున్ య‌జ‌త్ మాట్లాడుతూ ``మా డైర‌క్ట‌ర్‌గారికి బీటెక్ చ‌దివే కొడుకున్నారు. అయినా ఆయ‌న ఆలోచ‌న‌లు యంగ్ గా ఉంటాయి. మా సినిమాలో ఒక హీరోగా చేశారు. ఈసినిమాను నేను అంగీక‌రించ‌డానికి కార‌ణం రామ‌స్వామిగారు. ఆయ‌న ఎప్ప‌టినుంచో రైట‌ర్‌. మంచి సినిమాను డైర‌క్ట్ చేయాల‌ని ఆయ‌న స్ట్ర‌గుల్ అయ్యారు. సెంటిమెంట్, కామెడీ, ల‌వ్ మిక్స్ అయి ఉన్నాయి`` అని చెప్పారు.

పావ‌ని మాట్లాడుతూ ``సినిమా బావుంటుంది. త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను. ప్ర‌తి ఒక్క‌రి నోట్లో నుంచి మూడు పువ్వులు ఆరు కాయ‌లు అని వింటుంటే సినిమా స‌క్సెస్ అయినంత ఆనందంగా ఉంది. శుభం ప‌ల‌క‌డానికి మూడు పువ్వులు ఆరు కాయ‌లు అని అంటారు`` అని చెప్పారు.

భాస్క‌ర‌భ‌ట్ల మాట్లాడుతూ ``సినిమాపెద్ద హిట్ కావాలి. మంచి పాట రాశాను`` అని తెలిపారు.

సాయికార్తిక్ మాట్లాడుతూ``ట్రైల‌ర్ చాలా బావుంది. మా కృష్ణ మంచి సంగీతాన్నిచ్చారు. మేమంద‌రం చాలా నేర్చుకుంటూ ఈ స్థాయికి వ‌చ్చాం. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాం`` అని అన్నారు.

కృష్ణ సాయి మాట్లాడుతూ ``ఇందులో రెండే పాట‌లున్నాయి. అవి చాలా బాగా కుదిరాయి. చంద్ర‌బోస్‌గారు రాసిన పాట‌ను బాలుగారు పాడారు. భాస్క‌ర‌భ‌ట్ల‌గారు రాసిన పాట‌ను సాయిచ‌ర‌ణ్‌, ర‌మ్య బెహ‌రా పాడారు. టీమ్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు`` అని అన్నారు.

ఆర్ట్ డైర‌క్ట‌ర్ ర‌మ‌ణ మాట్లాడుతూ ``ఈ సినిమా పెద్ద హిట్ అయి నిర్మాత‌కు డ‌బ్బులు, ద‌ర్శ‌కుడికి మంచి పేరు రావాలి`` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి దేవీప్ర‌సాద్‌, భ‌ర‌త్ బండారు, పావ‌ని, సీమా చౌద‌రి, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, భ‌ర‌త్‌, ఆదిత్య మ్యూజిక్ నిరంజ‌న్‌, మాధ‌వ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

న‌టీన‌టులు
పృథ్వి, త‌నికెళ్ల భ‌ర‌ణి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, అజ‌య్ ఘోష్‌, బాలాజీ, డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస్‌, జ‌బ‌ర్ద‌స్త్ రామ్‌ప్ర‌సాద్, రాకెట్ రాఘ‌వ‌, అప్పారావు, రంగ‌స్థ‌లం మ‌హేశ్‌,ఎఫ్ ఎం బాబాయ్‌, ప్ర‌మోదిని, జ‌య‌ల‌క్ష్మీ, గుమ్మ‌డి జ‌య‌వాణి, చంద్ర‌రావు, ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు
కెమెరా: య‌ం.మోహ‌న్‌చంద్‌, సంగీతం: క‌్రిష్ణ సాయి, ఎడిటింగ్‌: ఉపేంద్ర‌, ఆర్ట్: కె.వి.ర‌మ‌ణ‌, పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, ఫైట్స్: మార్ష‌ల్ ర‌మ‌ణ‌, నిర్మాత‌: వ‌బ్బిన‌.వెంక‌ట‌రావు, క‌థ‌-మాట‌లు-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం: రామ‌స్వామి.

 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved