pizza
Prashnistha music launch
`ప్రశ్నిస్తా` ఆడియో రిలీజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


24 March 2019
Hyderabad

నిర్మాతగా, నటుడిగా, దర్శకుడిగా పి.సత్యారెడ్డి ఇండస్ట్రీలో మంచి పేరుతెచ్చుకున్నారు.. ఇప్పుడు ఆయన తనయుడు మనీష్ బాబు ని హీరోగా పరిచయం చేస్తూ...ప్రశ్నిస్తా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజావన్నేంరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. యువ సంగీత దర్శకుడు వెంగి సంగీత సారథ్యంలో రూపొందిన ప్రశ్నిస్తా ఆడియో సీడీలను ప్రముఖ దర్శకుడు కెఎస్ రవీంద్ర విడుదల చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్ లో విడుదలైంది.. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కోనేరు సత్యనారాయణ, బెక్కం వేణుగోపాల్, రాజీవ్ శివా రెడ్డి, వరప్రసాద్, విసు, సురేష్ కొండేటి, హీరో మనీష్ బాబు, హీరోయిన్స్ అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా, దర్శకుడు రాజా వన్నేంరెడ్డి, రచయిత రాజేంద్ర కుమార్, సంగీత దర్శకుడు వెంగి తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ... ఈ సినిమా ప్రారంభం రోజు మనీష్ ని చూసాను. మంచి హైట్, ఫిజిక్ తో బాగున్నాడు. ఇప్పడు సాంగ్స్, టీజర్ చూసాక హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ మనీష్ లో ఉన్నాయి అనిపించింది. ఏ తల్లి తండ్రులు అయినా ఆస్తులు పిల్లలకు గిఫ్టుగా ఇస్తారు. సత్యారెడ్డి మాత్రం మనీష్ కి హైట్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఫ్యూచర్ లో మనీష్ పెద్ద హీరోగా ఎదగాలి. ఈ సినిమాకి అందరూ పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్స్ చిత్రాలు డీల్ చేయడం చాలా కష్టం. కానీ రాజా వన్నేంరెడ్డి అలాంటి చిత్రాలు తీసి సాలీడ్ హిట్స్ కొట్టారు. ట్రైలర్ బాగుంది. మంచి మెస్సేజ్, గ్లామర్ కనిపిస్తుంది. టీమ్ అందరికీ అల్ ది బెస్ట్.. అన్నారు.

ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ... సత్యారెడ్డి నాకు చిరకాల మిత్రుడు. వారి అబ్బాయి నటించిన ఈ సినిమా మంచి హిట్ అయి మనీష్ పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలి. ట్రయిలర్ బాగుంది. మనీష్ ఫస్ట్ సినిమా లా కాకుండా ఎక్స్ పీరియన్స్ ఉన్న హీరోలా చేసాడు. ఇంత బాగా చేస్తాడని ఊహించలేదు. ఆశ్ఛర్యపోయాను. అంత బాగా చేసాడు. యూత్ ఫుల్ మూవీ అయినా పొలిటికల్ టచ్ ఇస్తూ సినిమాని బాగా తీశారు. కథ బాగుంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఆదరిస్తున్నారు. కంటెంట్ నచ్చితే ఆ చిత్రాన్ని పెద్ద హిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఇది కరెక్ట్ టైంలో వస్తుంది. ఈ సినిమాతో మనీష్ కి మంచి ఫ్యూచర్ ఉండాలి... త్వరలో మా ప్రొడక్షన్ లో మనీష్ తో సినిమా తీస్తాం.. అన్నారు.

దర్శకుడు రాజా వన్నేంరెడ్డి మాట్లాడుతూ... మంచి సినిమా తీశామ్. మనీష్ తెరముందుకు రాగానే నట విశ్వరూపం చూపిస్తాడు. ఈ సినిమాకోసం చాలా కష్టపడి చేసాడు. రాజేంద్ర కుమార్ మంచి కథ ఇచ్చాడు. చిన్న సినిమాగా స్టార్ట్ చేసిన ఈ చిత్రం కథ డిమాండ్ ను బట్టి బడ్జెట్ ఐదు రేట్లు పెరిగి పెద్ద చిత్రంలా తయారు అయ్యింది. సత్యా రెడ్డి నామీద నమ్మకంతో తనకొడుకుని నా చేతిలో పెట్టారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మంచి సినిమా తీశానని భావిస్తున్నాను. వెంగి 4పాటలు అద్భుతంగా ఇచ్చాడు. ఈ సినిమాతో మనీష్ 10కోట్ల రేంజ్ హీరో అవుతాడు.. అన్నారు.

నిర్మాత పి. సత్యారెడ్డి మాట్లాడుతూ... మేము ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా సినిమా బాగా వచ్చింది. ట్రయిలర్ రిలీజ్ అవగానే బిజినెస్ క్రేజ్ పెరిగింది. మనీష్ బొంబాయి, హైదరాబాద్, వైజాగ్లలో ట్రైన్ అయి ఈ సినిమా చేశాడు. కథని నమ్మి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి నటించాడు. అలాగే హీరోయిన్స్ ముగ్గురు తమ పాత్రలకు న్యాయం చేశారు. నా మీద అభిమానంతో ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం కష్టపడి పని చేశారు. క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా పొలిటికల్ టచ్ ఇస్తూ రూపొందించిన ఈ చిత్రాన్నీ ఆదరించి పెద్ద హిట్ చెయ్యాలి.. అన్నారు.

హీరో మనీష్ బాబు మాట్లాడుతూ... ప్రశ్నిస్తా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మా సినిమాని ఆదరించి సక్సెస్ చెయ్యాలి.. అన్నారు.

ప్రశ్నిస్తా సినిమా అడియోతో పాటు సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. ఈ సినిమాతో మనీష్ పెద్ద హీరోగా ఎదగాలి అని అతిధులంతా ఆకాంక్షించారు...

 

 

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved