pizza
Mahesh Babu's The Humbl Co. new brand launch
సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `హంబుల్ కో`ను ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us


5 August 2019
Hyderabad

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ స‌రికొత్త వ‌స్త్ర ప్ర‌పంచంలోకి మ‌నల్ని తీసుకెళ్ల‌నున్నారు. స్పాయిల్‌తో క‌లిసి ఆయ‌న ప్రారంభించిన క్లాత్ బ్రాండ్ `ది హంబుల్ కో` బుధ‌వారం ప్రారంభ‌మైంది.నేష‌న‌ల్ హ్యాండ్ లూమ్ డే సంద‌ర్భంగా హంబుల్ అండ్ కో ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో స్పాయిల్ సి.ఇ.ఒ భార్గ‌వ్ ఎర్రంగి, స్పాయిల్ ప్రైవేట్ బ్రాండ్ డివిజ‌న్ హెడ్ సుశ్రితి కృష్ణ పాల్గొన్నారు. హంబుల్ అండ్ కోలో 160 ర‌కాల స్టైల్స్‌కి సంబంధించిన దుస్తులు దొరుకుతాయి. వీటిలో కొన్నింటిని మోడల్స్ స్టేజ్‌పై ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ పాత్రికేయుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చారు.

నిజ జీవితంలో మీరెలాంటి దుస్తులు ధ‌రించాల‌నుకుంటారు?
నేను చాలా కంఫ‌ర్ట్‌గా ఉండే దుస్తుల‌ను ధ‌రించ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తాను.

మీరు ఎక్కువ‌గా ధ‌రించే దుస్తులేవి?

జీన్స్ ప్యాంట్‌, చెక్స్ ష‌ర్ట్‌ను ఎక్కువ‌గా ధ‌రిస్తుంటాను.మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన చేనేత కార్మికులకు ప‌నిని క‌ల్పించేలా ఉండే దుస్తులే ధ‌రించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. అవే నా ఫేవ‌రేట్‌.

హంబుల్ అంటే అర్థ‌మేంటి?

నిజంగా ఉండ‌టం...విన‌యంగా ఉండ‌టం. క్లాత్ బిజినెస్‌లోకి రావాల‌నే ఆలోచ‌న అని కాకుండా ఏదైనా కొత్త‌గా చేయాల‌ని ఆలోచ‌నైతే ఉండింది. ఆ స‌మ‌యంలో భార్గ‌వ్ న‌న్ను క‌లిశారు. ఆయ‌న విజ‌న్ న‌చ్చ‌డ‌మే కాదు..ఎగ్జ‌యిటెడ్‌గా కూడా అనిపించింది.

ఎ.ఎం.బి సినిమా త‌ర్వాత హంబుల్ స్టార్ట్ చేశారు. త‌ర్వాత ఏం స్టార్ట్ చేయ‌బోతున్నారు?

మ‌న‌సులో చాలానే ఉన్నాయి. అయితే సినిమాల్లో న‌టించ‌డానికి నేను ముందు ప్రాధాన్య‌త‌నిస్తాను. నా పుట్టిన‌రోజుకి రెండు రోజుల ముందు సోష‌ల్ మీడియాలో నా అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి అభిమానులున్నందుకు నేనెంతో అదృష్ట‌వంతుడిని.

మీరు బ‌య‌ట ఎవరినైనా చూసి వారి స్టైల్‌ను ఇష్ట‌ప‌డ్డారా?

చూడ‌గానే రియ‌ల్‌గా అనిపించే ఏ స్టైల్‌ను అయినా నేను ఇష్ట‌ప‌డ‌తాను.

జాతీయ చేనేత కార్మికుల దినోత్స‌వం రోజున హంబుల్‌ను స్టార్ట్ చేయ‌డం ఎలా అనిపిస్తుంది?

- చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓ మంచి రోజున మా హంబుల్‌ను స్టార్ట్ చేయ‌డం ఎగ్జ‌యిటింగ్‌గానే అనిపిస్తుంది. భార్గ‌వ్‌, సుశ్రిత‌కు అందుకు థ్యాంక్స్‌.

హంబుల్ అనే విన‌గానే ఎలా అనిపించింది?

నిజానికి భార్గ‌వ్ వ‌చ్చి ఆలోచ‌న చెప్పగానే న‌చ్చింది. ఆయ‌న హంబుల్ అనే పేరు చెప్ప‌గానే క‌నెక్ట్ అయిపోయాను. నా ప‌ర్స‌నాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని ఫీల‌య్యాను. హంబుల్‌లో ఎం, బి అనే అక్ష‌రాలు ప‌క్క ప‌క్క‌నే ఉన్నాయ‌ని అనుకోలేదు. వాటిని గ‌మ‌నించిన మా గ్రాఫిక్స్ టీం వాటిని అండ‌ర్ లైన్ చేసింది.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved