pizza
Prathikshanam music launch
'ప్రతిక్షణం' ఆడియో రిలీజ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 September 2016
Hyderaba
d

భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న రొమాంటిక్‌ థ్రిలర్‌ మూవీ 'ప్రతిక్షణం'. మనీష్‌తేజస్విని హీరో హీరోయిన్లుగా నాగేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో మల్లికార్జున్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుదామోదర్‌ప్రసాద్‌ఆర్‌.పి.పట్నాయక్‌సాయివెంకట్‌కృష్ణుడురాజ్‌కందుకూరిమదన్‌నరేష్‌ కుమార్‌ అగర్వాల్‌,సురేష్‌ వర్మమల్టీడైమన్షన్‌ వాసునవీన్‌ యాదవ్‌మల్కాపురం శివకుమార్‌సంధ్యామోషన్‌ పిక్చర్స్‌ రవిదర్శకుడు నాగేంద్రప్రసాద్‌నిర్మాత మల్లిఖార్జున్‌హీరో మనీష్‌,తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

ఆడియో సీడీలను ఆర్‌.పి.పట్నాయక్‌ విడుదల చేసి తొలి సీడీని గువ్వల బాలరాజుకు అందించారు.

గువ్వల బాలరాజు మాట్లాడుతూ - ''దర్శక నిర్మాతలకు అభినందనలు. కొత్త నటీనటులతో చేస్తున్న ప్రయత్నం పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. హీరో హీరోయిన్లు,ఇతర నటీనటులుటెక్నిషియన్స్‌కు అభినందనలు'' అన్నారు.

సాయివెంకట్‌ మాట్లాడుతూ - ''నిర్మాత మల్లిఖార్జున్‌ వ్యాపారవేత్తనే కాదుసినిమా అంటే మంచి అభిరుచి ఉన్న వ్యక్తి. మేకింగ్‌ చూస్తున్నప్పుడు సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో తెలుస్తుంది. దర్శకుడు శ్రీనాగ్‌అండ్‌ టీం తొలి సినిమాతోనే సక్సెస్‌ అందుకుంటారు'' అన్నారు.

Tejaswini Glam gallery from the event

ఆర్‌.పి.పట్నాయక్‌ మాట్లాడుతూ - ''మ్యూజిక్‌ డైరెక్టర్‌ రఘురామ్‌ సింగర్‌గా ఉన్నప్పట్నుంచి నాతో మంచి పరిచయం ఉంది. చాలా డేడికేటేడ్‌ ఉన్న పర్సన్‌. తను మంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకుంటాడు. నిర్మాతకు మల్లిఖార్జున్‌గారికి సినిమా సక్సెస్‌ అయ్యి బాగా డబ్బులు సంపాదించాలి. సినిమా ప్రమోషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాంగ్స్‌ట్రైలర్‌ బావున్నాయి. సినిమా మంచి సక్సెస్‌ అవుతుంది. మనీష్‌తేజస్వినికి ఈ సినిమాతో మంచి బ్రేక్‌ దొరుకుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

మదన్‌ మాట్లాడుతూ - ''రఘురామ్‌ మ్యూజిక్‌ బావుంది. థ్రిల్లర్‌ జోనర్స్‌ కు ఆడియెన్స్‌ వేరుగా ఉంటారు. నాకు కూడా థ్రిల్లర్‌ మూవీస్‌ అంటే బాగా ఇష్టం. దర్శకుడు శ్రీనాగ్‌ సినిమాను బాగా తీసి ఉంటాడని భావిస్తున్నాను. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ రఘురామ్‌ మాట్లాడుతూ - ''వినాయకుడు మూవీలో సింగర్‌గా నాకు బ్రేక్‌ వచ్చింది. తర్వాత ఈ సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేశాను. పాటలు బావున్నాయి''అన్నారు.

కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''హీరో మనీష్‌తో మంచి పరిచయం చాలా మంచి హీరో. బాగా కష్టపడే తత్వమున్న వ్యక్తి. మ్యూజిక్‌ బావుంది. ట్రైలర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దర్శకుడు నాగేంద్రప్రసాద్‌నిర్మాత మల్లిఖార్జున్‌మ్యూజిక్‌ డైరెక్టర్‌ రఘురామ్‌ సహా అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

హీరో మనీష్ మాట్లాడుతూ -``సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయడానికి దర్శకుడు శ్రీనాగ్ గారు చాలా కష్టపడి సినిమాను రూపొందించారు. నిర్మాతగారు సినిమా బాగా రావడానికి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. రఘురామ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ చాలా బావున్నాయని అందరూ అంటున్నారు. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు.

హీరోయిన్ తేజస్విని మాట్లాడుతూ -``నా కెరీర్లో చాలా మంచి మూవీని ఇచ్చిన దర్శక నిర్మాతలకు స్పెషల్ థాంక్స్. రఘురాంగారు ఇచ్చిన సాంగ్స్ బావున్నాయి. సినిమా కూడా బాగా వచ్చింది. ఆడియో, సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.

దర్శకుడు నాగేంద్రకుమార్ మాట్లాడుతూ -``రొమాంటిక్ థ్రిల్లర్, అవుటాఫ్ ది బాక్స్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాను రూపొందించాం. మంచి ట్విస్ట్ లుంటాయి. ప్రతి సీన్ ఉత్కంఠంగా సాగుతుంది. అవకాశం ఇచ్చినిర్మాత మల్లిఖార్జున్ గారికి థాంక్స్. రఘురాం మంచి మ్యూజిక్ ఇచ్చారు. హీరో మనీష్, హీరోయిన్ తేజస్విని సహా యూనిట్ లోని ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు, అందరికీ థాంక్స్`` అన్నారు.

నిర్మాత మల్లిఖార్జున్ మాట్లాడుతూ -``నేను వ్యాపార రంగం నుండి సినిమా రంగానికి వస్తుంటే చాలా మంది, అనుభవం లేని రంగంలోకి ఎందుకు వెళుతున్నావని అన్నారు. అయితే దర్శకుడు నాగేంద్ర చెప్పిన పాయింట్ బాగా నచ్చడంతో సినిమాను చేయడానికి సిద్ధమయ్యాను. అనుకున్న షెడ్యూల్ లోనే సినిమాను పూర్తి చేశాం. హర్రర్ సినిమా కానీ దెయ్యం ఉండదు. ప్రతి క్షణం ఆసక్తికరంగా సాగుతుంది. రఘరాం అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: రఘరామ్‌సినిమాటోగ్రఫీ: కల్యాణ్‌ సమీఎడిటింగ్‌: శివ వై.ప్రసాద్‌నిర్మాత: జి.మల్లిఖార్జున్‌రెడ్డికథస్క్రీన్‌ప్లేమాటలుదర్శకత్వం: నాగేంద్రప్రసాద్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved