pizza
Siddhartha music launch
`సిద్ధార్థ` ఆడియో ఆవిష్కరణ
You are at idlebrain.com > News > Functions
Follow Us

2 September 2016
Hyderaba
d

లంకాల బుచ్చిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో సాగ‌ర్‌, రాగిణి నంద్వాణి, సాక్షిచౌద‌రి హీరో హీరోయిన్లుగా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కె.వి.ద‌యానంద్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం `సిద్ధార్థ‌`. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ, దాసరి కిరణ్ కుమార్, పరుచూరి గోపాలకృష్ణ, సాగర్, మోహన్‌రావ్‌, సుబ్రమణ్యం, బి.గోపాల్‌, మల్టీడైమన్షన్‌వాసు, రాజాబాబు, డైరెక్టర్‌ బాబీ, సత్యారెడ్డి, సిరాశ్రీ, రాజ్‌కందుకూరి, అలీ, హవీష్‌, స్వామినాయుడు, రైటర్ విసు, లంకాల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా....

రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ - ''నాకు, సిద్ధార్థ అనే పేరుకు మంచి రిలేషన్‌ ఉంది. నేను రౌడీలు, గుండాలు గురించి నేర్చుకుంది విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్‌లోనే. అలాగే ఇప్పుడు వంగవీటి సినిమా కూడా తీస్తున్నాను. గోపాల్‌రెడ్డిగారు, మణిశర్మగారు, ఈ ఇద్దరితో నాకు మంచి అనుబంధం ఉంది. పరుచూరి బ్రదర్స్‌గారు గొప్ప రచయితలు. వారి గొప్పతనం పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు. దాసరి కిరణ్‌కుమార్‌ మంచి నిర్మాత, మా కాంబినేషన్‌లో వంగవీటి సినిమా రానుంది. సాగర్‌ హీరోగా చూడటానికి బావున్నాడు. సినిమాలోని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ బావున్నాయి. సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్‌ అవుతుంది'' అన్నారు.

నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ - ''సిద్ధార్థ చిత్రం ఇంత బాగా రావడానికి, నేను నిర్మించడానికి కారణం బుచ్చిరెడ్డిగారు, విసుగారు కారే కారణం. గోపాల్‌ రెడ్డిగారు ప్రతి సీన్‌ను ఎంతో రిచ్‌గా చూపించారు. మణిశర్మగారు ప్రతి సాంగ్‌ను అద్భుతంగా అందించారు. పరుచూరి బ్రదర్స్‌గారు ఎంతో మంచి డైలాగ్స్‌ అందించారు. విసుగారు మంచి కథను అందించారు. సాగర్‌..మొగలిరేకులు సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో తెలిసిన హీరో. దయానంద్‌ రెడ్డి, సాగర్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా మంచి కథను అందించారు. తెలుగులో టాప్‌ 5 డైరెక్టర్స్‌లో ఒకరిగా నిలుస్తారు. రాగిణి, సాక్షి అందరూ చక్కగా నటించారు. నాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

రైటర్‌ విసు మాట్లాడుతూ - ''దాసరి కిరణ్‌కుమార్‌గారు ఎంతో ప్యాషన్‌తో సినిమా చేశారు. గోపాల్‌రెడ్డిగారు ప్రతి సీన్‌ను అందంగా రచించారు. పరుచూరి బ్రదర్స్‌ కుంటుంబ సభ్యుల్లా ఎంతగానో సపోర్ట్‌ చేశారు. మణిశర్మగారు చాలా మంచి మ్యూజిక్‌ అందించారు'' అన్నారు.

డైరెక్టర్‌ దయానంద్‌రెడ్డి మాట్లాడుతూ - ''దాసరి కిరణ్‌ గారి ఆలోచనలే గొప్పగా ఉంటాయి. ఆయన ఇంకా ఎంతో మంది కొత్తవారికి లైఫ్‌ ఇస్తారనడంలో సందేహం లేదు. గోపాల్‌రెడ్డిగారు, మణిశర్మగారు, పరుచూరి బ్రదర్స్‌ వంటి గొప్ప టెక్నిషియన్స్‌తో పనిచేసే అవకాశం కలిగింది. రీ రికార్డింగ్‌ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత సాగర్‌ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుని ఓ వెలుగు వెలుగుతాడు. రాగిణి, సాక్షిచౌదరిగారు చక్కగా యాక్ట్‌ చేశారు. పవన్‌కల్యాణ్‌గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఆడియో విడుదల కావడం ఆనందంగా ఉంది'' అన్నారు.

Glam galleries from the eventలంకాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''మంచి కథ, మంచి టెక్నిషియన్స్‌తో చేసిన సినిమాను అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను'' అన్నారు.

హీరో సాగర్‌ మాట్లాడుతూ
- ''నేను మనసంతా నువ్వే సినిమాలో నటించాను. ఆ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆప్పుడు గోపాల్‌రెడ్డిగారితో పనిచేశాను. ఇప్పుడు ఆయనతో చేయడం ఆనందంగా ఉంది. అలాగే పరుచూరి బ్రదర్స్‌తో చేయడం హ్యాపీగా ఉంది. లైఫ్‌లో ఎన్ని సినిమాలైనా చేయవచ్చు కానీ ఈ సినిమాతో నాకు చాలా మంచి కుటుంబం ఏర్పడింది. రాగిణి, సాక్షి అందరూ ఎంతగానో సపోర్ట్‌ చేశారు. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ''మేము రచయితలుగా 350 సినిమాలకు పనిచేశాం. ఆయన ఓ సందర్భంలో.. మీరు ఏ హీరోకు మాటలు రాసినా, నన్ను దృష్టిలో పెట్టుకునే రాయండి అన్నారు..అలాగే ఇప్పటి వరకు మేం మాటలు రాస్తూ వస్తున్నాం. సాగర్‌కు కూడా అలాగే రాశాం. దాసరి కిరణ్‌ మంచి ధైర్యమున్న నిర్మాత. సాగర్‌ బాడీ లాంగ్వేజ్‌లో పవర్‌ ఉంటుంది. సినిమా ప్రపంచంలో చాలా గొప్పగా ఎదగాలి. డైరెక్టర్‌ దయానంద్‌రెడ్డి ఎంతో చక్కగా డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమాలో ప్రేమ, సెంటిమెంట్‌, పగను చక్కగా చూపిస్తున్నారు. సాగర్‌ను బుల్లితెరకే కాదు, వెండితెరకు కూడా పెద్ద హీరోఅవుతాడు. గోపాల్‌రెడ్డి, మణిర్మ చాలా మంచి టెక్నిషియన్స్‌ ఈ సినిమాకు కుదిరారు. ఈ సినిమాను సెప్టెంబర్‌ 16న రిలీజ్‌ చేస్తున్నారు'' అన్నారు.

బి.గోపాల్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాకు గొప్ప టెక్నిషియన్స్‌ పనిచేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్‌ గ్రేట్‌ రైటర్స్‌. హిట్‌ సినిమా తీయాలనే తపన గల నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌, అందమైన హీరో సాగర్‌, గ్రేట్‌ టెక్నిషియన్‌ గోపాల్‌రెడ్డిగారు, మణిశర్మ వీరందరూ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను.

మల్టీడైమన్షన్‌ వాసు మాట్లాడుతూ - ''కథ తెలుసు. కిరణ్‌గారు కథను బట్టి బడ్జెట్‌ గురించి ఆలోచించని నిర్మాత. లావిష్‌గా సినిమా చేసినట్టు కనపడుతుంది. పరుచూరి బ్రదర్స్‌, గోపాల్‌రెడ్డి, బుల్లితెర సూపర్‌స్టార్‌ సాగర్‌, డైరెక్టర్‌ దయానంద్‌ రెడ్డి, మణిశర్మ ఇలా అందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్‌ సాధించాలి'' అన్నారు.

డైరెక్టర్‌ బాబీ మాట్లాడుతూ - ''ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్‌. యూనిట్‌లోని ప్రతి ఒక్కరితో నాకు మంచి అనుబంధం ఉంది. డైరెక్టర్‌ దయానంద్‌ రెడ్డి ఈ సినిమాకు ముందు పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌లో నాకు పరిచయం అయ్యారు. సాగర్‌ బుల్లితెరపై ప్రేక్షకులను ఎలా అలరించారో సినిమాలో కూడా ఇలాగే అలరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

హవీష్‌ మాట్లాడుతూ - ''కిరణ్‌కుమార్‌గారి నిర్మాణంలో చేసిన జీనియస్‌, రామ్‌లీల సినిమాలు చేశాను. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాలంటే ప్యాషన్‌ ఉన్న నిర్మాత. బుల్లితెరలో నెంబర్‌వన్‌ హీరో అయిన సాగర్‌గారు, సినిమాల్లో కూడా పెద్ద స్టార్‌ కావాలని కోరుకుంటూ యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.

సాగర్, రాగిణి నంద్వాని, సాక్షిచౌదరి, పూజ., కోట‌శ్రీనివాస‌రావు, అజ‌య్, సుబ్బ‌రాజు, స‌త్యం రాజేష్‌, తాగుబోతు రమేష్‌, ప్ర‌భాస్ శ్రీను, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించిన ఈ చిత్రానికి క‌థః విస్తు, డైలాగ్స్ః ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, ఆర్ట్ః వివేక్ అన్నామ‌లై, ఫైట్స్ః సాల్మ‌న్‌, డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, కొరియోగ్ర‌ఫీః హారీష్ పాయ్‌, ఎడిటింగ్ః ప్ర‌వీణ్ పూడి, సంగీతంః మ‌ణిశ‌ర్మ‌, స‌హ నిర్మాతః ముత్యాల ర‌మేష్‌, నిర్మాతః దాస‌రి కిర‌ణ్‌కుమార‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః కె.వి.ద‌యానంద్ రెడ్డి.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved