pizza
Malupu release on 19 February
Mahesh Babu launches Sri Sri music
‘శ్రీ శ్రీ’ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 February 2016
Hyderabad

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల, న‌రేష్‌, సుధీర్ బాబు ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం శ్రీ శ్రీ. ఎస్‌.బి.ఎస్‌.ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌క‌త్వంలో చాట్ల సాయిదీప్‌, బాలు రెడ్డి.వై, షేక్ సిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇ.య‌స్‌.మూర్తి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ముఖ్యతిథిగా హాజ‌ర‌య్యారు.

థియేట్రికల్ ట్రైలర్ ను, బిగ్ సీడీని మ‌హేష్ ఆవిష్క‌రించారు. ఆడియో సీడీలను మహేష్ విడుదల చేసి తొలి సీడీని కృష్ణంరాజుకు అందించారు.

సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ ``నేను న‌టుడుగా 50 వ‌సంతాల‌ను పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో ఈ వేదిక‌పై న‌న్ను స‌త్క‌రించినందుకు నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఈ సంద‌ర్భంగా నేను కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల్సిన వ్య‌క్తులు ఇద్ద‌రూ వారిలో ఒక‌రు తేనెమ‌న‌సులు సినిమాతో న‌న్ను హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేసిన ఆదూర్తి సుబ్బారావుగారు ఒక‌రైతే, గూఢ‌చారి 116తో మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన డూండీగారు మరొక‌రు. ఇప్పుడు న‌టుడుగా 50 వ‌సంతాలు పూర్తి చేసుకునే బ‌లాన్ని గూఢ‌చారి 116 సినిమా ఇచ్చింది. ఆరేడు సంవ‌త్స‌రాలుగా నేను మంచి క్యారెక్ట‌ర్ చేయ‌లేదు. శివ మ‌రాఠీ సినిమాను చూప‌గానే సినిమా బాగా న‌చ్చింది. ముప్ప‌ల‌నేని శివ మ‌రాఠీ సినిమా కంటే వంద‌రెట్లు బాగా డైరెక్ట్ చేశాడు. ఈ యాక్టింగ్ కెరీర్‌లో ఇదొక మైల్‌స్టోన్ మూవీ అవుతుంది. ఇలాంటి చిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌చ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల మాట్లాడుతూ ``ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆనందంగా నేను, కృష్ణ‌గారు హ్య‌పీగా ఫీల‌య్యాం. నేను, ఆయ‌న క‌లిసి న‌టించిన 48వ సినిమా ఇది. మ‌రో రెండు సినిమాలు చేస్తే 50 సినిమాలు పూర్త‌వుతాయి. మ‌రాఠీ కంటే శివ‌గారు గొప్ప‌గా తీశారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు నచ్చే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ ``చాలా ఆనందంగా ఉంది. మొట్ట‌మొద‌టిసారి ముప్ప‌ల‌నేని శివ, కృష్ణ‌కు ఓ షీల్డ్ ఇవ్వ‌మ‌న్నారు. నేను ఆ బ‌రువు తట్టుకోలేక‌పోయాను. ఆ బ‌రువే సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో అంత /బ‌రువైన మ‌నిషి, ఉత్త‌ముడు, ఎగ్రెసివ్ ప‌ర్స‌న్ కృష్ణ‌గారు. నేను కాదు..రెబ‌ల్‌స్టార్‌, ఆయ‌నే రెబ‌ల్ ప్రొడ్యూస‌ర్‌. అల్లూరి సీతారామ‌రాజు సినిమా తీసి తెలుగు సినిమా పొటెన్సిని నిరూపించారు. మొద‌టి క‌ల‌ర్ సినిమా, కౌబోయ్ సినిమా ఇలా ఒక‌టి కాదు, రెండు కాదు ఆయన చేసిన సాహ‌సాలు ఎన్నో. కానీ నాకు, కృష్ణ‌కు మ‌ధ్య గొప్ప అనుబంధం ఉంది. ఎంతంటే కృష్ణ అఖ‌రి అమ్మాయిని నేను ద‌త్త‌త తీసుకుంటానంటే ఇస్తాన‌ని అన్నాడు. అంతే కాదు మ‌హేష్ బాబుతో బాబీ సినిమా తీస్తాన‌ని అన్నాను. మేమంతా ఒకే కుటుంబం. మా మ‌న‌సులు ఒక‌టే. ఎప్పుడైనా కృష్ణ వ‌స్తున్నాడంటే క‌ల‌వ‌డానికి నేను అతృత‌గా ఎదురుచూస్తాను. ఈ ఫంక్ష‌న్‌కు రావ‌డానికి అదే కార‌ణం. కృష్ణ 50 వ‌సంతాలు ఎక్క‌డా అల‌సిపోకుండా విజ‌య‌నిర్మల కాపాడుకుంది. నేను కూడా కొన్ని నెల‌ల్లో 50 వ‌సంతాల‌ను న‌టుడిగా పూర్తి చేస్తున్నాను. తీగ ఎద‌గ‌డానికి క‌ర్ర స‌హాయం ఎలా అవ‌స‌ర‌మో మ‌గ‌వాడి విజ‌యానికి ఇంట్లో ఆడ‌వారి స‌పోర్ట్ ఎంతో అవ‌ర‌సరం. కృష్ణ 50 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన త‌ర్వాత శ్రీ శ్రీ సినిమాలో హుషారుగా త‌గ్గ‌కుండా యాక్ట్ చేశారు. త‌ను ఇదే హుషారుతో ఇంకా మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ముప్ప‌ల‌నేని శివ ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకోవాలి. కృష్ణ నిర్మాత‌ల‌కే కాదు, సినిమా ఇండ‌స్ట్రీకే స‌పోర్ట్ చేశారు. సంవ‌త్స‌రానికి 14, 15 సినిమాలు చేశాను. ఎందుకిలా చేస్తున్నారు అని ఎవ‌రో అడ‌గ్గా నేను ఇయ‌ర్‌లో ఆరేడు సినిమాలు చేయ‌వ‌చ్చు. కానీ అంత‌కంటే ఎక్కువ సినిమాలు చేయ‌డానికి కార‌ణం 120 కుటుంబాలు తృప్తిగా ఉంటాయ‌ని ఆయ‌న అన్నారు. అదే అత‌ని గొప్ప‌త‌నం. త‌ను నాకు చాలా ఆత్మీయుడు. గొప్ప‌వాడు`` అన్నారు.

సూపర్ స్టార్ మ‌హేష్ మాట్లాడుతూ ``నాలుగైదు నెల‌లు క్రితం నాన్న‌గారి గెట‌ప్‌ను పేప‌ర్‌లో చూశాను. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. ఎందుకంటే నాన్న‌గారికి ఉన్న అభిమానుల్లో పెద్ద అభిమానిని నేనే. శివ‌గారికి థాంక్స్‌. ట్రైల‌ర్ చూడ‌గానే సినిమా చూడాలనే అతృత మొద‌లైంది. ఎప్పుడూ నాన్న‌గారు నా సినిమాల‌కు అతిథిగా వ‌స్తుంటారు. నేను ఇవాళ నాన్న‌గారి సినిమాకు రావ‌డం ఆనందంగా ఉంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఆల్ ది బెస్ట్‌. సినిమా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నాను.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇ.య‌స్‌.మూర్తి మాట్లాడుతూ ``మా చిన్న‌ప్పుడు సినిమాల్లో కృష్ణ‌గారిని చూసి పెద్ద గోల చేసేవాడిని, కృష్ణ‌గారి సినిమా చూడ‌టానికి టికెట్ కోసం యుద్దం చేసేవాడిని. ఆయ‌న సినిమాకు మ్యూజిక్ చేస్తాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. అందుకు కార‌ణం నా మిత్రుడు ముప్ప‌ల‌నేని శివ‌. కృష్ణగారు నిన్న‌, ఈరోజు, రేపు కూడా సూప‌ర్‌స్టారే. ఈ సినిమాలో ఎంతో అందంగా క‌న‌ప‌డ్డారు. కృష్ణ‌గారు, విజ‌య‌నిర్మల‌గారు క‌లిసి న‌టించిన ఈ సినిమాకు నేను మ్యూజిక్ చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది`` అన్నారు.

నిర్మాత‌ల్లో ఒక‌రైన చాట్ల సాయిదీప్ మాట్లాడుతూ ``ముప్ప‌ల‌నేని శివ మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. మా బ్యాన‌ర్ నుండి ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో శివ‌గారు న‌న్ను క‌లిసి శ్రీ శ్రీ గురించి చెప్పారు. ఇలాంటి సినిమా కోస‌మే మేం వెయిట్ చేస్తున్నామ‌నుకుని స‌రేన‌న్నాం. ఈ సినిమాలో కృష్ణ‌గారి యాక్టింగ్ అద్భుతం. ఈ సినిమాలో మ్యూజిక్ బాగా వ‌చ్చింది. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.

ముప్ప‌ల‌నేని శివ మాట్లాడుతూ ``ఎదురుగా అన్యాయం జ‌రుగుతున్న‌ప్పుడు గుండె మండి ప్ర‌తివాడు శ్రీ శ్రీయే. నిర్మాత‌లు ఎంతో స‌పోర్ట్ చేశారు. కృష్ణ‌గారి గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే మూవీ అవుతుంది`` అన్నారు.

న‌రేష్ మాట్లాడుతూ ``కృష్ణ‌గారంటే 50 ఏళ్ళ బ్ర‌హ్మోత్సవం. సినిమా డ‌బ్బింగ్ చెప్పేట‌ప్పుడు ముప్ప‌ల‌నేని శివ‌ను పిలిచి మ‌రో కృష్ణ‌గారు 50 వ‌సంతాలు న‌ట ప్ర‌స్థానం ముగించిన త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. క‌చ్చితంగా సూప‌ర్‌హిట్ చిత్ర‌మ‌వుతుంద‌ని చెప్పాను. ఇది మ‌రాఠీ సూప‌ర్‌హిట్ బేస్డ్ మూవీ. మంచి సినిమా. మంచి మ్యూజిక్ కుదిరింది. మంచి మెసేజ్ ఉన్న చిత్రం. ఈ సినిమాలో నేను కీల‌క‌మైన పాత్ర వేయ‌డం గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను`` అన్నారు.

హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘కృష్ణగారు లేకపోతే నేను ఎక్కడ వుండేవాడ్నో తెలియదు. ఎంత డబ్బు సంపాదించినా ఇండస్ట్రీకి వచ్చి వుండేవాడ్ని కాదు. ‘ప్రేమకథా చిత్రమ్‌, భలే మంచి రోజు’ సక్సెస్‌తో ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాను. అదంతా కృష్ణగారి వల్లే. ఫస్ట్‌ ఈ సినిమాలో గెస్ట్‌ అప్పీయరెన్స్‌ లో నటిస్తున్నానని కొన్ని వార్తలు వచ్చాయి. అవి చూసి నవ్వుకున్నాను. కృష్ణగారి సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌ అవకాశం వచ్చినా చేయడానికి నేను రెడీ. ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్‌లో నటించాను. ఎన్ని సినిమాల్లో యాక్ట్‌ చేసినా కూడా నాకు ఇంత శాటిస్‌ఫ్యాక్షన్‌ దొరకదు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు సినిమా చూశాను. ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. మా అబ్బాయి దర్శన్‌ ఈ సినిమాతో లాంచ్‌ అవడం చాలా సంతోషంగా వుంది’’ అన్నారు.

దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ‘‘నేను కృష్ణగారితో 10 సినిమాలు చేశాను. 70 పర్సెంట్‌ హిట్స్‌ వున్నాయి. ‘కిరాయి కోటిగాడు’, ‘రామరాజ్యంలో భీమరాజు’ చిత్రాు చాలా పెద్ద సక్సెస్‌ అయ్యాయి. కృష్ణ చాలా భోళా మనిషి. ముఖ్యంగా నిర్మాతల మనిషి. సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాతలు వచ్చి ఇబ్బంది వుంది అంటే... ఓకే. నాకివ్వాల్సిన రెమ్యూషనరేషన్‌ తర్వాత ఇవ్వు.. ముందు సినిమా రిలీజ్‌ చెయ్యి అని చెప్పిన ఏకైక వ్యక్తి కృష్ణగారు. మా అబ్బాయితో ‘గొడవ’ తీసాను. మీ అబ్బాయి సినిమా బాగుంది అని చెప్పిన ఏకైక వ్యక్తి కృష్ణగారు. ‘శ్రీశ్రీ’ గెటప్‌లో ఆయన చాలా బావున్నారు. ఈ సినిమా హిట్‌ అయ్యి మరెన్నో మంచి చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘30 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. కృష్ణగారితో ‘మకుటం లేని మహారాజు’ సినిమా తీశాను. ఆయన అప్పుడు ఎలా వున్నారో ఇప్పుడూ అలాగే వున్నారు. ఆ గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమా మంచి సక్సెస్‌ అయ్యి కృష్ణగారు మరెన్నో మంచి చిత్రాల్లో నటించాలి’’ అన్నారు.

‘మా’ అధ్యక్షుడు డా. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘మా అన్నయ్య 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ తరపున సన్మానించుకోవడం పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ ‘‘సూపర్‌స్టార్‌ అన్న పదానికి 100% అర్థం మా అన్న కృష్ణగారు. ఆయన బ్యానర్‌లో నటించే భాగ్యం కలగడం మా అదృష్టం. ఇంకా మరిన్ని చిత్రాల్లో నటించాలి’’ అన్నారు.

నటుడు ఏడిద శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘కృష్ణగారికి పెద్ద అభిమానిని. ఆయనకి తమ్ముడిగా ఒక టీ.వి. సీరియల్‌లో నటించాను. ఈ ఆడియో ఫంక్షన్‌కి రావడం చాలా ఆనందంగా వుంది’’ అన్నారు.

సాయికుమార్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ముర‌ళీ శ‌ర్మ‌, ఎల్‌.బి.శ్రీరాం, తోట‌ప‌ల్లి మ‌ధు, కాదంబ‌రి కిర‌ణ్‌, పృథ్వీ, దేవ‌దాస్ క‌న‌కాల‌, కునాల్ కౌశిక్‌, అన‌గాన రాయ్‌, సోఫియా, ఆశిష్ గాంధీ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించిన ఈ చిత్రానికి స్టోరీః ర‌మేష్ డియో ప్రొడ‌క్షన్స్‌, డైలాగ్స్ః రాం కంకిపాటి, మ్యూజిక్ః ఇ.య‌స్‌.మూర్తి, ఎడిట‌ర్ః ర‌మేష్ కొల్లూరి, సినిమాటోగ్ర‌ఫీః స‌తీష్ ముత్యాల‌, ఆర్ట్ః అశోక్‌, స్క్రిప్ట్ః క‌ళ్యాణ్ జీ గోగ‌నా, ఫైట్స్ః నందు, నిర్మాత‌లుః చాట్ల సాయిదీప్‌, బాలు రెడ్డి.వై, షేక్ సిరాజ్, ద‌ర్శ‌క‌త్వం: ముప్ప‌ల‌నేని శివ‌.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved