06 April 2015
Hyderabad
మెగా అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన అల్లుఅర్జున్,త్రివిక్రమ్ ల 's/o సత్యమూర్తి' ఆడియో సక్సస్‌మీట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 's/o సత్యమూర్తి' ఏప్రిల్ 9న అత్యధిక ధియోటర్స్ లొ విడుదలవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o సత్యమూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.ఇటీవలే మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఆడియో సూపర్‌హిట్ అయ్యింది. ఈ సక్సస్ ని అభిమానులందరితో పంచుకోవటానికి ఏప్రిల్ 6న విజయవాడలో 's/o సత్యమూర్తి' యూనిట్ అందరూ హజరయ్యి గ్రాండ్ గా ఆడియో సక్సస్‌మీట్ ని నిర్వహించారు. మెగాఅభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరూ హజరయ్యి ఈ ఫంక్షన్ ని ఘనవిజయం చేశారు. ఈ ఫంక్షన్ కి స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ ఆదాశర్మ,దర్శకుడు త్రివిక్రమ్,బ్రహ్మనందం,ఆలి,సంపత్ లతో పాటు సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరేళ్ళ, నిర్మాత ఎస్.రాధాకృష్ణ గారు హజరయ్యారు.
విలువలు గురించి చెప్పే చిత్రం 's/o సత్యమూర్తి'- బ్రహ్మనందం
మెదట బ్రహ్మనందం స్టేజి మీదకి వచ్చి గుంటూరు స్లాంగ్ లో మాట్లాడి ప్రేక్షకులని అలరించారు. గుంటూరు సరస్వతి దేవి పుత్రుల నిలయం అని అలాంటి సరస్వతి పుత్రుడు త్రివిక్రమ్ గుంటూరు జిల్లాకు వచ్చారని చేప్పారు. సినిమాకి వెళ్ళిన మనందరిని సమ్మోహితుల్ని చేయటానికి చేసే సామర్థం వున్న అతి తక్కువ మంది అనటం కంటే ఒకే ఒక్కడు త్రివిక్రమ్, మెయాలనిపించే బరువు పిల్లలు..నచ్చి తెచ్చుకునే భాద్యత భార్య..మరిచిపోలేని జ్ఞాపకం నాన్న అన్నాడు. జీవిత సారాంశాన్ని నాలుగు మాటల్లో ఇంతకంటే చెప్పిన వారేవరున్నారు. ఇలాంటి మాటలు చాలా ఈ చిత్రం లో వున్నాయన్నారు. ప్రోడ్యూసర్ చాలా మంచి వారని చెప్పారు. ఇక మనందరం కండరాలతో పుడితే బన్ని స్వింగ్ లతో పుట్టాడని, అతని హర్డువర్క్ అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని చెప్పారు.
ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది- ఆలీ
అత్తారింటికి దారేది తరువాత త్రివిక్రమ్ గారు, రేసుగుర్రం తరువాత బన్ని కలిసి వస్తున్న చిత్రం. వీరిద్దరి కాంబినేషన్ లో నిర్మాత రాదాకృష్ణ గారు కాంబినేషన్ లో చేసిన జులాయి పెద్ద హిట్టయ్యిందో తెలుసు..ఈ సినిమా కూడా దాన్ని మించి విజయం సాధిస్తుంది.
నాన్న బ్రతికున్నప్పుడే మనందరం థ్యాక్స్ చెబుదాం- త్రివిక్రమ్
మనందరి జీవితంలో నాన్న చాలా ఇంపార్టెంట్. ఆయన మనకి హీరో. ఎందుకో నాన్న కంటే అమ్మనే మన కథల్లో చెబుతాం కాని నాన్న గురించి పెద్దగా చెప్పం కాని ఆయన తో జీవితం అంతా నడుస్తాం. ఆయనతోనే బ్రతుకుతాం, ఆయన విలువ తెలిసే సరికి చాలామంది నాన్నలు బ్రతికి వుండరు కాబట్టి నాన్న బ్రతికున్నప్పుడే థాంక్స్ చెబుదాం. ఈచిత్రం సత్యమూర్తి గారు, వారి అబ్బాయి గురించి చెప్పాం. నిర్మాత రాధాకృష్ణ గారు నన్ను పిలిచి ఐటం సాంగ్స్ వున్న కథ కాకుండా మన చుట్టుపక్కల జరిగే కథ తో సినిమా చేద్దాం. ఆ స్టోరి మనందరి స్టోరి అయ్యివుండాలి అన్నారు. అలాంటి కథతొ సినిమా చేశాము. ఆయన మేము అడిగిన ప్రతి దాన్ని ఇచ్చారు. అడగనివి కూడా మాకు ఇచ్చి ఈ సినిమాని గ్రాండ్ గా చిత్రీకరించేందుకు సహకరించారు. దేవిశ్రీప్రసాద్ కి కథ చెబుతాను ఆయన ట్యూన్ ఇస్తాడు. అది తీసుకుని వస్తాను. ప్రేక్షకుల కంటే కొంచెం ముందు వింటాను అంతే. నాకు సంగీతం అంటే ఇష్టం. దేవి ఆడియో చాలా బాగా ఇస్తాడు అందుకే ఆయనతో పనిచేస్తాను. ఈచిత్రానికి సూపర్ మ్యూజిక్ ని అందిచాడు. ఇక నాతో పాటు పరిగేత్తి పనిచేసిన కెమెరామెన్ ప్రసాద్ మూరేళ్ళ , నా హింసని ప్రేమించి పనిచేసిన ఆర్ట్ డైరక్టర్ రవిందర్ అండ్ టీం ఇలా ప్రతి టెక్నషియన్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక బన్ని నాకోసం దాదాపు 6 నెలలు వెయిట్ చేసి స్క్రిప్ట్ బాగా వచ్చేవరకూ ఏమాత్రం కంగారు పడకుండా ఈ సినిమా చేశాడు. బన్ని కి స్పెషల్ థ్యాంక్స్. బ్రహ్మనందం గారు బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు. అలీ ఎంత బిజిగా వున్నా కూడా నాకు ఎప్పుడు డేట్ అడిగితే అప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఇస్తాడు. ఏరోజు కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఈ సినిమాలో సుమారు 60 రోజులు హీరోతో సమానంగా చేశాడు. అలీకి స్పెషన్ గా థ్యాంక్స్ . ఈ సినిమా తప్పకుండా అందరరికి నచ్చుతుంది.'
's/o సత్యమూర్తి' చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది- అల్లు అర్జున్
దేవిశ్రిప్రసాద్ అంటే డి.ఎస్.పి.. కాని నాకు డి.ఎస్.పి అంటే డియర్ స్పెషల్ పర్సన్. నాకు చాలా మంచి ఫ్రెండ్. మంచి సంగీతం ఇచ్చాడు. అంతేకాకుండా నాన్‌స్టాప్ లిరిక్ తో సాగే సూపర్ మచ్చి సాంగ్ తనే లిరిక్స్ రాసాడు. త్రివిక్రమ్ గారి గురించి ఏం చెప్పాలి. మంచి కథ, అంతకుమించిన మాటలు చాలా బాగుంటాయి. టీజర్ లో వస్తున్న డైలాగ్స్ లాంటివి ఈ చిత్రంలో ఇంకా వుంటాయి. అలాగే నిర్మాత చాలా మంచి నిర్మాత కనీసం చిన్న బ్రాండ్ మీద సైన్ లేకుండా సినిమా మీద కొట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన నిర్మాత రాధాకృష్ణ గారు. ఆయనకి ఈసినిమా ద్వారా మంచి పేరు డబ్బులు తీసుకురావాలని కొరుకుంటున్నాను. అలాగే బ్రహ్మనందం గారు, ఆలీగారు , సంపత్ గారు, ఉపేంద్ర గారు, రాజేంద్రప్రసాద్ గారు, స్నేహ, సమంత, ఆదాశర్మ, నిత్యామీనన్ ఇలా చాలా మంది నటీనటులు నటించారు. ఈ సినిమా ఫ్యామిలి అంతా కలిసి చేసే విధంగా వుంటుంది. అందరిని ఆకట్టుకుంటుంది. ఇక్కడకి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి, మెగాపవర్‌స్టార్ చరణ్ అభిమానులకి నా కజిన్స్ సాయిధర్మతేజ్, వరుణ్‌తేజ్ అభిమానులకి నా ధన్యవాదాలు..
ఈ సందర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ " స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ తో మా బ్యానర్లో చిత్రీకరించిన 's/o సత్యమూర్తి' ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుదలవుతుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన పాటలు ఇప్పటికే సూపర్‌హిట్ అయ్యాయి. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. దేవి అందించిన ఆడియోకి తెలుగు ప్రేక్షకులు ఇంతటి బ్రహ్మరథం పట్టినందుకు ఏప్రిల్ 6న విజయవాడలో గ్రాండ్ ఆడియో సక్సస్‌మీట్ ని నిర్వహించాము. అభిమానుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమాలనికి చిత్ర యూనిట్ అంతా హజరయ్యారు.తెలుగు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. 'మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి. కష్టాల్లో వున్నప్పుడు విలువలు మాట్లాడకూడదు' అనే మాటతో విలువలే ఆస్తి అని ఎంతో చక్కగా దర్శకుడు చెప్పారు. అంతకుమించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ మరియు లక్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. నిన్న జరిగిన ఈ ఫంక్షన్ కి వచ్చిన అభిమానులందరికి మా యూనిట్ తరుపున దన్యవాదాలు .అని అన్నారు.
నటీనటులు
అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు
సాంకేతిక వర్గం
పి.ఆర్.వో- ఎస్.కె.ఎన్, ఏలూరుశ్రీను
ఆర్ట్ - రవీందర్
కెమెరా - ప్రసాద్ మూరెళ్ల
మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్
నిర్మాత - రాధాకృష్ణ
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్