13 February 2016
Hyderabad
ప్రతి సంవత్సరం దుబాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గామా ఆన్యువల్ టాలివుడ్ మ్యూజిక్ అవార్డ్స్ 3వ సంవత్సరంలో మరింత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించింది గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్.
దుబాయి జబీల్ పార్క్ లో అత్యంత వైభవంగా జరిగిన ఈ గామా అవార్డ్స్ కార్యక్రమంలో బాహుబలి చిత్రం బెస్ట్ మూవీ ఆఫ్ ది యియర్ అవార్డ్ అందుకుంది. ఈ అవార్డ్ అందుకోవడానికి బాహుబలి ప్రభాస్, రాణా, తమన్నా, నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ స్వయంగా విచ్చేసి రెబల్ స్టార్ కృష్ణం రాజు, స్థానికి షేక్ ల నుండి గా మా మూవీ ఆఫ్ ద యియర్ ట్రోఫీని అందుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, మొడటగా ఈ చిత్రం గురించి, రాజమౌళి గురించి 15 రోజులు మాట్లాడాలి, అంత టైం లేదు కాబట్టి, నేను ఎప్పట్నుంచో చెప్దామనుకుంటున్న విషయం దుబాయి తెలుగు వారి ముందు చెప్తున్నాను. మొట్టమొదట బాహుబలి కధ విని అందరం రాజమౌళి తో కూచుని ,బాహుబలి ఒకటే పార్ట్ అనుకున్న్నాం. కధ మొత్తం నెరేషన్ అయి పేపర్ మీదకి లెక్కలేసినాక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది కమర్షియల్ గా వర్క్ అవుట్ అవదని రాజమౌళి యే ప్ర్రొడ్యూసర్లకి చెప్పేసి.... ప్రభాస్ తో బాక్సింగ్ బాక్ డ్రాప్తో ఒక సినిమా చేద్దామని చెప్పేసారు. నిర్మాతలు ప్రభాస్ సంగతేంటి అంటే ...అతను నా బెస్ట్ ఫ్రెండ్ నేను చూసుకుంటానని రాజమౌళీ చెప్పారు. కాని సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న శోభు యార్లగడ్డ - దేవినేని ప్రసాద్ లు ఎంత ఖర్చైనా ఫరవాలేదు మేము సప్పోర్ట్ చేస్తాం స్టాటిస్టిక్స్ చూసుకోవద్దు రాజమౌళి గారు మీరు నుంచోండి మేమున్నాం అంటూ ప్రాణం పోసిన నిర్మాతలు ..శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. వాళ్ళని ఇంత రిస్క్ తీసుకున్నందుకు ఎంతైనా అభినందించాలి. నేను ఎప్పట్నుంచో ఈ విషయం చెప్దామనుకున్నా. కానీ అవకాశం రాలేదు..వచ్చినా నేను ఎక్కువ మాట్లాడను.. అయాం సో థాంక్ ఫుల్.. టు దిస్ ప్రొడ్యూసర్స్.... అన్నారు
విభిన్న పాత్రలతో, రౌద్ర రసానికి ప్రతిరూపంగా ఉండే పాత్రలు, పౌరుషం ఉట్టిపడే పాత్రలలో నటించడమే కాక, నిర్మాతగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు లైఫ్ టైం అచీవ్ మెంట్ గామా అవార్డ్ అందుకుని తన ప్రతిస్పందన తెలియజేస్తూ.. మా రోజుల్లో నిర్మాతలకిచ్చే గౌరవం వేరు. నిర్మాత బతికితేనే సినిమాలో 24 క్రాఫ్ట్స్ కి పని దొరుకుతుంది. అటువంటి నిర్మాత ఇప్పుడెక్కడున్నాడు. ఇప్పుడు నిర్మాత పరిస్థితి ఏంటి .అనుకుంటున్న తరుణం లో నిర్మాతలంటే మేము, అంటూ వందేళ్ళ తెలుగు సినీ చరిత్ర మొత్తాన్ని ఒక్క సారి ప్రపంచ వ్యాప్తంగా బట్టబయలు చేసి హాలివుడ్ కి ఏమాత్రం తగ్గకుండా.. అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం..బాహుబలి. ఎప్పుడు హాలివుడ్ సినిమా చూసినా.. సినిమా అంటే ఇది...ఇలాంటి సినిమాలు తెలుగు వస్తే బాగుణ్ణు అనుకుంటున్న తరుణం లో హాలివుడ్ కి ధీటుగా తెలుగు సినిమా స్థాయిని పెంచాడు రాజమౌళి. ప్రభాస్ ఆమధ్య నాతో మాట్లాడుతూ... పెద పాజి మీరు ఇండస్ట్రీకొచ్చి 50 యేళ్ళైంది...నేను అతి త్వరలో 50 యేళ్ళ పండగ అద్భుతం గా చేస్తా...... అన్నాడు. అలా అనుకోగానే ..ఇలా గామా అవార్డ్స్ లో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ అని అనౌన్స్ చేసారు. నా యాభై యేళ్ళ నట జీవితానికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఇలా దుబాయి లో మొదలవడం చాలా సంతోషంగా ఉంది.
దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ... గామా కి సంబంధించి హాట్రిక్ మ్యూజిక్ డైరెక్టర్ నేను. ఎందుకో నాకు దుబాయి వచ్చిన ప్రతి సారి నాకు పాజిటివ్ గా అనిపిస్తుంది. నేను వరసగా 3 సంవత్సరాలు ఈ గామా అవార్డ్ డిఫ్ఫరెంట్ కాటగిరీస్ లో అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది .,ముఖ్యంగా నా ఈ అవార్డ్ ని మా నాన్న తో పాటు అనూప్ గారి మదర్ కి కూడ అంకితమిస్తున్నాను. ఎందుకంటే వారం వ్యవధిలోనే మా ఇద్దరి మైన్ స్ట్రెంత్ ఐన మానాన్న అనూప్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోవడం అన్న బాధ ఎవరూ తీర్చలేనిది. ఇద్దరం ఒకే విధమైన విచారం లో ఉన్నాం. అందుకని వాళ్ళిద్దరికీ అంకితమిస్తున్నాను అన్నారు. హాట్రిక్ సాధించిన సందర్భంగా సూపర్ మచ్చి పాటని సూపర్ గామా అంటూ పాట పాడి ఆడియన్స్ తో అల్లరి చేసాడు దేవి శ్రీ ప్రసాద్, అంతే కాదు కార్యక్రమం లో తమన్నతో స్టెప్స్ వేసి అలరించడమే కాకుండా.. మంచు లక్ష్మి బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డ్ తీసుకుంటుంటే కృష్ణం రాజు గారితో విజిల్స్ వేయించి సందడి చేసాడు దేవి శ్రీ ప్రసాద్...
గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే :
క్యాటగిరీ ఆఫ్ అవార్డ్స్ :
గామా బెస్ట్ మూవీ ఆఫ్ ద యియర్ - బాహుబలి
గామా లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ - రెబల్ స్టార్ కృష్ణం రాజు
బెస్ట్ ఫిమేల్ సింగర్ : రమ్య బెహరా - ధీవర - బాహుబలి
బెస్ట్ సెలబ్రిటీ సింగర్ - లక్ష్మి మంచు - ఏందిరో ఈ మగాళ్ల గొప్ప - దొంగాట
బెస్ట్ టైటిల్ సాంగ్ : రామజోగయ్య శాస్త్రి - శ్రీమంతుడు
బెస్ట్ లిరిసిస్ట్ : సిరివెన్నెల సీతారామ శాస్త్రి - కంచె - విద్వేషం
బెస్ట్ లవ్ సాంగ్ - ఎస్ ఎస్ తమన్ & జోనిత గాంధి - కిక్ 2 - నువ్వే నువ్వే
బెస్ట్ డ్యూయెట్ సాంగ్ - కార్తిక్ - దామిని - పచ్చబొట్టేసిన - బాహుబలి
బెస్ట్ అప్ కమింగ్ సింగర్ - స్ఫూర్తి - కిక్ 2 - కిక్
బెస్ట్ కమర్షియల్ సాంగ్ - దేవిశ్రీ ప్రసాద్ & శ్రావణ భార్గవి- సూపర్ మచ్చి - S/o సత్యమూర్తి
బెస్ట్ పోయెటిక్ వాల్యూ సాంగ్ - శ్రీమణి - బెంగాల్ టైగర్ - చూపులతో
బెస్ట్ మ్యూజికల్ సాంగ్ - గోపి సుందర్ & రేణుక అరుణ్ - ఎందరో మహానుభావులు - భలే భలే మొగాడివోయ్
బెస్ట్ అప్ కమింగ్ లిరిసిస్ట్ - రామాంజనేయులు - కుమారి 21F - లవ్ చేయాలా వద్దా
బెస్ట్ అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ - బీంస్ శశిరోలియో - బెంగాల్ టైగర్
బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ - అనూప్ రుబెన్స్ - గోపాల గోపాల - బ్రహ్మాల
స్పెషల్ జ్యూరీ అవార్డ్ - చంద్రబోస్ - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ - తెలుగంటే
బెస్ట్ అప్ కమింగ్ సింగర్ మేల్ - యాజీన్ నిజార్ - శ్రీమంతుడు - చారు శీల & S/0 సత్యమూర్తి - సీతాకాలం