కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు తనయుడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ ఈరోజు(మే 20న) తన పుట్టినరోజు వేడుకలను జూబ్లీ హిట్స్ లోని మోహన్ బాబు నివాసంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ ‘’అభిమానులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంది నన్ను విష్ చేయడానికి వచ్చినందుకు అందరికీ థాంక్స్. ఈ ఏడాది నేను మూడు చిత్రాల్లో నటించబోతున్నాను. అందులో సాగర్ ప్రసన్న దర్శకత్వంలో రూపొందనున్న ‘సీతా మహాలక్ష్మి’ (మద్రాస్ ర్యాంబో క్యాప్షన్) చిత్రాన్ని నేనే నిర్మాతగా నిర్మంచబోతున్నాను. చాలా మంచి కథ. ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీని అందిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కె.సత్య దర్శకత్వంలో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మాత ఓ చిత్రం, ఎం.అచ్చిబాబు సమర్పణలో ఎస్.ఎన్.ఆర్.ఫిలింస్ ప్రై.లి., న్యూ ఎంపైర్ సెల్యూలాయిడ్స్బ్యానర్స్ పై ఎస్.ఎన్.రెడ్డి,ఎన్.లక్ష్మీ కాంత్ నిర్మాతలుగా అజయ్ అండ్రూస్ నౌతాక్కి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించబోతున్నాను. ఈ మూడు చిత్రాలు వేటికవే డిఫరెంట్ గా ఉంటూ అన్నీ వర్గాలను ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ ఏడాది సీతామహాలక్ష్మి చిత్రంతో నిర్మాత మారుతున్నాను. నేను సినిమాల్లో ఎంటర్ అయిన తర్వాత మరో కొత్త బాధ్యతను చేపట్టబోతున్నాను. అందరి సపోర్ట్ తో అందరికీ నచ్చేలా సినిమాలు చేస్తానని తెలియజేస్తున్నాను’’ అన్నారు.