pizza
Taramani music launch
`తారామ‌ణి` ప్రెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


8 June 2018
Hyderabad


అంజలి, ఆండ్రియా, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో రామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'తారామణి'. ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో జె.ఎస్‌.కె. ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్‌ పతాకంపై డి.వెంకటేష్‌ తెలుగులో అందిస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ బ్యాన‌ర్ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తుంది. ఈ సినిమా ప్రెస్‌మీట్ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో...

మారుతి మాట్లాడుతూ - ``సిన్సియ‌ర్ ఎఫ‌ర్ట్ పెట్టి చేసిన సినిమా. యువ‌న్ శంక‌ర్‌గారి ఆడియో, స‌హా సినిమాలో స‌న్నివేశాలు ప్రామిసింగ్‌గా ఉంటాయి. ఈరోజుల్లో త‌ర‌హాలో నేటి ట్రెండ్‌కు త‌గిన‌ట్లు ఉండే సినిమా. మా గుడ్ సినిమా గ్రూప్‌లో సినిమా విడుద‌ల కానుండ‌టం ఆనందంగా ఉంది. గ‌త నెలలోనే సినిమా విడుద‌లై ఉండాల్సింది. కానీ ఆల‌స్యమైంది. కాబ‌ట్టి వ‌చ్చే నెల చివ‌రి వారంలో సినిమాను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

ఎస్‌.కె.ఎన్ మాట్లాడుతూ ``మ‌హానుభావుడు సినిమా పొల్లాచ్చిలో జ‌రుగుతున్న‌ప్పుడు ద‌గ్గ‌రిలోని ఓ థియేట‌ర్‌లో ఈ సినిమాను చూశాను. చాలా బాగా న‌చ్చింది. వీర్ దే వెడ్డింగ్ త‌ర‌హా ట్రెండ్ ఇప్పుడు న‌డుస్తుంది. అలాంటి కాన్సెప్ట్ మూవీ ఇది. కాబ‌ట్టి తెలుగులో అనువాదం చేసి విడుద‌ల చేద్దామ‌ని జ్ఞాన‌వేల్ రాజాను సంప్ర‌దిస్తే అప్ప‌టికే డి.వెంక‌టేశ్‌గారు హ‌క్కులు ద‌క్కించుకున్నార‌ని తెలిసింది. ఇప్పుడు మా గుడ్ సినిమా గ్రూప్ బ్యాన‌ర్‌లో విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

డి.వెంక‌టేశ్ మాట్లాడుతూ - ``మారుతిగారు తారామ‌ణిని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లారు. త‌మిళంలో సినిమా, పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి. త‌ప్ప‌కుండా తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీకాంత్‌, శ్రేయాస్ శ్రీనివాస్‌, రాజేశ్‌, ర‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved