pizza
Organs music launch
ఆర్గాన్స్ గీతావిష్కరణ కార్యక్రమం..
You are at idlebrain.com > News > Functions
Follow Us


13 August 2018
Hyderabad

రవి అండ్ రఘు ఆర్ట్స్ బ్యానర్ పై లక్ష్మీ కాంత్ హీరోగా నటించి నిర్మిస్తున్న చిత్రం 'ఆర్గాన్స్'. రవికిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర గీతావిష్కరణ మంగళవారం ఫిల్మ్ ఛాంబర్లో ముత్యాల రామదాసు చేతుల మీదుగా జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్గాన్స్ అని డిఫరెంట్ టైటిల్ పెట్టారు. అవయవ దానం చేయడం అనేది మంచి పని. ఆ కంటెంట్ ఈ సినిమాలో కనపడుతోంది.. ఇంత మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాకు ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉంటామంటూ, సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. పాటలతో పాటు సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగొచ్చింది. పాటలు విన్న వారందరూ బాగున్నాయి అంటున్నారు. కాన్సెప్ట్ చాలా బాగుంటుంది.. మంచి సబ్జెక్ట్ తో వస్తున్న దర్శక నిర్మాతకు, నాకు అవకాశం ఇచ్చినందుకు కృతఙ్ఞతలు తెలియచేస్తున్నా అన్నారు.

దర్శకుడు రవికిరణ్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం... ఈ సినిమా చూసిన వారందరూ కచ్చితంగా కంటతడి పెట్టుకుంటారు. అందరి గుండెల్లో నిలిచిపోయే చిత్రం ఆర్గాన్స్ అని కచ్చితంగా చెప్పగలను. ఆర్గాన్స్ అంటే అవయవదానం అనుకుంటారు కానీ అది 10% ఉంటుంది. మిగతా స్టోరీ అంతా ఫ్యామిలీ డ్రామా.. అందరికీ నచ్చే సినిమా అవుతుంది అన్నారు. హీరో కమ్ ప్రొడ్యూసర్ బత్తుల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. ఇష్టపడి కష్టపడి పని చేసాము.. మనిషి బ్రతకడానికి ఆర్గాన్స్ ఎంతో ప్రధానమైనవి. సమాజంలో వాటిని కొందరు తమ స్వార్థానికి వ్యాపారంగా మార్చేశారు. అలాంటి వాళ్ళను హీరో ఏవిధంగా ఎదుర్కొన్నాడు అనేదే ప్రధానాంశంగా కథ సాగుతోంది. ఈ కథను లవ్ అండ్ సస్పెన్సు త్రిల్లర్ గా తెరకెక్కించడం జరిగింది. అందువల్ల అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సెన్సార్ పూర్తి చేసుకుంది. పక్కా ప్లాన్ తో సినిమా విడుదల చేస్తామని తెలిపారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మోహన్ గౌడ్,రామా రావు, మోహన్ వడ్లపట్ల, నివాస్, విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లక్ష్మీ కాంత్, సందీప్తి, శ్రీలక్ష్మి, ప్రసాద్ రెడ్డి, మోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, నిర్మాత: బత్తుల లక్ష్మీ నారాయణ,కెమెరా: కె. రమణ, ఎడిటింగ్: డీకే. రేణూకబాబు, మేకప్: రెహమత్, ఫైట్స్: నాగరాజు,కొరియోగ్రఫీ:పాల్, హరిప్రసాద్.

 

 

Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved