pizza
Monagadevaru movie launch
`మొన‌గాడెవ‌రు` చిత్రం ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us


5 November 2018
Hyderabad

మెగా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై వాడ‌ప‌ల్లి జ‌గ‌న్నాథం స‌మ‌ర్ప‌ణ‌లో వాడ‌ప‌ల్లి రాజు, దావ‌ల రాజ్‌కిర‌ణ్ నిర్మిస్తున్న చిత్రం `మొన‌గాడెవ‌రు`. `హు ఈజ్ నెం.1` ట్యాగ్ లైన్‌. ఈ సినిమా షూటింగ్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. కుమార్ రాజేంద్ర ద‌ర్శ‌కుడు. రాజ్ వాడ‌ప‌ల్లి, వంశీ కృష్ణ‌, ప్రియా అగ‌స్టీన్‌, కావ్య కీర్తి బండారి హీరో హీరోయిన్లు. ముహుర్త‌పు స‌న్నివేశానికి శివాజీ రాజా క్లాప్ కొట్ట‌గా బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్ర‌తాని రామ‌కృష్ణా గౌడ్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ లోగో లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

ద‌ర్శ‌కుడు కుమార్ రాజేంద్ర మాట్లాడుతూ ``ప‌ల్లెటూరు నుండి ఇద్ద‌రు అమ్మాయిలు హీరోయిన్లు కావాల‌ని, ఇద్ద‌రు హీరోల్లో ఒక‌రు ద‌ర్శ‌కుడు, ఒక‌రు హీరో కావాల‌ని వ‌స్తారు. అయితే ఇండ‌స్ట్రీలో ఎద‌డ‌గం అంత సుల‌భం కాద‌ని తెలుసుకుని ఎలా క‌ష్ట‌ప‌డ్డారు. చివ‌ర‌కు వారు స‌క్సెస్ సాధించారా? అనేదే క‌థ‌. దీంతో పాటు స‌మాంత‌రంగా సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన ఆర్టిస్టులు చిత్తూరు నాగ‌య్య నుండి ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌, కృష్ణ‌, కృష్ణంరాజు, చిరంజీవి, బాల‌కృష్ణ ఇలా అంద‌రి హీరోల నుండి ఇప్ప‌టి చిన్నహీరో వ‌ర‌కు ఎలా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఎదిగార‌నే కాన్సెప్ట్ బ‌యోపిక్స్‌లా ఉంటాయి.

నిర్మాత‌లు మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ బావుంది. కొత్త కాన్సెప్ట్ మూవీ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. సినిమా వాళ్ల క‌ష్టాల‌ను ఈ సినిమాలో చూపిస్తాం. సినిమాలో సినిమాగా సినిమా ర‌న్ అవుతుంది. ఈ సినిమాలో వ‌చ్చిన లాభాల్లో స‌గ‌భాగాన్ని పేద సినీ క‌ళాకారుల‌కు అందిస్తాం`` అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

రాజ్ వాడ‌ప‌ల్లి, వంశీకృష్ణ‌, ప్రియా అగ‌స్టీన్‌, కావ్య కీర్తి బండారి, హేమ సుంద‌ర్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌ర్ రావు తారాగ‌ణంగా న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్‌.రాజు, ఆర్ట్‌: వెక‌టేశ్ గూళ్ల‌, ఫైట్స్‌: అశోక్ రాజ్‌, పాట‌లు: అంచుల నాగేశ్వ‌ర‌రావు, ఎడిట‌ర్‌: స‌్వామి, కెమెరా: ఎం.ముర‌ళి, నిర్మాత‌లు: ర‌ఆజ్ వాడ‌ప‌ల్లి, దావ‌ల రాజ్‌కిర‌ణ్‌, క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: కుమార్ రాజేంద్ర‌.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved