pizza
Chiranjeevi congratulates Vijetha team
8 నుండి 80 సంవత్సరాల వయసున్న అందరూ చూడదగ్గ చిత్రం 'విజేత' - మెగాస్టార్‌ చిరంజీవి
You are at idlebrain.com > News > Functions
Follow Us


13 July 2018
Hyderabad

కల్యాణ్‌దేవ్‌, మాళవికా నాయర్‌ నటించిన చిత్రం 'విజేత'. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయికొర్రపాటి నిర్మాణ సారథ్యంలో రజనీ కొర్రపాటి నిర్మాతగా రాకేశ్‌ శశి దర్శకత్వంలో సినిమా రూపొందింది. జూలై 12న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ ''నేను నటించిన 'విజేత' సినిమా టైటిల్‌తో కల్యాణ్‌ నటించిన విజేత ఎలా ఉంటుందో ఎలాంటి రిజల్ట్‌ రాబట్టుకుంటుందోనని క్యూరియాసిటీ ఎక్కువగా ఉన్నది. నేను సినిమా చూశాను. చాలా ఇంప్రెస్‌ అయ్యాను. సినిమా చూసి నన్ను నేనే మరచిపోయాను. నా విజేత సినిమా ఫ్యామిలీ సినిమా. నన్ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర చేసిన చిత్రం. ఈ సినిమా కూడా ఫ్యామిలీ సినిమాయే. కుటుంబ విలువలు. తల్లిదండ్రులు, పిల్లలు, వారి మధ్య నున్న అనుబంధాలు ఎలా ఉండాలి. ఎలాంటి బాధ్యతలు ఉండాలని విడమరిచి చెప్పిన సినిమా ఇది. ఎడ్యుకేటివ్‌ ఫిలిం కూడా. ఎందుకంటే యూత్‌ నేడు వివిధ ఆకర్షణలకు లోనై ఫ్యామిలీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్‌పై ఆందోళన పడటం చూస్తుంటాం. అలాంటి వారందరూ సినిమాను చూడాలని నేను కోరుకుంటున్నాను. డైరెక్టర్‌ శశి తన సినిమాను అద్భుతంగా మలిచాడు. స్లోఫేజ్‌లో స్టార్ట్‌ అయ్యి చివరకు వచ్చేసరికి ఆర్ద్రతగా, హృద్యంగా సినిమా మెప్పించింది. నటీనటుల విషయానికి వస్తే.. నా తొలి మార్కులు మురళీశర్మకే దక్కుతుంది. మధ్య తరగతి తండ్రి పాత్రలో చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా అద్భుతంగా పలికిస్తూ నటించాడు మురళీశర్మ. కుటుంబం కోసం తన లక్ష్యాన్ని త్యాగం చేసే తండ్రి పాత్రలో మురళీశర్మ జీవించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటన అద్భుతం. నిజంగా నటుడికి న్యాయం జరగాలంటే ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అవార్డ్‌ మురళీశర్మగారికే దక్కుతుందని నేను భావిస్తున్నాను. కల్యాణ్‌దేవ్‌.. ఎక్కడా కొత్తదనం, బెరుకు లేకుండా.. తర్ఫీదు పొందిన నటుడిలా పరిణితితో తనదైన స్టయిల్‌లో సెటిల్డ్‌గా నటించాడు. ఎవరినీ అనుకరించకుండా నటించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో, బ్రేక్‌ డౌన్‌ సీన్స్‌లో చక్కగా నటించాడు. భవిష్యత్‌ ఉన్న నటుడిగా ప్రూవ్‌ చేసుకున్నారు. సెంథిల్‌గారు సినిమాకు పెద్ద ఎసెట్‌. ఆయన పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాత సాయి కొర్రపాటిగారు.. కథ అనుకున్న దగ్గర ఉండి ఇన్‌వాల్వ్‌మెంట్‌తో ఎంతో తపనతో సినిమాను నిర్మించారు. క్లైమాక్స్‌ విషయానికి వచ్చేసరికి నాకు విశ్వనాథ్‌గారి సినిమాలు గుర్తుకు వచ్చాయి. ఈసినిమా చూస్తున్నప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. 8 నుండి 80 సంవత్సరాల వయసున్న అందరూ చూడదగ్గ ఆరోగ్యకరమైన చిత్రమిది'' అన్నారు.

మురళీశర్మ మాట్లాడుతూ - ''విజేత సినిమా చూసిన ప్రేక్షకులు ఓ ఎమోషనల్‌తో తడి కళ్లతో బయటకు రావడమే మా సక్సెస్‌. అందరూ చాలా బాగా కనెక్ట్‌ అవుతున్నారు. అందరికీ వారి తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్నారని అంటున్నారు. అందరం బాగానే కష్టపడ్డాం. కల్యాణ్‌ చక్కగా నటించాడు. ఈ సినిమా ఎంటైర్‌ క్రెడిట్‌ రాకేశ్‌ శశిగారికే దక్కుతుంది. నేను నటుడనే సంగతిని మరచిపోయి.. ఇన్‌వాల్వ్‌ అయ్యి నటించాను. ఈ సినిమాను నా తండ్రికి అంకితమిస్తున్నాను. ఆయనే నా హీరో. నా కెరీర్‌లో చాలా ముందుగానే దక్కిన అవకాశమిది'' అన్నారు.

రాకేశ్‌ శశి మాట్లాడుతూ - ''చిరంజీవిగారు ఈ కథను ఒప్పుకున్నందుకు ఆయనకి థాంక్స్‌. ఓ మంచి కథను జెన్యూన్‌గా చెప్పాలనే ఆలోచనతోనే ఈ సినిమా చేశాం. తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్‌ ఎన్ని తరాలు మారినా మారవు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసే సినిమా. అందరికీ వారు చూసిన పాత్రలు ఎక్కడో రిలేట్‌ అవుతుంటాయి. మురళీశర్మగారు, కల్యాణ్‌గారు పాత్రల్లో ఒదిగిపోయారు. సాయి కొర్రపాటిగారు సినిమాకు ఏం కావాలో అది అందించారు'' అన్నారు.

కల్యాణ్‌దేవ్‌ మాట్లాడుతూ ''మా సినిమాను ఇంత బాగా రిసీవ్‌ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కథను ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. ప్రారంభంలోనే ఇంత మంచి కథతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. అన్ని ఏజ్‌ గ్రూపులవారు చూసి ఆనందించే చిత్రమిది. తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించారు రాకేశ్‌ శశిగారు. కథ చెప్పినప్పుడు ఎలా తీస్తారోనని అనుకున్నాను. ఆయన చెప్పిన దానికంటే అద్భుతంగా తీశారు. సెంథిల్‌గారికి, రామకృష్ణగారికి అందరికీ థాంక్స్‌'' అన్నారు.

కె.కె.సెంథిల్‌ కుమార్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సాయిగారు ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. సినిమా చూస్తున్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకు వచ్చారు. నాన్నతో నేను గడిపిన క్షణాలెన్నో నాకు గుర్తుకు వచ్చాయి. ఈ సినిమా కొన్ని రోజుల వరకు మనకు గుర్తుండిపోతుంది. నిజాయతీతో చేసిన ప్రయత్నం. ఈ సినిమా చేయడం ఫ్రౌడ్‌గా ఉంది'' అన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved