pizza
Sai Dharam Tej's Supreme music launch
సుప్రీమ్ ఆడియో విడుద‌ల‌
ou are at idlebrain.com > News > Functions
Follow Us

14 April 2016
Hyderabad

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా, 'పటాస్' సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతోన్న చిత్రం 'సుప్రీమ్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో , శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆడియో వేడుక హైద‌రాబాద్ లోని శిల్ప‌క‌ళావేదిక‌లో గురువారం రాత్రి జ‌రిగింది. సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు.

నాని, వ‌రుణ్ తేజ్ క‌లిసి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. అంజ‌నాదేవి బిగ్ సీడీని విడుద‌ల చేశారు. అల్లు అర‌వింద్ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. నాని, వ‌రుణ్ తేజ్ తొలి సీడీల‌ను అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ``ఈ సినిమా చాలా బావుంటుంది. మాస్ సినిమా. ఫ‌స్టాఫ్‌లో జె.పి.గారి పాత్ర చాలా బావుంది. రాశీఖ‌న్నా ఇందులో ర‌ఫ్ ఆడించేసింది. ఆమె పేరు ఇందులో బెల్లం శ్రీదేవి`` అని అన్నారు.

రామ‌జోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ ``సుప్రీమ్ టైటిల్‌లో ఒక ప‌వ‌ర్ ఉంది. ఈ క‌థ వింటే నాకు మ‌రో ప‌సివాడి ప్రాణం గుర్తొస్తుంది. సినిమాలో చిన్న‌పిల్లాడి పాత్ర ఉంటుంది. సినిమాలో అంద‌రిక‌న్నా ఎక్కువ మార్కులు అత‌ను కొట్టేస్తాడు. అంత ముద్దొస్తాడు. ఈ మ‌ధ్య సాయికార్తీక్ సంగీతంలో సినిమాలు వినిపిస్తున్నాయి. లోక‌ల్ టాలెంట్‌ని, లోక‌ల్ సింగ‌ర్స్ ని ప్రోత్స‌హిస్తున్నాడు సాయికార్తీక్. అనిల్ రావిపూడి నాతో మూడు పాట‌లు రాయించాడు`` అని అన్నారు.

గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ ``సుప్రీమ్ హీరో ఎన‌ర్జీ ఉన్న హీరో. నాకు బాగా న‌చ్చిన హీరో. త‌ను ఆల్రెడీ మాస్‌లోకి వెళ్లాడు. ఈ సినిమాతో ఒక బేస్ వేసుకుంటాడు. ఈ సినిమా స్క్రిప్ట్ నాకు తెలుసు. ఇందులో రెండు పాట‌లు, రెండు కామెడీ సీన్లు చూశాను. రాశీఖ‌న్నా ఇందులో బెల్లం శ్రీదేవిగా చేసింది. మంచి పోలీస్ ఆఫీస‌ర్‌గా చేసింది. ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. అనిల్‌లో మంచి క‌మ‌ర్షియ‌ల్ డైర‌క్ట‌ర్‌. త‌న మాస్ యాంగిల్‌ని మ‌రో సారి ఈ సినిమాలో చూపించాడు. మా దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో ప‌క్కా మాస్ సినిమా ఇదే అవుతుంది. సాయికార్తీక్ మంచి సంగీతాన్నిచ్చాడు`` అని చెప్పారు.

హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ ``తేజ్ నాకు చాలా ఇష్ట‌మైన హీరో. దిల్‌రాజుగారు నాకు బాగా ఇష్ట‌మైన నిర్మాత‌. ఇంత‌మంది ఫ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండి, మెగా బ్యాక్ డ్రాప్ నుంచి వ‌చ్చిన‌ప్పుడు ఏ హీరోకైనా ధైర్యం ఉంటుంది. కానీ తేజూతో ప‌నిచేసిన త‌ర్వాత ఎప్పుడూ మావయ్య‌ల‌కు చెడు పేరు తీసుకునిరాకూడ‌ద‌నే భ‌యంతో ఉంటాడనే విష‌యం అర్థ‌మైంది. ఆ భ‌య‌మే అత‌న్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సినిమా సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌క‌న్నా ప‌ది రెట్లు పెద్ద హిట్ అవుతుంది. అనిల్‌రావిపూడితో ఎంత సేపు మాట్లాడితే అంత సేపు న‌వ్విస్తాడు. త‌ను చాలా పెద్ద హిట్ కొట్ట‌బోతున్నాడు. ఈ సినిమాకు సాయి మ్యూజిక్ పెద్ద ప్ల‌స్‌`` అని అన్నారు.

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మాట్లాడుతూ ``మంచి ట్రాక్ చేశాను. బాగా ఎంజాయ్ చేశాను. ప్రేక్ష‌కులు, ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి`` అని చెప్పారు.

స‌త్యం రాజేశ్ మాట్లాడుతూ ``సాయిధ‌ర‌మ్‌తేజ్ ఆర్టిస్ట్ క‌న్నా ముందు మంచి కొడుకు. ఆయ‌న్ని చూసి వాళ్ళ మ‌ద‌ర్ గ‌ర్వ‌ప‌డితే హ్యాపీగా ఫీల‌య్యా. త‌ను మంచి ఆర్టిస్ట్`` అని అన్నారు.

అభిషేక్ మాట్లాడుతూ `` మాకు డిస్ట్రిబ్యూష‌న్ ఇచ్చినందుకు దిల్‌రాజు, శిరీష్‌కి ధ‌న్య‌వాదాలు. `` అని అన్నారు.

వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ ``అప్ప‌ట్లో అందం హిందోళం పాట‌ను చూసి పుల‌క‌రించ‌నివాళ్లు లేరు. మేన‌మామ పోలిక‌లుంటే అదృష్ట‌వంతులంటారు. తేజు అదృష్ట‌వంతుడు. అనిల్ చాలా ఎన‌ర్జిటిక్ ప‌ర్స‌న్‌. రాజుగారు, శిరీష్‌, ల‌క్మ‌ణ్ వ‌ల్ల‌నే నేను ఇవాళ అంద‌రి ముందు నిల‌బ‌డ‌గ‌లిగాను`` అని తెలిపారు.

ర‌వికిష‌న్ మాట్లాడుతూ ``అమేజింగ్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు. పెద్ద మ‌న‌సున్న వ్య‌క్తి. సాయిధ‌ర‌మ్ చాలా హంబుల్‌గా ఉంటాడు. బ‌న్ని నా ప‌ట్ల ఎలాంటి అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించాడో, ఈ సినిమాతో సాయి కూడా అదే అభిమానాన్ని చూపించాడు. రేసు గుర్రంలో స‌గం పిచ్చోడిగా, ఈ సినిమాలో పూర్తి పిచ్చోడిగా న‌టించాను. నేను ఇక్క‌డే ఇల్లు కొనుక్కుని ఇక్క‌డే ఉంటున్నాను. వ‌చ్చే సినిమాలో తెలుగులో డ‌బ్బింగ్ చెబుతాను. తెలుగు నేర్చుకుంటున్నాను`` అని అన్నారు.

శేషు మాట్లాడుతూ ``ఇందులో నేను జెన్ని అనే పాత్ర‌లో న‌టించాను. ర‌వికిష‌న్ ప‌క్క‌నుండే పాత్ర నాది`` అని అన్నారు.

Rashi Khanna Glam gallery from the event

రాశీఖ‌న్నా మాట్లాడుతూ ``సాయిధ‌ర‌మ్‌తేజ్ డ్యాన్సుల‌ను చించేశారు. త‌ను చాలా మంచి న‌టుడు. మంచి వ్య‌క్తి. త‌న‌తో ప‌నిచేసే న‌టీన‌టుల్ని గౌర‌విస్తాడు. మా ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌కుడు మాత్ర‌మే పాట‌లు పాడ‌తారు. డ్యాన్సులు చేస్తారు. అలాగే న‌న్ను ఎంత‌గానో ప్రోత్స‌హించిన దిల్‌రాజుగారికి ధ‌న్య‌వాదాలు`` అని చెప్పారు.

సాయికార్తిక్ మాట్లాడుతూ ``గ‌తేడాది అనిల్‌గారు ప‌టాస్ ఇచ్చారు. ఈ సారి ఈ సినిమాను ఇస్తున్నారు. రెండు ద‌శాబ్దాల క్రితం మెగాస్టార్ చిరంజీవిగారు చేసిన సినిమాలోని పాట‌ను ఈ సినిమాలో రీమిక్స్ చేశాం. చాలా బాగా వ‌చ్చింది. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది`` అని చెప్పారు.

నాని మాట్లాడుతూ ``సాయి ఎప్పుడు క‌లిసినా ఆప్యాయంగా మాట్లాడ‌తాడు. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌లో వైట్ కుర్తా వేసుకుని ఉంటే చిరంజీవిగారిలాగా క‌నిపించాడు. ఆయ‌న‌లాగా క‌నిపించ‌డం కాదు ఆయ‌నంత స‌క్సెస్ కొట్టాల‌ని కోరుకుంటున్నాను. అలా మొద‌లైంది క్లైమాక్స్ లో తాగుబోతు ర‌మేశ్ ట్రాక్‌ని అనిల్ రాశాడు. డైర‌క్టోరియ‌ల్ బ్రిలియ‌న్స్ అనిల్‌లో ఉంటుంది. సాయికార్తిక్ ఈ సినిమాతో స్టార్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ కావాలి. దిల్‌రాజుగారితో త్వ‌ర‌లో సినిమా చేయ‌బోతున్నా. ఆర్య‌, భ‌ద్ర‌, బొమ్మ‌రిల్లు చేసిన రాజుగారి చుట్టూ గోల్డెన్ ఆరా ఉండేది. ఇప్పుడు సుప్రీమ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా గోల్డెన్ ఆరా క‌నిపిస్తోంది. ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రికీ చాలా రెస్పెక్ట్, చాలా డ‌బ్బు తెచ్చిపెట్టాలి. సుప్రీమ్ హీరో సాంగ్ చూసి రెండు సార్లు విజిల్ వేయాల‌నిపించింది. ఒక‌సారి అది చిరంజీవిగారి పాట కాబట్టి, రెండోసారి రాశీ న‌డుం క‌నిపించింది కాబ‌ట్టి`` అని అన్నారు.

వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ ``నేనూ, తేజ్ చిన్న‌ప్ప‌టి నుంచి ఫ్రెండ్స్ లా పెరిగాం. నాకు తెలిసిన‌వాళ్ళ‌లో మోస్ట్ హార్డ్ వ‌ర్కింగ్ బాయ్‌. ఇద్ద‌రం కలిసి జిమ్‌లో ప‌రిగెడుతుండేవాళ్లం. త‌న‌ని చూసే నేను త‌గ్గాను. అనిల్ రావిపూడిగారి ప‌టాస్ చూశాను. చాలా బాగా న‌చ్చింది. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి ఆల్ ది బెస్ట్ `` అని చెప్పారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ ``ప‌టాస్ సినిమా విష‌యంలో పెద్ద కాన్ఫిడెంట్ లేదు. రెండో సినిమా మాత్రం చాలా ఫ్రీడ‌మ్ తో చేశారు. థియేట‌ర్‌లో 5 శాతం చూశారు. థియేట‌ర్లో చాలా అంశాలుంటాయి. ఫ్యామిలీస్‌కి, పిల్ల‌ల‌కు న‌చ్చే అంశాలు చాలా ఉంటాయి. సుప్రీమ్ సినిమా ద్వారా నేను గొప్ప విష‌యం నేర్చుకున్నాను. ఆర్టిస్ట్ అనే వారి క‌ష్టం, రిస్క్ ఏంటో నేను ప్ర‌త్య‌క్షంగా చేశాను. రాజ‌స్థాన్‌లో ఓ ఛేజ్ చేశాం. ర‌వికిష‌న్‌, ఓ చిన్న‌పిల్లాడు, సాయి, రాశీ అంద‌రూ చాలా బాగా చేశారు. ర‌వికిష‌న్‌గారు గాయ‌ప‌డి మ‌ర‌లా వ‌చ్చి షూట్ చేశాడు. ఇందులో న‌టించిన ప్ర‌తి ఆర్టిస్టుకి నా టీమ్ త‌ర‌ఫున విష‌స్ చెప్పుకుంటున్నాను. క‌థ ఓకే చేసిన‌ప్ప‌టి నుంచి రాజుగారు `నాకు డ‌బ్బులు వ‌చ్చే సినిమా తీయ్‌` అని చెప్పేవారు. ఈ సినిమా ఆద్యంతం శిరీష్‌గారు న‌న్ను ఎక్కువ‌గా న‌మ్మారు. ప్ర‌తిరోజూ మాతో ఉంటూ మ‌మ్మ‌ల్ని న‌డిపించారు. తేజ్ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ గా చేశాడు. ఆల్ రౌండ‌ర్‌గా చేశాడు. తేజ్ ఈ సినిమాతో దుమ్ములేపుతాడు. ఈ చిత్రంలో రాశి హీరోయిన్ కాదు. క‌మెడియ‌న్‌. ఇన్నొసెంట్‌గా, పోలీస్ ఆఫీస‌ర్‌గా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. ర‌వికిష‌న్‌, క‌బీర్‌, పోసాని, వెన్నెల‌కిశోర్‌కి అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఇది టెక్నీషియ‌న్ల మూవీ. కెమెరామేన్ సాయిశ్రీరామ్‌, సంగీత ద‌ర్శ‌కుడు సాయికార్తిక్‌, ఫైట్స్ వెంక‌ట్ ఇలా ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగా చేశారు. సుప్రీమ్ స‌మ్మ‌ర్‌లో మీకు మంచి ఫీస్ట్`` అని అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ``మా సంస్థ‌కు 13 ఏళ్లు పూర్త‌య్యాయి. 13 ఏళ్లకు ముందు నాతో శిరీశ్‌గారు, ల‌క్ష్మ‌ణ్‌గారున్నారు. 20 సినిమాలు తీస్తే 16 స‌క్సెస్‌ఫుల్ సినిమాలు చేశాం. ఏడుగురు ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేశాం. ఈ సినిమాలో ఈ బ్యాన‌ర్‌కి ప్రెజెంట‌ర్ అని వేసుకున్నాం. అది అల్లు అరవింద్‌గారిని చూసి నేర్చుకున్నా. ఎస్వీసీ వెంచ‌ర్స్ ను ల‌క్ష్మ‌ణ్‌గారు చేస్తున్నారు. ఎస్వీసీ వెంచ‌ర్స్ ప్ర‌మోష‌న్ చేస్తుంది. సాయి చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు మా సంస్థ‌లోనే చేశాడు. ఈ సినిమా హిట్ అయితే హ్యాట్రిక్ అవుతుంది. సుప్రీమ్‌లో ఇంకో లెవ‌ల్‌కి ఎదుగుతాడు. చిరంజీవిగారితో సినిమా చేయాల‌నే కోరికను సాయితో కంప్లీట్ చేశాను. ప‌వ‌ర్‌స్టార్ సినిమా చేయాల‌నే కోరిక‌ను వ‌రుణ్తో చేసి తీర్చుకుంటాను. ప‌టాస్‌ను చూసిన త‌ర్వాత క‌నెక్ట్ అయ్యాడు. ఆ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ చేశాం. ఈ సినిమా కోసం ఎప్పుడూ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేదు. లొకేష‌న్ కి వెళ్ల‌లేదు. అంత సింపుల్‌గా తీశాడు అనిల్‌. సింపుల్‌గా ఒక క‌థ‌ను అనుకుని రెండున్న‌ర గంట‌లు తను చేసిన సినిమా ఇది. ఆర్టిస్టుల్ని చాలా అందంగా వాడుకున్నాడు. వేస‌విలో మా బ్యానర్‌లో వ‌స్తున్న స‌క్సెస్‌ఫుల్ సినిమా ఇది. సాయికార్తిక్ పాట‌ల‌ను అద్భుతంగా చేశాడు. కెమెరామేన్ విజువ‌ల్స్ బావున్నాయి. బెల్లం శ్రీదేవి పాత్ర‌లో రాశీఖ‌న్నా బాగా చేసింది. రాశీఖ‌న్నా పేరును అనిల్ చెప్ప‌గానే మా బ్యాన‌ర్‌లో మంచి హీరోయిన్స్ ను పెట్ట‌మ‌నే చెడు పేరుంది అని అన్నా. కానీ త‌ను చాలా బాగా చేసింది. చిన్న‌పిల్లాడు గాంధీ చాలా బాగా చేశాడు. హిందీవాడైనా తెలుగు నేర్చుకుని చెప్పాడు. ఈ సినిమాలో ర‌వికిష‌న్‌, క‌బీర్ ఇద్ద‌రూ మెయిన్ విల‌న్స్`` అని అన్నారు.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ``ఫ్యామిలీ ఆర్టిస్ట్ అంద‌రికీ థారు రోడ్డు వేసి న‌డిపించిన చిరంజీవిగారిని త‌ల‌చుకోవాలి. తేజ్ త‌ల్లి విజ‌య‌, అమ్మమ్మ కూడా అత‌ని విజ‌యం చూసి ఆనందించ‌డం నాకు సంతోషంగా ఉంది. తేజుతో నేను, దిల్‌రాజు క‌లిసి సినిమా చేశాం. దిల్‌రాజు మా ఫ్యామిలీ ప్రొడ్యూస‌ర్‌. బ‌న్నికి ఆర్య ఇచ్చాడు. తేజ్‌తో రెండు సినిమాలు వ‌రుస‌గా తీశాడు. అనిల్‌రావిపూడి ఆలా టైమింగ్‌లో తీస్తాడు సినిమాను. సాయికార్తిక్ పాట‌లు బావున్నాయి. మ‌న ఫ్యామిలీలో ఒళ్లుదాచుకోకుండా క‌ష్ట‌ప‌డే హీరో తేజ్‌. త‌న క‌ష్టం, త‌న ఆస‌క్తి త‌న‌ని ఎక్కువ హైట్స్ తీసుకెళ్తుంద‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయిన‌ట్టు ఫీలింగ్ వ‌స్తోంది`` అని చెప్పారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ ``అభిమానుల్లో ఒక‌డిగా ఉన్న నేను ఇవాళ ఇలా వ‌చ్చి మాట్లాడ‌టానికి కార‌ణ‌మైన మా ముగ్గురు మావ‌య్య‌ల‌కి పాదాభివంద‌నం. సుప్రీమ్ అనే టైటిల్ పెట్టుకోవ‌డానికి అర్హ‌త ఉండాలి. అందుకు విన‌గానే నాకు కంగారు వ‌చ్చింది. పెద్ద‌మావ‌య్య‌గారిద‌గ్గ‌రికి వెళ్లి ఈ విష‌యాన్ని చెప్తే ``నువ్వెందుకురా భ‌య‌ప‌డుతున్నాను. క‌ష్ట‌పడు`` అని అన్నారు. ర‌క్తం చిందించి అయినా స‌రే క‌ష్ట‌ప‌డి ముందుకు వెళ్లాలి అని డిసైడ్ అని అనుకున్నా. సుప్రీమ్ అనే పేరు పెట్టుకున్నందుకు చిరంజీవిగారి ప‌రువు నిల‌బెట్టాలి అని అనుకుని క‌ష్ట‌ప‌డ్డా. నిర్మాత రాజుగారితో ఇది నా మూడో సినిమా. నాకు ఎప్పుడైనా క‌థ న‌చ్చితే చెబితే ఎంక‌రేజ్ చేస్తుంటారు. శిరీష్ గారు ప్ర‌తి రోజూ సెట్‌కి వ‌చ్చి మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేశారు. ఎక్క‌డా ఖ‌ర్చుకు డోకా లేకుండా చేశారు. మా సినిమాలో అనిల్ గారి న‌వ్వు వినిపిస్తే షూటింగ్ క‌ట్ చేసే వాళ్లం. ఎన‌ర్జీ ఇచ్చాడు. నాలో 50 శాతం ఎనర్జీ ఉంటే దాన్ని 100 శాతం చేయించారు ఆయ‌న‌. నాలో నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకున్నారు. అనిల్ అన్న నాకు మంచి అవ‌కాశం ఇచ్చారు. సాయికార్తిక్‌గారి సంగీతం న‌చ్చింది. భ‌విష్య‌త్తులోనూ ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేస్తాను. కెమెరామేన్ రిస్కీ షాట్‌ల‌ను కూడా చాలా బాగా తీశారు. ర‌వికిష‌న్ వండ‌ర్‌ఫుల్ ప‌ర్స‌న్‌. రాజ‌స్థాన్‌లో చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ జ‌రిగిన 20 డేస్ త‌ర్వాత క‌లిసిన‌ప్పుడు చాలా ఎనర్జీతో మాట్లాడారు. అది స్ఫూర్తిగా అనిపించింది. రాశీ ల‌వ్లీ కోస్టార్‌. త‌న కామెడీ టైమింగ్ అద‌ర‌గొట్టింది. బుడ్డోడు చాలా బాగా చేశాడు. అభిమానుల్లో ఎప్పుడూ ఒక‌డిగా ఉండాల‌ని అనుకుంటాను`` అని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్యామ్ కాస‌ర్ల, శ్రీనివాస్‌రెడ్డి, శేషు, తేజ్ త‌ల్లి విజ‌య‌, పిన‌త‌ల్లి మాధ‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

న‌టీన‌టులు:
సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, రవి కిషన్, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి , శ్రీనివాస్ రెడ్డి, మురళీ మోహన్ , రఘు బాబు, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతిక వ‌ర్గం:
దర్శకత్వం - స్క్రీన్ ప్లే: అనిల్ రావిపూడి, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, ఆర్ట్: ఏ .ఎస్ ప్రకాష్, ఎడిటర్: ఎమ్ అర్ వర్మ, సంగీతం: సాయి కార్తీక్, నిర్మాత: శిరీష్, సమర్పకులు: దిల్ రాజు


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved