ఏ డి.జె.ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై మధు శోభ.టి దర్శకత్వంలో శంకర్ ఆరా, జయరాజు.టి నిర్మిస్తున్న చిత్రం `దాడి`. వరుణ్ సందేశ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో జీవన్, చెరిష్మా శ్రీకర్, కారుణ్య చౌదరి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏడిద శ్రీరామ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. శివాజీ రాజా క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో....
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ - ``ఏడాది పాటు యు.ఎస్‌లో ఉన్నాను. ఈ గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇదే. యు.ఎస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత చాలా కథలు విన్నాను. ఈ కథ నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ మధు మంచి స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నా సినిమాలకు భిన్నమైన సినిమా ఇది. గోకుల్ చాట్ బాంబు దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఇందులో కనపడతాను. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అలాంటి పరిణామాలు వెనుక అసలు నిజాన్ని రాబట్టడానికి జర్నలిస్ట్‌గా మారి ఏం చేశాననేదే ఈ కథ. మణిశర్మగారి సంగీతం సినిమాకు ప్రధాన బలం కానుంది. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నాం. తదుపరి చంద్రమహేశ్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను`` అన్నారు.
డైరెక్టర్ మధుయ శోభ.టి మాట్లాడుతూ - ``అన్నీ రకాల ఎమోషన్స్ ఉండే చిత్రమిది. యూత్‌కు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సమాజంలో జరుగుతున్న పరిణామాల వెనుకున్న చీకటి కోణాలను వెలికి తీసే జర్నలిస్ట్ కథ ఇది. కచ్చితంగా సినిమాతో హిట్ సాధిస్తాననే నమ్మకం ఉంది`` అన్నారు.
నిర్మాత శంకర్ ఆరా మాట్లాడుతూ - ``మంచి మెసేజ్ ఉన్న చిత్రం. వరుణ్ సందేశ్‌గారు తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. దర్శకుడు మధు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి నిర్మాతగా మారాను`` అన్నారు.
ఈ కార్యక్రమంలో కారణ్య, చెరిష్మాజీవన్, శివశంకర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి డాన్స్: శివశంకర్ మాస్టర్, సూర్య కిరణ్, ఆర్ట్: వెంకట్, డైలాగ్స్: గుత్తి మల్లిఖార్జున్, ఫైట్స్: వెంకట్, శేఖర్, సంగీతం :మణిశర్మ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: ప్రసాద్ ఈదర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్, క్రియేటివ్ హెడ్: మోహన్, నిర్మాతలు: శంకర్ ఆరా, జయరాజు.టి డైరెక్టర్: మధు శోభ.టి