pizza
'Rowdy' boy Vijay Deverakonda unveils the First Look of 'Bad boy' Manoj Nandam in 'OGF'
'ఒ.జి.య‌ఫ్‌'లో బ్యాడ్‌బాయ్ మ‌నోజ్ నందం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన రౌడీబాయ్‌ విజయ్ దేవరకొండ
You are at idlebrain.com > News > Functions
Follow Us


29 March 2019
Hyderabad

Manoj Nandam was a popular child artist who played Mahesh Babu's younger version in 'Athadu' and Prabhas' younger version in 'Chatrapathi'. As a male lead, he impressed the audience in 'Oka Romantic Crime Katha'. For the first time, this talented actor is playing a negative role. That's in 'Operation Gold Fish', in which director Saikiran Adivi is also introducing writer Abburi Ravi as an antagonist.

Manoj's First Look in the movie has been unveiled by Vijay Deverakonda.

Vijay Deverakonda says, "I am happy that I have released Manoj's Farooq Iqbal Iraqi's look. I have watched him ever since the days of 'Athadu'. I had done an audition for 'Kerintha' movie with Saikiran Adivi garu. Unfortunately, I didn't get a chance in that movie. I have always watched his movies. We all come from Sekhar Kammula garu's team. Coming to 'OGF', I have loved Abburi Ravi garu's look as well. I wish Aadi Saikumar, Airtel 4G girl Sasha and others all the best. I wish that 'OGF' becomes a huge hit."

Saikiran Adivi said, "I thank Vijay Deverakonda for releasing the FL despite him being busy with his work. He spared time for us. I couldn't cast him in 'Kerintha'. Despite that, he has come today to help me. I thank him once again."

Manoj Nandam said, "My wish is that I am endeared to the youth audience with this First Look. I am playing the role of a young terrorist in the movie. I apologize for having played an anti-India character. As an actor, I see every character equally. We went to Vijay Deverakonda anna's film set to request him to unveil this look. Since I am playing a bad guy's role in the movie, we felt the 'Rowdy' star alone should release it. I hope the audience will accept me in the villain's role. When I had my doubts as to whether I can pull off such a role, the director trusted me. I thank him for that."

Adivi Sai Kiran has done the sensible 'Vinayakudu', 'Village Lo Vinayakudu' and 'Kerintha' in the past. Produced on Vinayakudu Talkies, 'OGF' is based on true incidents around which an imaginary story has been weaved. Aadi Saikumar is playing the role of NSG commando Arjun Pandit. Airtel 4G model Sasha Chettri, Karthik Raju, Parvateesham, Nithya Naresh, Manoj Nandam, Krishnudu, Anish Kuruvilla, Rao Ramesh and Ramajogayya Sastry are playing key roles.

Music is by Sricharan Pakala of 'Kshanam', 'PSV Garuda Vega' and 'Goodachari' fame. Cinematography is by Jaipal Reddy. Editing is by BH Garry. Action choreography is by Ramakrishna, Subbu Robin and Nabha. Lyrics are by Ramajogayya Sastry. Art direction is by Moorthy. Script Designing is by Abburi Ravi. Story, screenplay and direction are by Adivi Sai Kiran.

Produced by Pratibha Adivi, Katta Asish Reddy, Keshav Uma Swaroop, Padmanabha Reddy, Garry BH, Satish Degala, the film's other artists and technicians. Co-producers are Damodar Yadav (Vizag), and Executive Producer is Kiran Reddy Tumma.

'ఒ.జి.య‌ఫ్‌'లో బ్యాడ్‌బాయ్ మ‌నోజ్ నందం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన రౌడీబాయ్‌ విజయ్ దేవరకొండ

'అతడు'లో కథానాయకుడి చిన్నప్పటి పాత్రలో జూనియర్ మహేష్ బాబుగా, 'ఛత్రపతి'లో జూనియర్ ప్ర‌భాస్‌గా మెప్పించారు మనోజ్ నందం. బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' చిత్రంలో కథానాయకుడిగానూ ఆకట్టుకున్నారు. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తర్వాత పలు చిత్రాలు చేశారు. ఇప్పుడు తొలిసారి ప్రతినాయకుడిగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రచయిత అబ్బూరి రవిని ప్రతినాయకుడిగా పరిచయం చేస్తున్న సాయికిరణ్ అడివి... మనోజ్ నందాన్నీ ప్రతినాయకుడిగా పరిచయం చేస్తున్నారు.

'వినాయకుడు', 'విలేజ్ లో వినాయకుడు', 'కేరింత' వంటి సెన్సిబుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. వినాయ‌కుడు టాకీస్ పతాకంపై వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా క‌ల్పిత కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ఎన్‌.ఎస్‌.జి క‌మాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది సాయికుమార్‌, టెర్రరిస్ట్ 'ఘాజీ బాబా' పాత్రలో అబ్బూరి రవి నటించారు. యంగ్ టెర్రరిస్ట్ 'ఫరూక్ ఇక్బాల్ ఇరాఖీ' పాత్రలో మనోజ్ నందం నటించారు. అతని ఫస్ట్ లుక్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ విడుదల చేశారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ "ఫరూఖ్ ఇక్బాల్ ఇరాఖీగా మనోజ్ నందం లుక్‌ను నేను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. నా చిన్నప్పుడు జూనియర్ మహేష్ బాబుగా మనోజ్ నందం నటించాడు. అప్పటి నుంచి అతడి సినిమాలు చూస్తున్నా. సాయికిరణ్ అడివి గారిని నేను ముందే కలిశాను. 'కేరింత' సినిమా కోసం నేను ఆడిషన్ కూడా ఇచ్చాను. దురదృష్టవశాతూ అప్పుడు నాకు అవకాశం రాలేదు. ఆయన సినిమాలు నేను చూస్తుంటాను. మేమంతా శేఖర్ కమ్ములగారి టీమ్ నుంచి వచ్చాము. మ‌నోజ్ నందం లుక్‌తో పాటు ఈ సినిమాలో అబ్బూరి ర‌వి లుక్ కూడా నాకు న‌చ్చింది. ఆది సాయికుమార్, అబ్బూరి రవిగారు, ఎయిర్‌టెల్‌ 4జీ గాళ్ శషాకి, అలాగే టీమ్ అందరికీ, ముఖ్యంగా సాయికిరణ్ అడివిగారికి నా బెస్ట్ విషెస్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా" అన్నారు.

సాయికిరణ్ అడివి మాట్లాడుతూ "విజయ్ దేవరకొండకు చాలా చాలా థాంక్స్. తను బిజీగా ఉన్నప్పటికీ మేం అడిగిన వెంటనే లుక్ విడుదల చేయడానికి అంగీకరించాడు. టైమ్‌లో కూడా మాకు టైమ్ ఇచ్చాడు. 'కేరింత'లో నేను తనకు ఏం చేయలేకపోయా. కానీ, తను మాకు హెల్ప్ చేశాడు. విజయ్ దేవరకొండకు మరోసారి థాంక్యూ" అన్నారు.

మనోజ్ నందం మాట్లాడుతూ "ఫస్ట్ టైమ్ నేను విల‌న్‌గా న‌టించాను... ఈ 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'లో. నా ఫస్ట్ లుక్ యువ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఆశించాను. ఎందుకంటే... ఈ సినిమాలో ఒక యంగ్ టెర్రరిస్ట్ పాత్రలో నటించాను. ఇండియాకు వ్యతిరేకంగా నడుచుకునే పాత్ర చేసినందుకు సారీ. నటుడిగా అన్ని పాత్రలను ఒకేలా చూడాలని ఈ పాత్ర చేశా. ఈ లుక్ విడుదల చేయవలసిందిగా లొకేషన్ కు వెళ్లి విజయ్ దేవరకొండ అన్నను అడిగాను. ఫ‌స్ట్‌టైమ్ బ్యాడ్‌బాయ్‌గా చేశా. ఒక రౌడీ బాయ్ ఈ లుక్ లాంచ్ చేస్తే బావుంటుందనుకున్నా. మా విన్నపాన్ని మన్నించి లుక్ విడుదల చేసిన విజయ్ దేవరకొండకు థాంక్స్. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'లో విల‌న్‌గా ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ సందర్భంగా నేను సాయికిరణ్ అడివిగారికి కూడా థాంక్స్ చెప్పాలి. 'నేను నెగిటివ్ పాత్రలో చేయగలుగుతానా? లేదా?' అనుకున్న సమయంలో సాయికిరణ్ అడివిగారు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు" అన్నారు.

'ఎయిర్ టెల్' మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. ఓ సినిమాలో ప‌నిచేసే యూనిట్ స‌భ్యులంద‌రూ క‌లిసి ఓ సినిమా నిర్మాణంలో భాగ‌మ‌వ‌డం ఇదే తొలిసారి.

బ్యాన‌ర్‌: వినాయ‌కుడు టాకీస్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: కీర్తి
ఫైట్స్‌: రామ‌కృష్ణ‌, సుబ్బు-న‌భా
సాహిత్యం: రామ‌జోగ‌య్య‌శాస్త్రి
ఎడిట‌ర్‌: గ్యారీ .బిహెచ్‌
సినిమాటోగ్ర‌ఫీ: జైపాల్ రెడ్డి నిమ్మ‌ల‌
స్క్రిప్ట్ డిజైన్‌: అబ్బూరి ర‌వి
పి.ఆర్.ఓ: నాయుడు - ఫణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిర‌ణ్ రెడ్డి తుమ్మ‌
కో ప్రొడ్యూస‌ర్‌: దామోద‌ర్ యాద‌వ్‌(వైజాగ్‌)
నిర్మాత‌లు: ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్‌, సతీష్ డేగల, మిగతా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు
ద‌ర్శ‌క‌త్వం: సాయికిర‌ణ్ అడివి


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved