pizza

Karthikeya 100 crores celebrations
వందకోట్ల వసూళ్ల సంబరంలో కార్తికేయ-2 చిత్ర బృందం

You are at idlebrain.com > News > Functions
Follow Us


26 August 2022
Hyderabad

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ‌ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ముందుగా పరిమిత థియేటర్స్ లో మాత్రమే రిలీజైన కార్తికేయ చిత్రం కేవలం మౌత్ టాక్ తో అనేక థియేటర్స్ ను సొంతం చేసుకుంది. ప్రతిచోటా హౌస్ ఫుల్స్ తో రన్ అవుతూ మంచి లాభాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ సందర్బంగా ఈ చిత్ర యూనిట్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతు..
అందరికి చాలా థాంక్స్ అండి. మాకు ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడికి, నిఖిల్ కి, అనుపమకు, అలానే డిస్ట్బ్యూటర్స్ అందరికి చాలా పెద్ద థాంక్స్.

సహా నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతు..
ఈ సినిమాను హిట్ చేసిన అందరికి చాలా పెద్ద థాంక్స్. హీరో హీరోయిన్ కూడా ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్ లా కష్టపడ్డారు. సినిమాలో ఎంత సస్పెన్స్ ఉందొ మాకు అలానే సస్పెన్స్ థ్రిల్లర్ చూపించారు. చాలా హ్యాపీగా ఉంది.

నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతు..
ఆడియన్స్ అందరికి చాలా థాంక్స్ అండి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి ఇది మొదటి వంద కోట్ల మూవీ మూవీ. మీడియాకు, హీరో నిఖిల్ కి, దర్శకుడు చందు మొండేటికి పతి ఒక్కరికి థాంక్స్.

అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతు...
ప్రేమమ్, శతమానం భవతి సినిమాలు తరువాత ఈ సినిమా నాకు మైల్ స్టోన్. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే మీరు ఇచ్చిన ప్రేమ మాత్రం నాకు చాలా విలువైంది. మా టీం కి కంగ్రాట్స్ చెబుతున్నాను. థాంక్యూ అల్.

దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతు...
సాంకేతిక నిపుణులకు, నిర్మాతలు , ఆర్టిస్టు లు గురించి చాలా సార్లు మాట్లాడాను. ఇలాంటి కథ సినిమా తీయడానికి నాకు విజ్ఞానాన్ని , వికాసాన్ని నేర్పించిన నా తల్లి తండ్రులకి, కొడుకుల చూసుకున్న మా అన్నయ్యకు ధన్యవాదలు. ఈరోజు నిఖిల్ గురించి బాలీవుడ్ లో కూడా మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని, అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

హీరో నిఖిల్ మాట్లాడుతు...
రాజమౌళి గారు, సుకుమార్ గారు మన సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. వాళ్ళు వేసిన రూట్స్ వలనే ఈ కార్తికేయ సినిమాను ఇలా తీసుకెళ్లగలిగాము, ఈ రోజు 1200 స్క్రీన్ లలో కార్తికేయ ఆడుతుంది అంటే అది తెలుగు సినిమా గొప్పతనం. మీరు ఈ సినిమాను చూసి హిట్ చేసారు అందుకే మీకు థాంక్స్ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అందరికి థాంక్యూ సో మచ్. నన్ను ఒక ఫ్రెండ్ లా ఒక ఫ్యామిలీ మెంబెర్ లా ఫీల్ ఈ సినిమాను జనాల్లోకి మీరు తీసుకెళ్లారు. మా నిర్మాతలకి , మా దర్శకుడు చందు కి థాంక్యూ సో మచ్.


Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved