కాకర్ల, నాని(శ్రీధర్), వినీత్, ప్రేయసి నాయక్, మౌనిక రెడ్డి ప్రధాన తారాగణంగా కాకర్ల రాహుల్, శ్వేత సమర్పణలో శ్రీ శ్రీ శ్రీ లాస్య క్రియేషన్స్ బ్యానర్‌పై జంగాల నాగబాబు దర్శకత్వంలో కాకర్ల నాగమణి నిర్మించిన చిత్రం `వెక్కిరింత`. చంద్రలేఖ, భానుప్రసాద్.జె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ సారథి స్టూడియోలో జరిగింది. ఆడియో సీడీలను సాయి వెంకట్ విడుదల చేసి తొలి సీడీని ఘంటాడి కృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఘంటాడి కృష్ణ, మహిత్ నారాయణ్, ఖుద్దూస్, బల్లేపల్లి మోహన్, సింహాలు హాజరై పాటలను విడుదల చేసిన తర్వాత మాట్లాడుతూ టైటిల్ చాలా బావుంది. వెక్కిరింత అనే టైటిల్‌ను తేలికగా తీసుకోకూడదు. ఈ ఏడాది చిన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అదే దారిలో ఈ సినిమా, ఆడియో పెద్ద హిట్ కావాలని తెలియజేశారు. s
నిర్మాతలు ముగ్గురు మంచి మిత్రులు. వారు త్రిమూర్తులుల్లాగా నాకు అండగా నిలడటంతో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాను. సినిమా బాగా వచ్చింది. మంచి మ్యూజిక్ కుదిరింది. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తున్నట్లు దర్శకుడు జంగాల నాగబాబు తెలిపారు. మంటి టెక్నికల్ టీంతో, యాక్టర్స్ ఈ సినిమాకు పనిచేశారు. అందరూ కొత్తవారైనా అనుభమున్న నటుల్లా నటించి సహకరించారు. ఐదు పాటలు అద్భుతంగా కుదిరాయి. సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నట్లు కాకర్ల వెంకటేశ్వరరావు తెలియజేశారు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు మ్యూజిక్ డైరెక్టర్స్ చంద్రలేఖ, భానుప్రసాద్‌లు థాంక్స్ చెప్పారు. ముఖ్య అతిథిగా హాజరైన సాయి వెంకట్ చిత్రయూనిట్ ను అభినందించి ఈ ఏడాది చిన్న చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్ననని అన్నారు.