pizza
Charu Seela First Look Launch
'
చారుశీలలోగోఫస్ట్ లుక్ లాంచ్
ou are at idlebrain.com > News > Functions
Follow Us

13 April 2016
Hyderabad

జోత్స్న ఫిలిమ్స్ పతాకంపై వి.శ్రీనివాసరెడ్డిని దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు వి.సాగర్శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చారుశీల'. బ్రహ్మానందంరేష్మిరాజీవ్ కనకాలజశ్వంత్ ముఖ్య తారాగణం. బుధవారం ఈ సినిమా లోగోఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఫిల్మ్ చాంబర్ లో జరిగింది. దర్శకులు భీమనేని శ్రీనివాసరావు టైటిల్ లోగో ఆవిష్కరించారు. జి.నాగేశ్వరరెడ్డిఎ.ఎస్.రవికుమార్ చౌదరిలు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా..         

భీమనేని శ్రీనివాసరరావు మాట్లాడుతూ.. "సినిమా ఇండస్ట్రీని నమ్ముకునిఇండస్ట్రీకి అంకితమైన కుటుంబం సాగర్ గారి కుటుంబం. ఆయన అన్నదమ్ములు అందరూ ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో ఉన్నారు. దర్శకుడిగాఅసోసియేషన్ ప్రెసిడెంట్ గా.. అందరి తలలో నాలుకలాఅందరి సమస్యలు పరిష్కరించే సాగర్ గారు ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. మంచి సినిమా తీశారు. లోగో స్టైలిష్ గా ఉంది. హీరోగా పరిచయం అవుతున్న జశ్వంత్ ను మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. రాజీవ్ కనకాలరేష్మి నటిస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలి" అని అన్నారు.        

జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. "సాగర్ గారు కోట్లు సంపాదించలేదు. కానీకోట్లు సంపాదించే శిష్యులను (దర్శకులు) ఇండస్ట్రీకి అందించారు. ఈ సినిమాతో కోట్లు సంపాదించాలని కోరుకుంటున్నాను. మంచి సినిమాతో తమ్ముడ్ని దర్శకుడిగాతమ్ముడి కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి నిర్మాతే ముఖ్యం. ఇటువంటి నిర్మాతలు ఇంకా రావాలి" అని అన్నారు. 

ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి మాట్లాడుతూ.. "నాతో పాటు శ్రీనువైట్లవి.వి.వినాయక్ సాగర్ గారి శిష్యులమే. సాగర్ గారంటే మాకు ఎంతో వినయంభక్తిగౌరవం. అనివార్య కారణాల వలన వినాయక్శ్రీనువైట్ల ఇక్కడికి రాలేకపోయారు. వారి విషెస్ తెలపమన్నారు. వంద సినిమాలకు చేరువైన సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ వుయ్యూరు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. మేమంతా ఆయన కెమెరా ముందు క్లాప్ కొట్టినవాళ్ళమే. మా ఇష్టజీవి సాగర్కష్టజీవి శ్రీనివాస్ గార్లు ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలి" అని అన్నారు.      

దర్శకుడు శ్రీనివాస్ వుయ్యూరు మాట్లాడుతూ.. "థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నాను. సినిమాటోగ్రాఫర్ గా 100 సినిమాలు పూర్తయిన తర్వాత చేయాలనుకున్నాను. మా అన్నయ్య సాగర్ గారికి లైన్ చెప్పగామనమే ప్రొడ్యూస్ చేద్దామన్నారు. వీల్ చైర్ లో కూర్చునే పాత్రలో రాజీవ్ కనకాల నటిస్తాడాలేదాఅని భయపడ్డానుఒప్పుకున్నాడు. అద్బుతంగా నటించాడురాజీవ్ కనకాలరేష్మిలకు అవార్డులు వస్తాయి. మా అబ్బాయి ఓ క్యారెక్టర్ చేశాడు. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం" అని అన్నారు.  

రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. "పోస్టర్ ఎంత సైలెంట్ గా ఉందోసినిమా అంత వైలెంట్ గా ఉంటుంది. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అయ్యే గొప్ప సినిమా ఇది" అని అన్నారు.  

చిత్ర సమర్పకులు కొండపల్లి మాట్లాడుతూ.. "మంచి థ్రిల్లర్ కామెడీ సినిమా ఇది. సినిమాటోగ్రాఫర్ గా 99 సినిమాలు పూర్తిచేసిన శ్రీనివాస్ రెడ్డి గారు దర్శకుడిగా మంచి సినిమా తీశారు" అని అన్నారు.  

ఈ కార్యక్రమంలో 'డైమండ్రత్నంమ్యూజిక్ డైరెక్టర్ సుమన్ జూపూడిజబర్దస్త్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.  

బెనర్జీమెల్కోటేరాకెట్ రాఘవగెటప్ శీనుజబర్దస్త్ అప్పారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు : కుమార్ మల్లారపుఎడిటింగ్ : వి.నాగిరెడ్డిసంగీతం : సుమన్ జూపూడిఆర్ట్ : బాబ్జీనిర్మాతలు : వి.సాగర్ & శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావుకథ - స్క్రీన్ ప్లే - సినిమాటోగ్రఫీ - దర్శకత్వం :శ్రీనివాస్ రెడ్డి వుయ్యూరు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved