pizza
Devadas success meet
‘దేవదాస్‌’ సక్సెస్‌వీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


05 October 2018
Hyderabad

'DevaDas' starring Nagarjuna Akkineni and Nani in the lead roles, has entered second week and is running successfully at the box office.

On this note, hero Nagarjuna has talked to the media and speaking he said, "Wasn't here when 'DevaDas' released. Spent a holiday with family for a week. Coming to the movie, glad that it grossed Rs 41 crore in just a week and the second week is going to be good as well. Thanks to Nani and he performed extraordinarily as Dr. Das. Now he is on a vacation and hope he is having fun. Director Sriram Adittya has a great future and producer Ashwini Dutt's passion for films is just the same when I worked with him for 'Aakari Poratam.' Recently Vyjayathi Movies banner has completed 45 years and now Dutt garu has his daughters as pillars of support. Also thanks to our cinematographer, Sham for his outstanding work. He showed me stylishly in the role of Deva. To the heroines, music composer Mani Sharma garu and to the entire team. Last but not least thanks to the media. September and October months have been great for me and my family. Still can't believe 'Shiva' has completed 29 years and my one more film 'Ninne Pelladutha' was a sensational hit then. It collected Rs 1 crore from Devi theatre and created a record."

Producer Ashwini Dutt said, "Really proud of 'DEVADAS' success. Thanks to my hero Nagarjuna garu who featured in most films under my banner. TFI icons NTR and ANR who did maximum multi starrer films and Nagarjuna garu is setting a new trend. Special thanks to the people of Karnataka as DevaDas has reported Rs 2.37 crore share. He praised Nani and director Sriram Adittya for their outstanding work."

Director Sriram Adittya said he is getting a lot of compliments for Nagarjuna fans and thanks to Nag sir, Nani, producer Ashwini Dutt and lastly to the audience.

‘దేవదాస్‌’ సక్సెస్‌వీట్‌

నాగార్జున, నాని కలిసి నటించిన ‘దేవదాస్‌’ ఇటీవల విడుదలైంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై రూపొందిన చిత్రమిది. అశ్వినీదత చలసాని నిర్మాత. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో నాని మాట్లాడిన వీడియో ప్రదర్శించారు. అందులో

నాని మాట్లాడుతూ ‘‘మా ‘దేవదాస్‌’ రిలీజయ్యాక ఒకసారి నాగ్‌సార్‌తో మాట్లాడుతూ ‘త్వరగా వచ్చేయండి సార్‌ సెలబ్రేట్‌ చేసుకుందాం’ అని అన్నాను. ఇప్పుడు ఆయన వచ్చి సెలబ్రేట్‌ చేస్తున్నారు. నేను అక్కడ లేను. ఇంకో వారం తర్వాత నేను వచ్చినప్పుడు కూడా ప్రేక్షకులు సినిమాను ఇలాగే ఆదరిస్తుంటారని నమ్ముతున్నాను. ప్రేక్షకులకు సినిమా చాలా బాగా నచ్చింది. వాళ్లకు కృతజ్ఞతలు. గత నాలుగు నెలలుగా నేను చాలా ఎక్కువగా కనిపిస్తున్నాను. ఇప్పుడే అందరూ దేవదాస్‌లో చూసేయండి. లేదంటే మళ్లీ ఇప్పుడప్పుడే కనిపించను. ప్రామిస్‌’’ అని అన్నారు.

అశ్వినీదత చలసాని మాట్లాడుతూ ‘‘మా సినిమాను సక్సెస్‌ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్‌, మా సంస్థలో ఎక్కువ సినిమాలు చేసిన హీరో నాగార్ఝున. ఈ సినిమా విజయంలో ఆయనతో పాటు నానికి భాగం ఉంది. సెప్టెంబర్‌ 27, 28, 29, 30.. మా విజయ పరంపరలో మా సినిమా కూడా ఒకటి ఉంది. ఈ ఏడాది ఆయనతో విజయం సాధించడం ఆనందంగా ఉంది. అత్యధిక మల్టీస్టారర్స్‌ నటించిన ఘనత నందమూరి రామారావుగారిది, అక్కినేని నాగేశ్వరరావుగారిది. 16సినిమాలు వారిద్దరు కలిసి నటిస్తే, 2,3, తప్ప మిగిలినవన్నీ సూపర్‌డూపర్‌ హిట్స్‌. ఆ తరం, నేటి తరం, రేపటి తరం మాట్లాడుకునే సినిమాలు చాలా ఉన్నాయి. గుండమ్మగారి కథ నుంచి చాలా ఉన్నాయి. వారిద్దరు చేసిన మల్టీస్టారర్ల సంఖ్య ప్రపంచ రికార్డ్‌ అని భావిస్తున్నాం. నేను చిన్నప్పటి నుంచీ హీరోలను ఆరాధించాను. హీరోల వెంటే నడిచాం. వాళ్లిచ్చిన విజయాలతో మా సంస్థ విజయ బావుటా ఎగరవేసింది. హీరోలను అభిమానించే నిర్మాతగా.. తెలుగులో నేనే ఎక్కువ మల్టీస్టారర్లను నిర్మించిన నిర్మాతను అని అనుకుంటున్నాను. నాగేశ్వరరావుగారి ‘దేవదాస్‌’ పేరును పెట్టుకున్నందుకు ఈ సినిమా కూడా పెద్ద విజయవంతమైనందుకు తెలుగు సోదరీసోదరులకు ధన్యవాదాలు. కర్ణాటకలో తొలిసారి 7 రోజుల్లో రూ.2కోట్ల 37 లక్షల షేర్‌ వచ్చింది. ఇది చాలా మంచి రికార్డ్‌. నాగార్జునగారు 29 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారని అందరూ అంటున్నారు. నాని కామెడీ బాగా చేశారని అంటున్నారు. అవి రెండే పేయింగ్‌ పాయింట్స్‌ అయ్యాయి ’’ అని అన్నారు.

శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ ‘‘అందరికీ చాలా థాంక్స్‌. నిర్మాత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాగార్జునగారికి, నానికి ధన్యవాదాలు. ఈ సినిమాకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ అన్నీ నాగార్జునగారి అభిమానుల నుంచే వచ్చాయి. నేను దేవి థియేటర్లో సినిమా చూస్తుంటే నాకు తెరపై నాగార్జునగారు కనిపించలేదు. ప్రేక్షకులు అంతలా సినిమాను సెలబ్రేట్‌ చేశారు. అలా సినిమా చూసి చాన్నాళ్లయింది. అందరూ ఎంజాయ్‌ చేస్తున్న విధానం చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇప్పటికి ఆరేడు షోలు చూశాను. సింగిల్‌ స్ర్కీన్‌లలో ఆడియన్స్‌ అరిచి ఎంజాయ్‌ చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఏడుస్తున్నారు. అది చూస్తే ఆనందంగా అనిపించింది’’ అని అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ ‘‘మా ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లి చాన్నాళ్లయింది. చాలా సరదాగా గడిచింది. మాలో అందరికీ వ్యక్తిగతంగా చాలా హ్యాపీగా ఉంది. దత్తుగారు ఈ సినిమాకు వచ్చిన ఫిగర్స్‌ చెబితే ఆనందంగా అనిపించింది. 7 రోజులకు 41 కోట్ల గ్రాస్‌ చేసిందని చెబితే చాలా ఆనందంగా అనిపించింది. రేపు శనివారం, ఆదివారం ఉన్నాయి. ఈ సినిమా ఫ్యామిలీస్‌ అందరూ చూడాల్సిన సినిమా. చక్కగా నవ్వవతూ చూడొచ్చు. వినాయకచవితి, దసరా పండుగ మధ్య వచ్చే సరదా పండుగ దేవదాస్‌. నాని దానికి ముఖ్య కారణం. ఇప్పుడు నాని నాలాగే హాలిడేస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. చాలా రోజులు కనిపించను అని అన్నాడు నాని. అలా అనకూడదు. తను కనిపిస్తానే ఉండాలి. దాస్‌ పాత్రలో చాలా బాగా చేశాడు. నాని కాకుండా దాస్‌గా మారిపోయి సినిమాలో చేశాడు. మల్టీస్టారర్‌ అంటే ఎవరి రోల్స్‌ ఎక్కువ అని ఆలోచిస్తే సినిమా చెడిపోతుంది. మేమిద్దరం వాటి గురించి షూటింగ్‌ కన్నా ముందే అనుకున్నాం. సినిమా బావుండాలని అనుకున్నాం. ఏ రోజూ ఇబ్బంది లేకుండా సినిమా సాగింది. ప్రతి రోజూ నవ్వుకుంటూ చేశాం. అందుకే మా కెమిసీ్ట్రని బ్రొమాన్స్‌ అంటున్నారు, ఫ్రెండ్‌షిప్‌ అని పొగుడుతున్నారు. శ్రీరామ్‌ ఆదిత్యకు చాలా మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. నన్ను, నానిని అతను చాలా బాగా డీల్‌ చేశాడు. ఫ్యాన్స్‌ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే. అశ్వినీదతగారు ఏడాదిన్నర క్రితం ఈ కథను నాకు, నానికి చెప్పారు. ఎలా చేయాలనుకుంటే ఫైనల్‌గా శ్రీరామ్‌ ఆదిత్య చేతిలో పడింది. ‘ఆఖరి పోరాటం’ జరుగుతున్నప్పుడు సినిమా గురించి, దాని భారీ స్థాయిని గురించి ఆయన ఎలా మాట్లాడేవారో, ఈ సినిమా సమయంలో కూడా అంతే ప్యాషన్‌తో చేశారు. ఆ ప్యాషన్‌ ఉంది కాబట్టే మొన్న మహానటి వచ్చింది. ఇప్పుడు దేవదాస్‌ మంచి ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో, మంచి కమర్షియల్‌ సినిమా వచ్చింది ఆయనకు. ఈ సినిమా మొదలుపెట్టడానికి ముందు అశ్వినీదతగారు కమ్‌బ్యాక్‌ సినిమా అని అన్నారు. ఆయనకు కమ్‌బ్యాక్‌ సినిమా ఏం ఉంటుంది? ఆయన చిన్న గ్యాప్‌ తీసుకున్నారంతే. వైజయంతీ సినిమా జెండా ఎగురుతూనే ఉంటుంది. రామారావుగారు శంఖం మోగిస్తూనే ఉంటారు. ఆయన కూతుళ్లిద్దరూ బంగారాలు. ఈ మధ్యనే 45 ఏళ్లను పూర్తి చేసుకుంది సంస్థ. ఇంకో 100 ఏళ్లు సాగుతుంది. నేను, నాని ఈ సినిమా స్ర్కిప్ట్‌ గురించి ఏమైతే అనుకున్నామో.. అదే థియేటర్లో జరుగుతోంది. ప్రేక్షకులు మా ినిఇమాను ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నన్ను స్టైలిష్‌గా డాన్‌ దేవా రోల్‌లో చూశారు. అందుకు ధన్యవాదాలు. చాలా మంచి కాంప్లిమెంట్స్‌ రావడం చూస్తే, ఇలాంటి రోల్స్‌ చాలా చేయొచ్చు అని కాన్ఫిడెన్స్‌ వచ్చింది. మా కెమెరామేన్‌ శ్యామ్‌దత చాలా బాగా చేశారు. మణిశర్మగారి సంగీతం పెద్ద హిట్‌ అయింది. సెప్టెంబర్‌ నుంచి మొదలైంది. అక్టోబర్‌ నాకు చాలా ఇష్టం. శివ వచ్చి అప్పుడే 29 ఏళ్లయిందా అని అనిపించింది ఇవాళ పొద్దున. వర్మకు థాంక్స్‌ చెప్పాలి. నిన్నే పెళ్లాడతా చాలా రికార్డులు కలెక్ట్‌ చేసింది. దేవిలో రూ.కోటి గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన తొలి సినిమా అనుకుంటా ‘నిన్నే పెళ్లాడతా’. శివప్రసాద్‌రెడ్డిగారి ‘అల్లరి అల్లుడు’ నన్ను మాస్‌లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ‘దేవదాస్‌’ కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఈ వీకెండ్‌లో పిల్లాపాపలను అందరినీ తీసుకెళ్లి ‘దేవదాస్‌’ చూడండి.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved