13 February 2020
Hyderabad
Pilla Puli Song From Suriya’s Aakasam Nee Haddhu Ra Launched In Mid-Air
Suriya is leaving no stones unturned with the promotions of his upcoming film Aakasam Nee Haddhu Ra. Directed by Sudha Kongara, the film is based on the life of Air Deccan founder GR Gopinath. The makers ahead of Valentine's Day have unveiled the romantic song from the film.
Along with the song, the makers also released one-minute video of Pilla Puli. The song shows lovely romance between Suriya and his leading lady in the film- Aparna Balamurali. Suriya looks dashing, wherein Aparna appeared stunning in the song composed by GV Prakash. The lyrics were penned by Ramajogayya Sastry and Anurag Kulkarni crooned the song.
The launch of the song took place mid-air in a SpiceJet flight carrying the film’s team members along with 100 underprivileged kids from Agaram Foundation who were selected based on a competition.
Sudha Kongara said, “Suriya promised me freedom and I hope I don’t let him down. I hope I delivered the best. I thank my entire cast and crew for their support and making my dream possible. My father passed away while I was doing the film. I adopted a new father and it was Mohan Babu sir. He was the only one who used to take best care of me.”
Suriya said, “In 2000, only less than 1% was able to fly. This man Captain Gopinath, he came and changed the whole industry. He made common man fly. This film is tribute to him. Sudha has given her 10 years to make this possible.
It’s Sudha’s film. Whatever respects, credits come for this film goes to Sudha. This is really important time of my career. Sudha is like my sister. She stood by me and made this happen for us.”
Suriya also lauded Mohan Babu who played an important role in the film. “Mohan Babu is like a godfather figure. Scenes between us were major highlight in the film. We have given best version possible.”
“This photo on the flight is not of Suriya’s. It’s Maara (His character name). This is respect to all the unsung heroes in our nation. Please don’t mistake it as stardom,” quoted he.
Mohan Babu said, “After Shivaji, Shivakumar is the next best actor in Tamil. I’ve associated with his son Suriya. What a man he’s. Shivakumar sir, you must feel proud of your son. He’s such a great actor. I wish, with the blessings of almighty, the film will become a super hit. Sudha is a disciplined director. I thank one and all.”
This event marks the first time that a film’s audio release took place inside a flight.
Cast:
Suriya, Dr.M Mohan Babu, Aparna Balamurali, Paresh Rawal, Urvashi, Karunas, Vivek
prasanna, Krishna kumar, Kaali venkat
Crew:
Story & Direction – Sudha Kongara
Music-GV Prakash Kumar
Cinematographer-Niketh Bommi
Art Director- Jacki
Editor-Sathish Suriya
Screenplay-Shalini Usha Devi & Sudha Kongara
Additional Screenplay- Aalif Surti, Ganeshaa
Dialogue-Rakendu Mouli
Maha Theme Lyricst-Pranav Chaganty
Background Score Supervised and edited by- Jehovahson alghar
Programmer-C.Sanjay
Costume Designer- Poornima Ramasamy
Choreography- Shobi, Sekhar VJ
Action Choreography-Greg powell, Vicky
Dolby Atoms Mix-Suren G
Sound Design- Sound Factor Vishnu Govind, Sree Sankar
Sound Effects- ArunSeenu
Make up & Hair- Shyed Malik S
Costumes – Arun
Stills-CH Balu
Visual Promotions-Deepak Bhojraj
Publicity Designer- Gopi Prasannaa
Colorist,DI- Suresh Ravi
VFX Supervisor- Vishwas Savanur
VFX Studios-SilverCloud Studios, Knack Studios
Executive Producers-Achin Jain, Pavithra
Chief Production Controller-B.Senthil Kumar
Pro-Vamsishekar
Co produced by-Rajsekar Karpoorasundarapandian, Guneet Monga, Aalif Surti
Produced by-Suriya
Banner- 2D Entertainment & Sikhya Entertainment
ఆకాశంలో లాంచ్ చేసిన 'ఆకాశం నీ హద్దురా' లోని 'పిల్ల పులి' పాట
సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఆయన ఏమాత్రం రాజీ పడటం లేదు. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా దర్శకురాలు సుధ కొంగర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
వేలెంటైన్స్ డేని దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం గురువారం సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసింది.
'పిల్ల పులి' అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన 1 మినిట్ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ పాటలో హీరో హీరోయిన్లు సూర్య, అపర్ణా బాలమురళి మధ్య రొమాన్స్ అలరిస్తోంది. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చిన ఈ పాటలో సూర్య డాషింగ్ లుక్ లో కనిపిస్తుంటే, అపర్ణ స్టన్నింగ్ లుక్ లో ఆకర్షణీయంగా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.
ఈ సాంగ్ ను ఆకాశంలో స్పైస్ జెట్ విమానంలో లాంచ్ చేయడం విశేషం. ఒక పోటీ ద్వారా ఎంపిక చేసిన అగరం ఫౌండేషన్ కు చెందిన 100 మంది అండర్ ప్రివిలేజ్డ్ బాలలు, చిత్ర బృందం సమక్షంలో దీనిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సుధ కొంగర మాట్లాడుతూ, "సూర్య నాకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇచ్చారు. ఆయనను నేను డిజప్పాయింట్ చేయలేదని ఆశిస్తున్నాను. నా శాయశక్తులా సినిమాను బాగా తీశాను. నా కలం నిజం కావడంలో తోడ్పడిన నటీనటులకు, సాంకేతిక బృందానికి నా థాంక్స్. ఈ సినిమా షూటింగ్ లో ఉండగా మానాన్న గారు మరణించారు. మోహన్ బాబు గారి రూపంలో ఒక కొత్త నాన్నను నేను దత్తత తీసుకున్నాను. నా విషయంలో ఎంతో శ్రద్ధ చూపించిన ఏకైక వ్యక్తి ఆయనే" అన్నారు.
హీరో సూర్య మాట్లాడుతూ, "2000 సంవత్సరంలో కేవలం 1 శాతం మందే విమానంలో ప్రయాణించగల స్థితిలో ఉండేవాళ్ళు. కెప్టెన్ గోపీనాథ్ వచ్చి ఈ ఇండస్ట్రీ మొత్తాన్ని మార్చేశారు. కామన్ మాన్ కూడా ఆకాశంలో ప్రయాణించగలిగేలా చేశారు. ఈ మూవీ ఆయనకే అంకితం. ఈ సినిమా సాధ్యపడటానికి సుధ పదేళ్ల కాలం వెచ్చించారు. ఇది ఆమె సినిమా. ఈ సినిమాకు వచ్చే పేరు, ప్రశంసలు ఆమెకే దక్కాలి. నా కెరీర్లో ఇది నిజంగా ముఖ్యమైన కాలం. సోదరి లాంటి సుధ నా పక్కన నిల్చుని, నాకు ఈ సినిమా సాధ్యపడేట్లు చేసింది. ఇక మోహన్ బాబు గారు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి. ఫ్లైట్ మీద కనిపించే ఫొటో సూర్యది కాదు. అది మూవీలో నేను చేస్తున్న మారా పాత్రది. ఇది మన దేశంలోని వీరులకు ఇస్తున్న గౌరవం. దీన్ని స్టార్ డమ్ గా పొరబాటు పడొద్దని నా మనవి" అని చెప్పారు.
మోహన్ బాబు మాట్లాడుతూ, "శివాజీ గణేశన్ తర్వాత తమిళంలో బెస్ట్ యాక్టర్ శివకుమార్. ఇప్పుడు ఆయన తనయుడు సూర్యతో కలిసి నటించాను. అతను ఎంత గొప్ప మనిషి! అతనిని చూసి శివకుమార్ గారు గర్వించాలి. అలాంటి గొప్ప నటుడు సూర్య. భగవంతుని ఆశీర్వాదంతో ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. సుధ డిసిప్లిన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా యూనిట్ అందరికీ నా థాంక్స్" అని చెప్పారు.
దేశంలో ఒక ఫ్లైట్ లో సినిమా పాట విడుదలవడం ఇదే ప్రథమం.
తారాగణం:
సూర్య, డాక్టర్ ఎం. మోహన్ బాబు, అపర్ణ బాలమురళి, పరేష్ రావల్, ఊర్వశి, కరుణాస్, వివేక్, ప్రసన్న, కృష్ణ కుమార్, కాళీ వెంకట్
సాంకేతిక బృందం:
కథ, దర్శకత్వం: సుధ కొంగర
సంగీతం: జీవీ ప్రకాష్
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
ఆర్ట్: జాకీ
ఎడిటర్: సతీష్ సూర్య
స్క్రీన్ ప్లే: షాలిని ఉషాదేవి, సుధ కొంగర
అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆలిఫ్ సుర్తి, గణేషా
డైలాగ్స్: రాకేందు మౌళి
కొరియోగ్రఫీ: శోభి, శేఖర్ వీజే
యాక్షన్: గ్రెగ్ పోవెల్, విక్కీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అచిన్ జైన్, పవిత్ర
పీఆర్వో: వంశీ-శేఖర్
సహ నిర్మాతలు: రాజశేఖర్ కర్పూర సుందరపాండ్యన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి
నిర్మాత: సూర్య
బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్, శిఖ్యా ఎంటర్ టైన్మెంట్