pizza
Nayaki music launch
ou are at idlebrain.com > News > Functions
Follow Us

19 April 2016
Hyderabad

రాజ్ కందుకూరి స‌మ‌ర్పిస్తున్న సినిమా `నాయ‌కి`. గిరిధ‌ర్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ నిర్మిస్తోంది. త్రిష ఈ సినిమాలో నాయిక‌గా న‌టిస్తోంది. గిరిధ‌ర్ మామిడిప‌ల్లిప‌ద్మ‌జ మామిడిప‌ల్లి నిర్మాత‌లు. గోవి ద‌ర్శ‌కుడు. రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది.

                            ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, త్రిష, గణేష్ వెంకట్రామన్, గోవర్ధన్ రెడ్డి(గోవి), గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి, శైలేంద్ర ప్రొడక్షన్స్ శైలేంద్ర బాబు, బసవరాజు, హరీష్, శ్రీధర్ రెడ్డి, మల్కాపురం శివకుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్, విజయ్ కుమార్ కొండా, దశరథ్, శంకర్, కూచిపూడి వెంకట్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, అనిల్ రావిపూడి, సురేష్ కొండేటి, నారాయణ గౌడ్, ఠూగూర్, రఘుకుంచె, గౌతంరాజు, రాజ్ కందుకూరి, భాస్కరభట్ట, భీమనేని శ్రీనివాస్ రావు, అంబికా కృష్ణ, సత్యం రాజేష్, సుష్మారాజ్ తదితరులు పాల్గొన్నారు.

థియేట్రికల్ ట్రైలర్ భీమనేని శ్రీనివాస్ రావు, అంబికా కృష్ణ, ఎన్.శంకర్ విడుదల చేశారు.

బిగ్ సీడీని నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఆడియో సీడీలను నందమూరి బాలకృష్ణ విడుదల చేసి తొలి సీడీని త్రిషకు అందించారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘’నాయకి టైటిల్ బాగా నచ్చింది. ఈ ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభోత్సవం ఎలా ఉంటుందో సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఒక చేతిలో పువ్వులు, మరో చేతిలో కత్తి పట్టుకుని ఉన్న త్రిష లుక్ బావుంది. వైవిధ్యమైన పాత్ర చేయడమే కాకుండా పాట కూడా చక్కగా పాడింది. భాస్కరభట్ల మంచి సాహిత్యం అందించారు. పాటలు సీన్స్ చూస్తుంటే మంచి మెసేజ్ ఉన్నట్లు కనపడుతుంది. నాయకుడు అనే కమల్ సినిమా వచ్చింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ టైటిల్ తో నాయకి అనే సినిమా వస్తుంది. ఆ సినిమాను ఈ సినిమా క్రాస్ చేయాలి. త్రిష నటనలోని మరో కోణం ఆవిష్కరించబడాలి. సినిమా పెద్ద హిట్ కావాలి’’అన్నారు.

Glam galleries from the event

త్రిష మాట్లాడుతూ ‘’నందమూరి బాలకృష్ణగారికి ప్రత్యేకమైన దన్యవాదాలు. రఘుకుంచె మంచి సంగీతం అందించారు. అంతే కాకుండా నాతో పాట పాడించారు. గోవిగారికి, గిరిధర్ గారికి, రాజ్ కందుకూరి, రాంబాబు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.

మామిడిపల్లి గిరిధర్ మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో ఇది రెండో సినిమా. ఎన్టీఆర్ గారితో నేను జర్నలిస్ట్ గా పనిచేసే రోజుల్లో మంచి అనుబంధం ఉంది. ఈరోజు ఆయన అభినయ వారసుడు నందమూరి బాలకృష్ణగారి చేతుల మీదుగా ఆడియో విడుదల కావడం మరచిపోలేని అనుభూతి. రెండో సినిమాను త్రిషగారితో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేయాలని, అందులో ముఖ్యంగా థ్రిల్లర్ చేయాలనుకున్నాం కానీ చివరకు హర్రర్ కామెడి చేయాలనుకుని చాలా కథలు విన్నాం. అప్పుడు గోవర్ధన్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా స్టార్టయ్యింది. హర్రర్ జోనర్ లో కొత్త సినిమా. త్రిష గారి కెరీర్ బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ అవుతుంది. తనకు ఆడియెన్స్ రివార్డ్స్ తో పాటు, అవార్డ్స్ కూడా వస్తాయి. త్రి డైమెన్షన్ లో ఆమె నటన అద్భుతం. ప్రేక్షకులు ఆమె రోల్ ను, సినిమాను ఎంజాయ్ చేసేలా ఉంటుంది. రఘుకుంచె అద్భుతమైన సంగీతం అందించారు. రాజ్ కందుకూరి, రాంబాబు కుంపట్ల సపోర్ట్ మరచిపోలేను. అందరికీ థాంక్స్’’ అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘’నేను 9 సినిమాలు చేశాను. నాకు ఇదొక కొత్త ఎక్స్ పీరియెన్స్. థర్డ్ డైమెన్షన్ లో రెట్రో హర్రర్ నేపథ్యంలో సినిమాను గోవి ఎవరూ టచ్ చేయని పాయింట్ తో సినిమాను తెరకెక్కించారు. గోవి, సత్యంరాజేష్, గణేష్ వెంకట్రామన్ సహా అందరికీ మంచి గుర్తింపు వస్తుంది’’ అన్నారు.

దర్శకుడు గోవర్ధన్ మాట్లాడుతూ ‘’త్రిష సోల్ వినగానే కథను ఓకే చేసింది. గిరిధర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్లాప్ మూవీ చేసిన తర్వాత కూడా నా కథను, నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ప్రామిసింగ్ సినిమా అవుతుందని కచ్చితంగా చెప్పగలను. పద్మజగారు, రాంబాబుగారు, రాజ్ కందుకూరిగారికి థాంక్స్. సత్యంరాజేష్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తనలోని మరో లెవల్ ఆర్టిస్ట్ ను చూస్తారు. అలాగే నారారోహిత్ గారు నాకు మంచి మిత్రుడు. అడగ్గానే నాకోసం చిన్న గెస్ట్ రోల్ చేశారు. ఆయనకు కూడా థాంక్స్. రెట్రో హర్రర్ కామెడి గతం, భవిష్యత్ కాంబినేషన్ లో కథ రన్ అవుతుంది. అందుకు తగిన విధంగా రఘుకుంచె అద్భుతమైన సంగీతం అందించారు.  త్రిషకు థాంక్స్. 35% సీజీ వర్క్ ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కావడ లేదు. సహకారం అందించిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘’నాయకి సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. త్రిషగారితో వర్షం నుండి పరిచయం ఉంది. మంచి డేడికేషన్ ఉన్న నటి. ఆమెతో కలిసి నటించడం గర్వంగా ఫీలవుతున్నాను. గోవవర్ధన్ సినిమాను చక్కగా తెరకెక్కించారు. గిరిధర్ గారు  ఎంతో కష్టపడ్డారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.

రఘుకుంచె మాట్లాడుతూ ‘’త్రిషను సింగర్ గా పరిచయం చేసే అదృష్ఠం నాకే వచ్చింది. సింగ్ గా ఫ్యూచర్ లో మంచి పేరు తెచ్చుకుంటుంది. దర్శకుడు గోవి, నిర్మాత గిరిధర్ గారికి, రాజ్ కందుకూరిగారికి, భాస్కరభట్ల సహా నటీనటులు, టెక్నిషియన్స్ కు నా ధన్యవాదాలు’’అన్నారు.

శైలేంద్రబాబు మాట్లాడుతూ ‘’ఆడియోతో పాటు సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. గిరిధర్ గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్. యూనిట్ అంతటికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘’దర్శక నిర్మాతలకు, యూనిట్ అందరికీ బెస్ట్ విషెష్. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘’గిరిధర్ నాకు చిన్ననాటి మిత్రుడు. మంచి టెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఆయనతో పాటు రాజ్ కందుకూరిగారి కలయికలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుంది. ఎన్నో మంచి సాంగ్స్ ఇచ్చిన రఘుకుంచె ఈ సినిమాకు సంగీతం అందించడం ఆనందంగా ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా క్రేజీ బిజినెస్ అయ్యింది’’ అన్నారు.

కె.దశరథ్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ నాకు కావాల్సిన వారే. సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.

అంబికా కృష్ణ మాట్లాడుతూ ‘’రమణమ్మా సాంగ్ ఎన్నిసార్లు విన్నా ఊపు వచ్చేస్తుంది. అలాంటి మ్యూజిక్ అందించిన రఘుకుంచెను అభినందిస్తున్నాను. త్రిష సింగర్ గా కూడా బిజీ అయిపోతుంది. గోవికి దర్శకుడిగా మంచి పేరు వస్తుంది. గిరిధర్, రాంబాబులకు మంచి లాభాలను తెచ్చేపెట్టే సినిమా కావాలి’’ అన్నారు.

భీమనేని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ‘’గిరిధర్ నిర్మాతగా చేస్తున్న రెండో ప్రయత్నం. తను జర్నలిస్ట్, పిఆర్వోగా రాణించారు. నిర్మాతగా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. రఘుకుంచె మంచి మ్యూజిక్ అందించాడు. ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు.

ఎన్.శంకర్ మాట్లాడుతూ ‘’గిరిధర్ గారు, రాంబాబు, రాజ్ కందుకూరి కలయికతో చేసిన చిత్రమే ఇది. ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. నేను, గిరిధర్ ఇద్దరం రూమ్మేట్స్. గోవి 70 దశాకం అప్పియరెన్స్ ను మన ముందు పెడుతున్నాడు. రఘు సంగీతం అందించడం ఆనందంగా ఉంది. త్రిష అందంగా, భయంగా ఆనందాన్ని పంచడానికి వస్తుంది. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

                           త్రిష‌బ్ర‌హ్మానందంస‌త్యం రాజేష్‌గ‌ణేష్ వెంక‌ట్ రామ‌న్‌సుష్మ‌రాజ్‌జ‌య‌ప్ర‌కాశ్‌మ‌నోబాల‌కోవై స‌ర‌ళ‌పూన‌మ్ కౌర్‌మాధ‌వీల‌త‌సెంట్రియాన్‌,జీవీ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. ఈ సినిమాకు ఫైట్ మాస్ట‌ర్‌:   వెంక‌ట్‌క‌ళ‌:  కె.వి.ర‌మ‌ణ‌కూర్పు:  గౌతంరాజుపాట‌లు:  భాస్క‌రభ‌ట్ల‌సంగీతం: ర‌ఘు కుంచెబ్యాక్ గ్రౌండ్ స్కోర్‌:  సాయికార్తిక్‌,  లైన్ ప్రొడ్యూస‌ర్‌:  ఎం.వెంక‌ట‌సాయి సంతోష్‌ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  రాంబాబు కుంప‌ట్ల‌కెమెరా:  జ‌గ‌దీష్ చీక‌టినిర్మాత‌:  గిరిధ‌ర్ మామిడిప‌ల్లిప‌ద్మ‌జ మామిడిప‌ల్లిక‌థ‌క‌థ‌నంమాట‌లుద‌ర్శ‌క‌త్వం:  గోవి.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved