pizza
LV Prasad 111th birthday anniversary celebrations
ఎల్‌.వి.ప్ర‌సాద్ 111వ జ‌యంతి ఉత్స‌వం
You are at idlebrain.com > News > Functions
Follow Us


17 January 2019
Hyderabad

అక్కినేని ల‌క్ష్మీ వ‌ర‌ప్ర‌సాద్ 111వ జ‌యంతి ఉత్స‌వం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్ లో గురువారం ఉద‌యం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి బాల‌కృష్ణ పాల్గొని జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌

వైవీయ‌స్ చౌద‌రి మాట్లాడుతూ ``ఎల్వీ ప్ర‌సాద్‌, ఎన్టీఆర్ ఇద్ద‌రూ మ‌హావృక్షాలు. సినిమా రంగం ప‌ట్ల వ్యామోహాన్ని పెంచుకున్నారు. సినిమా రంగంలోనే తాము సంపాదించిన‌దాన్ని ఇన్వెస్ట్ చేశారు. వారి వార‌స‌త్వాన్ని వారి పిల్ల‌లు కొన‌సాగిస్తున్నారు. ఎల్వీ ప్ర‌సాద్‌గారికి ర‌మేష్ ప్ర‌సాద్‌గారు, ఎన్టీఆర్‌గారికి బాల‌కృష్ణ‌గారు వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తున్నారు. నా లాహిరిలాహిరి లాహిరిలో సినిమా స‌మ‌యంలో నేను ప్ర‌సాద్ ల్యాబ్స్ కు 8.75ల‌క్ష‌లు క‌ట్టాల్సి ఉన్న‌ప్పటికీ నాకు ర‌మేష్ ప్ర‌సాద్‌గారు సాయం చేశారు. అలాగే `రేయ్` కూడా ఆయ‌న ఆశీస్సుల‌తోనే విడుద‌లైంది. ఇక‌.. నంద‌మూరి బాల‌కృష్ణ తండ్రి మీద బ‌యోపిక్ తీసి అంద‌రి మెప్పు పొందారు. ఎల్వీ ప్ర‌సాద్‌గారి మీద ఆయ‌న త‌న‌యుడు ఓ మంచి బ‌యోపిక్ తీయాలి. `` అని అన్నారు.

గీతాంజ‌లి
మాట్లాడుతూ ``న‌న్ను అంద‌రూ చూడ‌గానే సీత‌మ్మ అని పిలుస్తున్నారంటే అందుకు కార‌ణం పెద్దాయ‌న ఎన్టీఆర్‌గారే. `సీతారామ‌క‌ల్యాణం` త‌ర్వాత నేను చేసిన సినిమా `ఇల్లాలు`. అప్ప‌ట్లో ఎల్వీ ప్ర‌సాద్‌గారి మెప్పు పొందాను. మా అబ్బాయిని కూడా సినిమాల్లోకి తీసుకుని రావాల‌ని అనుకుంటున్నాను`` అని చెప్పారు.

సురేష్ కొవ్వూరి
మాట్లాడుతూ ``ప్ర‌స్తుతం ఎల్వీ ప్ర‌సాద్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ర‌న్ చేస్తున్నాం. త్వ‌ర‌లోనే ప్రొడ‌క్ష‌న్‌లోకి రావాల‌నుకుంటున్నాం. ఎల్వీ ప్ర‌సాద్‌గారి జీవితంలోని విష‌యాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ త‌లా రెండు పేజీలు చ‌దివి ఆచ‌రించినా చాలు`` అని చెప్పారు.

రాధాప్ర‌సాద్
మాట్లాడుతూ ``మా తాత‌గారి గురించి ఏవీ చూసి థ్రిల్ అయ్యాను. మా పూర్వీకుల విలువ‌ల‌ని, వాళ్ల ఆలోచ‌న‌ల‌ని గౌర‌వించి, కొన‌సాగిస్తాం. మా నాన్న‌గారు ముందుండి తాత‌గారి బ‌యోపిక్ తీయాల‌ని ఆలోచిస్తున్నాం`` అని అన్నారు.

జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు మాట్లాడుతూ ``కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించిన మ‌హ‌నీయుడు ఎల్వీ ప్ర‌సాద్‌గారు. ఆయ‌న అంద‌రికీ ప్రాతఃస్మ‌ర‌ణీయుడు`` అని చెప్పారు.

ర‌మేష్ ఫ్ర‌సాద్
మాట్లాడుతూ ``మా నాన్న సినిమా వ్య‌క్తి. ఆయ‌న‌కు సినిమా త‌ప్ప మ‌రేమీ తెలియ‌దు. ఇంట్లో వాళ్ల‌ని కూడా ఎక్కువ‌గా క‌లిసేవారు కాదు.ఒక స్టూడియో నుంచి మ‌రో స్టూడియోకి వెళ్లే దారిలో ఆయ‌న రెస్ట్ తీసుకునేవారు. నేను ఇంజ‌నీరింగ్ పూర్తి చేశాక ఈ రంగంలోకి వ‌చ్చాను. అంత‌కు ముందే న‌న్ను న‌టుడిని చేయాల‌న్న‌ది మా నాన్న‌గారి కోరిక‌. అయితే ఓ సారి సంసారం సినిమా షూటింగ్‌లో నేను అంతంత సేపు స్టూడియోలో కూర్చోవ‌డం ఇష్టం లేక ఆయ‌న్ని విసిగించాను. అప్ప‌టి నుంచి నాకు యాక్టింగ్ మీద పెద్ద‌గా ఆస‌క్తిలేదు. మా ప్ర‌సాద్ ప్రాసెసింగ్ ల్యాబ్‌కి 17 సార్లు జాతీయ పుర‌స్కారం ద‌క్కింది. మా నాన్న‌కు పృథ్విరాజ్‌క‌పూర్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వాళ్ల‌లాగా మా కుటుంబం కూడా సినిమాల్లోనే ఉండాల‌ని కోరుకునేవారు. అప్ప‌ట్లో మా నాన్న‌గారి పాఆల‌ను త‌కేవార‌ట జితేంద్ర‌లాంటివారు. మా నాన్న‌కి సోష‌ల్ రెస్పాన్స్ ఉండేది. `` అని అన్నారు.

నంద‌మూరి బాల‌కృష్ణ
మాట్లాడుతూ ``ఎల్వీ ప్ర‌సాద్‌గారి గురించి చెప్ప‌డం అంటే సూరీడికి వెలుగు చూపించ‌డ‌మే. ఆయ‌న ఒక వ్య‌వ‌స్థ‌. న‌టుడు కావాల‌నుకున్నారు. అలాగే న‌టించారు. ద‌ర్శ‌కుడిగా మారారు. ఆయ‌న సినిమా రంగంలో త‌న‌కు ఇష్ట‌మైన అన్ని శాఖ‌ల్లోనూ కృషి చేశారు. ప్ర‌సాద్ ల్యాబ్స్ అనే గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. స‌ర్వేంద్రియానాం న‌య‌నం ప్ర‌దానం అంటారు. అందుకే ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. ఆయ‌న ఎంతో మందికి స్ఫూర్తి. మ‌ద్రాసులో ఎదురెదురిళ్ల‌ల్లో ఉండేవాళ్లం. గ‌తాన్ని ఎవ‌రూ మ‌ర్చిపోకూడ‌దు. భావి త‌రాల‌కు చెప్పాలి. ఎల్వీ ప్ర‌సాద్‌గారి క‌ల‌ల్ని ఆయ‌న త‌న‌యుడు సాకారం చేయ‌డం ఆనందంగా ఉంది`` అని అన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved