pizza
Premaleela Pelligola music launch
స్టార్ డైరెక్ట‌ర్ వినాయ‌క్- ఆర్.బి చౌద‌రి చేతుల మీదుగా `ప్రేమలీల‌..పెళ్ళిగోల` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 March 2017
Hyderaba
d

రెండు ద‌శాబ్ధాల‌కు పైగా రాయ‌ల‌సీమ‌లో నాలుగు వంద‌ల‌కు పైగా చిత్రాల‌ను పంపిణీ చేసిన శ్రీ మ‌హావీర్ ఫిలిమ్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఇటీవ‌ల త‌మిళ్ లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన `వెల్లై కార‌న్` చిత్రాన్ని `ప్రేమ‌లీల‌-పెళ్ళి గోల` టైటిల్ తో మ‌హా వీర్ పిలిమ్స్ అధినేత‌ నిర్మాత పార‌స్ జైన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్, నిక్కీ గ‌ల్రానీ నాయ‌కానాయిక‌లుగా న‌టించారు. ఎళిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. `జ‌ర్నీ` ఫేం స‌త్య సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో వేడుక కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ బిగ్ సీడీని ఆవిష్క‌రించ‌గా, ప్ర‌ముఖ నిర్మాత ఆర్.బిచౌద‌రి సీడీల‌ను ఆవిష్క‌రించి తొలి ప్ర‌తిని వినాయ‌క్ కు అందించారు.

అనంత‌రం ఆర్. బి.చౌద‌రి మాట్లాడుతూ ` విష్ణు విశాల్ త‌మిళ్ లో ఎస్టాబ్లిష్ హీరో. ఆయ‌న టైమింగ్ పెర్పామెన్స్ బాగుంటుంది. హిలేరియ‌స్ కామెడీ నేప‌థ్యంలో తెరకెక్కిన చిత్ర‌మిది. త‌మిళ్ లో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఇక్క‌డా మంచి విజ‌యం సాధిస్తుంది` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు వినాయ‌క్ మాట్లాడుతూ ` పార‌స్ జైన్ గారు చాలా కాలం నుంచి తెలుసు. ఎన్నో మంచి సినిమాలు పంపిణీ చేసిన అనుభ‌వం ఆయ‌న‌ది. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఎళిన్ మంచి ద‌ర్శ‌కుడు. నాగార్జున హీరోగా న‌టించిన `నువ్వు వ‌స్తావ‌ని` సినిమా ఆయ‌న చేసిందే. ఈ సినిమా ఇక్క‌డ ఏ స్థాయి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలుసు. ఇప్పుడు `ప్రేమ‌లీల పెళ్లి గొల` టైటిల్ తో ఆయ‌న సినిమా వ‌స్తుంది. సినిమా మంచి హిట్ అవ్వాల‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.

శ్రీ మ‌హావీర్ ఫిలింస్ అధినేత, నిర్మాత పార‌స్ జైన్ మాట్లాడుతూ ` ప్రేమ‌లీల ఒకరిది. పెళ్ళి గోల మ‌రొక‌రిది. అదే ఈ సినిమా. త‌మిళ్ లో ఈ సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్య‌. ఎలాగైనా ఈ చిత్రాన్ని మ‌న ఆడియ‌న్స్ కు అందించాల‌ని చాలా మంది పోటీ పడ్డా..నా మీద న‌మ్మ‌కంతో విశాల్ నాకు రైట్స్ ఇచ్చారు. ముందు ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నుకున్నా. కానీ విశాల్ రీమేక్ చేస్తే కామెడీ మిస్ అవుతుంద‌న‌డంతో డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. తెలుగు ఆడియ‌న్స్ కు బాగా నచ్చే సినిమా అవుతుంది. వ‌న‌మాలి పాట‌లు, స‌త్య సంగీతం, రామ‌కృష్ణ చ‌క్క‌ని మాట‌లు అందించారు. విశాల్ త‌మిళ్ లో హ్యాట్రిక్ కొట్టారు. ప్ర‌స్తుతం రెండు, మూడు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయినా మా కోసం సినిమా ప్ర‌మోష‌న్ కు ఇక్క‌డికి వ‌చ్చారు. అలాగే వినాయ‌క్ గారు ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం. ఆయ‌న ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నారు. ఆడియో వేడుక ఆయ‌న చేతుల మీదుగా జ‌ర‌గ‌డం ఆనందంగా ఉంది. ఈ వేస‌విలో సినిమా రిలీజ్ చేస్తున్నాం` అని అన్నారు.

నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ ` మ‌హా వీర్ ఫిలిమ్స్ మా సినిమాల‌నే మొద‌ట‌గా రిలీజ్ చేసింది. త‌ర్వాత అదే సంస్థ ఎన్నో సినిమాల‌ను సీడెడ్ లో పంపిణీ చేసింది. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్ట‌డం సంతోషంగా ఉంది. పాట‌లు బాగున్నాయి. సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

Nikki GalraniGlam gallery from the event

ద‌ర్శ‌కుడు ఎస్. వి.కృష్ణారెడ్డి మాట్లాడూతూ ` పార‌స్ జైన్ గారు కామ‌న్ ఆడియ‌న్ లో ఆలోచిస్తారు. సినిమా స‌క్సెస్ ను ముందే అంచ‌నా వేయ‌గ‌ల వ్య‌క్తి. ఆయ‌న పంపిణీ చేసిన ప్ర‌తీ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమా కూడా ఆకోవ‌లో నిలుస్తుంది. విశాల్ ప్రామిస్సింగ్ గా ఉన్నాడు. స‌త్య మంచి ట్యూన్స్ అందించాడు. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ నచ్చే సినిమా అవుతుంది` అని అన్నారు.

చిత్ర హీరో విష్ణు విశాల్ మాట్లాడూతూ ` ఐటీ ఉద్యోగం చేసుకుంటోన్న స‌మ‌యంలో త‌మిళ్ సినిమాల్లో అవ‌కాశం రావ‌డంతో హీరోగా ట‌ర్న్ అయ్యా. `వెన్నైలా క‌బాడీ కుజు` (`భిమిలి క‌బ‌డ్డి జ‌ట్టు`) చిత్రం నాకు మంచి గుర్తింపునిచ్చింది. త‌ర్వాత కొన్ని సినిమాలు ఆశించిన ఫ‌లితాన్నివ‌వ్వ‌లేదు. ఇటీవ‌ల విడుద‌లైన `వెలైను వందుట్టా వెల్లైకార‌న్` మంచి బ్రేక్ నిచ్చింది. హీరోగా నాకిది 10వ సినిమా. త‌మిళ్ లో పెద్ద హిట్ అయింది. తెలుగులో విడుద‌ల‌వుతోన్న తొలి సినిమా ఇది. మంచి హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు స‌త్య మాట్లాడుతూ ` సంగీత ద‌ర్శ‌కుడిగా నాల్గ‌వ సినిమా ఇది. నాతొలి సినిమా జ‌ర్నీ మంచి విజ‌యాన్ని పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుంది` అని అన్నారు. సినిమాలో అవ‌కాశం ప‌ట్ల హీరోయిన్ నిక్కీ గ‌ల్రానీ ఆనందం వ్య‌క్తం చేసింది.

ఈ వేడుక‌లో జెమిని కిర‌ణ్‌, బెల్లం కొండ సురేష్‌, ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా, పూర్వీ విర్రాజు, కృష్ణ ఎంట‌ర్ టైన్ మెంట్స్ భ‌ర‌త్ చౌద‌రి, త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved