
23 February 2025
Hyderabad
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ మోస్ట్ ఎవైటెడ్ 30వ చిత్రం 'మజాకా' ఇప్పటికే హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ధమాక బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంటర్ టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ మాస్ ఎంటర్టైనర్ ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు, బాలాజీ గుత్తా సహ నిర్మాత. మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ క్యు అండ్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చారు.
సందీప్ గారు.. ట్రైలర్ చాలా హిలేరియస్ గా వుంది.. ఇంత వినోదం థియేటర్స్ లో ఇవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
-మజాకా సినిమా రెండుగంటల పాటు లాఫ్ రైడ్ గా వుంటుంది. థియేటర్స్ లో చాలా గట్టి నవ్వులు వినిపిస్తాయి. నా కెరీర్ లో హయ్యస్ట్ నెంబర్స్ ఈ సినిమా ఇస్తుంది. థియేటర్స్ ఫ్యామిలీస్ అంతా చూసే సినిమా ఇది.
-యూనిట్ అంతా మంచి ఎంటర్ టైనర్ ఇవ్వడానికి కష్టపడి పని చేశాం.ఇందులో పాటలు ఫైట్లు తప్పా... నాకు రావు రమేష్ గారికి ఈక్వెల్ స్క్రీన్ స్పెస్ వుంటుంది. ఆయన అద్భుతంగా నటించారు. ఆయన వలన కథ మరింతగా పండింది.
త్రినాథ్ గారు.. మజాకాలో వుండే మ్యాజిక్ ఏమిటి ?
-నేను ప్రతి సీన్ లో మ్యాజిక్ ఉండాలని నమ్ముతాను. నా ప్రతిసినిమాలో కూడా మ్యాజిక్ జరుగుతుంది. ఇందులో కూడా ఓ మ్యాజిక్ వుంది. అది జరిగింది. శివరాత్రి నాడు డబుల్ మ్యాజిక్ జరుగుతుంది. డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది.
-ఈ సినిమాలో బ్యూటీఫుల్ ఎమోషన్ వుంది. ఇద్దరే మగాళ్ళు వున్న ఒక ఇంట్లో ఏ రోజుకన్నా ఒక ఫ్యామిలీ ఫోటో రావాలని పడే తపనే మజాకా.
-అందరూ కాసేపు తమ బాధలు మర్చిపోయి ఓ రెండు గంటల పాటు రిలాక్స్ అయి హాయిగా నవ్వుకునే సినిమా చేయడానికి ఇష్టపడతాను. ఇదే పార్ములా.
రావు రమేష్ గారు.. ఇందులో మీరు డడ్యాన్సులు చేయడం చాలా కొత్తగా అనిపిస్తోంది.. సోలో సాంగ్ వస్తే చేస్తారా ?
-చేస్తాను. సినిమా అవకాశం రావడమే గొప్ప. అలాంటిది సాంగ్ కి డ్యాన్స్ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను .
-మజాకాలో ప్రతి సినిమా మజాతో చేశాను. ఇలాంటి సినిమా చేయడం నాకూ కొత్తే. కొత్తగా నవ్వించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్ యూ. ఇందులో రొమాంటిక్ గా నటించడం చాలా సవాల్ గా అనిపించింది. (నవ్వుతూ). ఈ సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో ఒక ఎమోషనల్ సీన్ వుంది. అది ఐకానిక్ సీన్ గా నిలిచిపోతుంది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
అనిల్ గారు.. సందీప్ కిషన్ కి పీపుల్స్ స్టార్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ?
-పీపుల్స్ తో ఇంటరాక్ట్ అయ్యే హీరోల్లో సందీప్ వన్ అఫ్ ది బెస్ట్. ఫ్యాన్స్ ని ఇంటికి వెల్ కమ్ చేసే హీరో. తన 30వ సినిమా లక్కీగా మా సినిమా కావడం ఆనందంగా వుంది. తను వరుసగా రాయన్, కెప్టన్ మిల్లర్, భైరవ కోన ఇప్పుడు మజాకా ఇలా డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్నారు. పీపుల్స్ స్టార్ ట్యాగ్ లైన్ తనకి యాప్ట్ అనిపించింది.
అనిల్ గారు హాస్య మూవీస్, ఎకే ఎంటర్ టైన్మెంట్ కంటే మించిపోతున్నట్లుగా వుంది ?
-ఇద్దరు పిల్లలు వుంటే ఎవరు వృద్దిలోకి వచ్చినా ఆనందంగా వుంటుంది. హాస్య మీద పెద్ద హిట్ వస్తే చాలా సంతోష పడతా. ఈ రెండు రెండు కళ్ళు.
హీరోయిన్ రీతూ వర్మ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిర్మాతలు అనిల్ గారికి రాజేష్ గారికి థాంక్ యూ. వారితో కొలబారేట్ కావడం చాలా ఆనందంగా వుంది. నన్ను నమ్మి సినిమాలో కాస్ట్ చేసిన డైరెక్టర్ గారికి థాంక్. ఈ సినిమా ఒక జాయ్ రైడ్. సందీప్ తో ఈ సినిమాలో పని చేసే అవకాశం దొరికింది. సందీప్ సపోర్ట్ ని మర్చిపోలేను. రావు రమేష్ గారితో చేసిన ఓ సీన్ ఆయన ప్రశంస మర్చిపోలేను. అన్షు గుడ్ ఫ్రెండ్. తన కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా ఆడియన్స్ ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు'అన్నారు
హీరోయిన్ అన్షు మాట్లాడుతూ..అందరికీ థాంక్ యూ. ఈ సినిమా తెలుగు రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్ యూ. సందీప్, రీతు, రావు రమేష్ వండర్ ఫుల్ కో స్టార్స్. వారి నుంచి చాలా విషయాలు నేచుకున్నాను. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ'అన్నారు.
నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మజాకా కథ చెప్పినప్పుడు హిలేరియస్ గా నాన్ స్టాప్ గా నవ్వుకున్నాను. సామజవరగమనా, భైరవకోన తర్వాత అనిల్ గారు నేను హ్యాట్రిక్ సినిమాగా ముందుకు వస్తున్నాం. ఫస్ట్ కాపీ చూశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. మా హీరో గారి కెరీర్ లో హయ్యస్ట్ థియేటర్స్ పడుతున్నాయి. మంచి బిజినెస్ జరిగింది. మంచి కాస్ట్లీ సినిమా తీశాం. ప్రతిఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. సందీప్ రావు రమేష్ గారు పోటీపడి నటించారు. రీతు వర్మ డ్యాన్స్ అదరగొట్టింది. అందరూ సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను'అన్నారు.
తారాగణం: సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
బ్యానర్లు: ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాతలు: రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సల్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి
సంగీతం: లియోన్ జేమ్స్
DOP: నిజార్ షఫీ
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
స్టంట్స్: పృధ్వీ
