pizza
Raja Cheyyi Vesthe Music Launch
‘రాజా చెయ్యి వేస్తే’ ఆడియో ఆవిష్కరణ
ou are at idlebrain.com > News > Functions
Follow Us

25 March 2016
Hyderabad

నారా రోహిత్, ఇషా తల్వార్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం విజయవాడలో జరిగింది.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, నారారోహిత్, తారకరత్న, దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, సాయికొర్రపాటి, ఇషా తల్వార్, భాస్కర్ సామల, దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, సాయికార్తీక్, డ్రాగన్ ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు, కాసర్ల శ్యామ్, కారుమంచి రఘు తదితరులు పాల్గొన్నారు.

థియేట్రికల్ ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు.

ఆడియో సీడీలను నారాచంద్రబాబునాయుడు విడుదల చేసి తొలి సీడీని నందమూరి బాలకృష్ణకు అందించారు.

నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ‘’నిర్మాతలు మంచి సినిమాలు తీయాలి. తెలుగు సినిమాకు ఒక చరిత్ర ఉంది. హిందీ తర్వాత ఎక్కువ మార్కెట్ ఉన్న భాషా చిత్రం తెలుగు సినిమా మాత్రమే. ఇండియాలోనే ఏడాదికి తొమ్మిది నుండి పదివేల కోట్ల బిజినెస్ జరుగుతుంది. దీన్ని ప్రేక్షకులకు సినిమా అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమాలు తీయడానికి అందమైన లోకేషన్స్ ఉన్నాయి. నేను సినిమా పరిశ్రమలో పెద్దలకు చెబుతున్నదొక్కటే ఆంధ్రప్రదేశ్ లో సినిమాల నిర్మాణానికి ముందుకు వస్తే ప్రభుత్వం తరపున అన్నీ విధాల సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. అండగా నిలబడతాం, పూర్తిగా ప్రోత్సాహం అందిస్తాం. సాయికొర్రపాటి అన్నీ సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిర్మిస్తున్నారు. నారా రోహిత్ బాణంతో తన తొలిసినిమాను స్టార్ట్ చేసి కంటిన్యూగా దూసుకెళ్తున్నారు. తారకరత్న విలన్ గా చేయడం హ్యపీగా ఉంది. రోహిత్, తారకరత్న కాంబినేషన్ లో ఈ సినిమా రావడం సంతోషంగా ఉంది. నారారోహిత్ తో మా కుటుంబానికి కూడా సినిమా రంగంతో రిలేషన్ ఏర్పడింది. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ అందించారు. సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుంది, సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘’ఈ చిత్ర నిర్మాత సాయికొర్రపాటి నా సోదరుడు, స్నేహితుడు. నాతో లజెండ్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్లు తెలుస్తుంది. సాయికార్తీక్ అన్నీ పాటలకు మంచి బాణీలను అందించాడు. తనకు అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి సినిమాను బాగా తెరకెక్కించినట్టు కనపడుతుంది. నటీనటుల నుండి మంచి నటనను రాబట్టుకున్నట్లు తెలుస్తుంది. నారారోహిత్, తారకరత్న కలయిక చూస్తుంటే సినిమా డిఫరెంట్ గా అనిపిస్తుంది. మంచి టెక్నికల్ టీం కుదిరింది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నారా రోహిత్ మాట్లాడుతూ ‘’క్వాలిటీ సినిమాలు చేసే వారాహిచలన చిత్రం బ్యానర్ లో ఇలాంటి ఓ మంచి సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. దర్శకుడు ప్రదీప్ తనకు ఏం కావాలో దాన్ని మా నుండి హండ్రెడ్ పర్సెంట్ రాబట్టుకున్నాడు. సాయికార్తీక్ తో నేను చేస్తున్న ఐదో సినిమా. మంచి సాంగ్స్, సినిమాటోగ్రఫీ అందించారు. సినిమాటోగ్రాఫర్ భాస్కర్, ఇషా తల్వార్ సహా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

సాయి కార్తీక్ మాట్లాడుతూ ‘’ ఇంత పెద్ద సినిమాలో నాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు రోహిత్ గారు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.

దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ ‘’ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం సాయికొర్రపాటి, నారారోహిత్ గారే కారణం. అందరికీ థాంక్స్’’ అన్నారు.

తారక రత్న మాట్లాడుతూ ‘’అద్భుతమైన సినిమా. నిర్మాత సాయికొర్రపాటిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. చంద్రబాబునాయుడుగారు, బాలయ్యగారి చేతుల మీదుగా ఆడియో విడుదల కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం’’ అన్నారు.

ఇషా తల్వార్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో పార్ట్ అయినందుకు హ్యపీగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved