pizza
Dhanush's Rail music launch
`రైల్` ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

03 September 2016
Hyderaba
d

రఘువరన్‌ బి.టెక్‌, అనేకుడు, మాస్‌, మరియన్‌ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ధనుష్‌ కథానాయకుడిగా, నేను శైలజ వంటి సూపర్‌హిట్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్‌ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'రైల్‌'. ఆదిత్య మూవీ కార్పొరేషన్‌, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్‌ పతాకాలపై బేబి రోహిత రజ్న సమర్పణలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్ ఆడియో సీడీలను, ఆడియో పెన్ డ్రైవ్ లను విడుదల చేశారు. దర్శకుడు ప్రభు సాల్మన్ తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా....

సుకుమార్ మాట్లాడుతూ - ``7-8 సంవత్సరాలుగా నేను తమిళ సినిమాలు చూడటమే మానేశాను. గ్రామీణ నేపథ్యంలో సినిమా చేయాలనుకున్నప్పుడు తమిళ సినిమాలు చూడటం మొదలు పెట్టాను. అప్పుడు నేను చూసిన సినిమా మైనా(తెలుగులో ప్రేమఖైదీ). సినిమా నాకెంతో నచ్చింది. మణిరత్నంగారి సినిమాలు సన్నివేశాలు ఒక పంథాలో సాగుతాయి. అలాంటి పంథాలో సినిమాలు తీసే దర్శకుడు ప్రభుసాల్మన్. ఇప్పుడు మన సినిమాలు కూడా హాలీవుడ్ రేంజ్ లో వస్తున్నాయి. అలాగే ఈ రైల్ సినిమా హాలీవుడ్ రేంజ్ ఉంటుందని భావిస్తున్నాను`` అన్నారు.

చిత్ర దర్శకుడు ప్రభు సాల్మన్ మాట్లాడుతూ - ``ప్రేమఖైదీ, గజరాజు వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి పెద్ద సక్సెస్ చేశారు. అందుకు వారికి పెద్ద థాంక్స్. సినిమాకు లాంగ్వేజ్ లేదు. నేను కూడా తెలుగు సినిమాలను ఎక్కువగా చూస్తుంటాను. చాలా విషయాలను నేర్చుకున్నాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ధనుష్, కీర్తిసురేష్ లు ఎంతగానో సపోర్ట్ చేశారు. రిస్కీ సన్నివేశాల్లో చక్కగా నటించారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు జరిగే రైలు ప్రయాణమే ఈ చిత్ర కథనం. సినిమా రీరికార్డింగ్ చాలా బావుంటుంది. తెలుగు సినిమాను తప్పకుండా చేస్తాను`` అన్నారు.

సత్యజ్యోతి ఫిలింస్ త్యాగరాజన్ మాట్లాడుతూ - ``మా సంస్థ నుండి తెలుగులో చాలా కాలం తర్వాత వస్తున్న చిత్రమిది. కొత్త పాయింట్ లో సాగే చిత్రమిది. ధనుష్, కీర్తిసురేష్ లకు థాంక్స్. ఎంతగానో సపోర్ట్ చేశారు. ప్రభుసాల్మన్ గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులను సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ - ``సినిమా చాలా బావుంటుంది. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. నచ్చితే సినిమా చూడమని ఒకరికి చెప్పండి..నచ్చకపోతే చూడవద్దని వంద మందికి చెప్పండి`` అన్నారు.

కీర్తి సురేష్ మాట్లాడుతూ - ``ప్రభుసాల్మన్ గారు, ఇమ్మాన్ గారు కాంబినేషన్ అంటే పెద్ద మ్యూజికల్ హిట్ కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్ లో నేను నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాను 60 రోజులు అవుట్ డోర్ లో చిత్రీకరిస్తే, 15 రోజులు సెట్స్ లో చిత్రీకరించాం. నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా. ధనుష్ గారు అమేజింగ్ యాక్టర్ ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది`` అన్నారు.

సి.కల్యాణ్ మాట్లాడుతూ - ``ఈ రైల్ చిత్రం బుల్లెట్ లా దూసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ధనుష్, కీర్తిసురేష్, త్యాగరాజన్, ప్రభుసాల్మన్, ఇమ్మాన్, తెలుగు నిర్మాతలు ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి ఇలా అందరూ ఒక కమిట్ మెంట్ ఉన్న టీం చేసిన చిత్రమిది. పెద్ద సక్సెస్ కావాలాని కోరుకుంటున్నాను`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఢి.ఇమ్మాన్ మాట్లాడుతూ - ``ప్రభుసాల్మన్ గారితో సినిమాలు చేయడం ఎంతగానో హ్యాపీ అనిపిస్తుంది. ధనుష్, కీర్తిసురేష్ లు పాత్రల్లో ఒదిగిపోయారు. తెలుగులో ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ -``రైలు ప్ర‌యాణం ఇష్టం. మా ఊర‌న్నా ఇష్టం. ఊరెళ్లాలంటే రైల్‌లోనే వెళ్లాలి. అలా వెళ్ల‌డ‌మే ఇష్టం. గోదావ‌రి ఇష్టం. అందులో ఈత కొట్ట‌డం ఇష్టం. మా ఊరు కుర్రాళ్లు (ఆది, ఆదిత్య‌, వినోద్‌) ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వారికి సినిమా అంటే ఎంథుసియాసిజం. రైల్ టైటిల్ బావుంది. ఆ సౌండే బావుంటుంది. ఆ మూవ్‌మెంట్ బావుంటుంది. రైలుతో విప‌రీత‌మైన అటాచ్‌మెంట్ అందుకే. ఆ ఇష్టంతోనే ఎగిరే పావుర‌మా చిత్రాన్ని రైలు బ్యాక్‌డ్రాప్‌లో తీశాను. రైల్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాల‌న్నీ హిట్టే. ఈ సినిమా కూడా ఆ కోవ‌లోనే హిట్ట‌వుతుంది. ధ‌నుష్ మ‌న ప‌క్కింట‌బ్బాయిలా ఉంటాడు. మా వూరి కుర్రాళ్ల ప్ర‌య‌త్నం స‌క్సెస‌వ్వాలి`` అన్నారు.

వెన్నెల కంటి మాట్లాడుతూ -``బాషా నుంచి త్యాగ‌రాజ‌న్ గారితో అనుబంధం ఉంది. వారి సంస్థ‌లోని మొద‌టి సినిమా బాషాకి, రెండో తెలుగు సినిమా రైల్‌కి నేనే ర‌చ‌యిత‌ను. ఈ సినిమాలో సౌతిండియాలోనే బెస్ట్ లొకేష‌న్స్‌ని చూపించారు. ఇష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. ప్ర‌భుతో గ‌త సినిమాల‌కు ప‌నిచేశాను. పెద్ద విజయం సాధించే చిత్ర‌మిది`` అన్నారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ -``రైలు ప్ర‌యాణం అంటే చాలా ఇష్టం. ఆద్యంతం ఆస్వాధిస్తూ ప్ర‌యాణించ‌డం నాకు అల‌వాటు. రైల్ ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. ర‌న్నింగ్ ట్రెయిన్‌పై అంత అద్భుత‌మైన విజువ‌ల్స్ తీయ‌డం గ్రేట్‌. సినిమా పెద్ద హిట్ట‌వ్వాలి`` అన్నారు.

ఈ కార్యక్రమంలో రామసత్యనారాయణ, నందు, హరీష్ ఉత్తమన్, చంటి అడ్డాల తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు.

ధనుష్‌, కీర్తి సురేష్‌, తంబి రామయ్య, కరుణాకరన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, సినిమాటోగ్రఫీ: వెట్రివేల్‌ మహేంద్రన్‌, ఎడిటింగ్‌: ఎల్‌.వి.కె.దాస్‌, ఫైట్స్‌: స్టన్‌ శివ, మాటలు: వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సాహితి, నిర్మాణ సారధ్యం: వడ్డి రామానుజం, సమర్పణ బేబి రోహిత రజ్న, నిర్మాతలు: ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి, దర్శకత్వం: ప్రభు సాల్మన్‌.

 


 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved