pizza
Allari Naresh's Naandi movie launch
అల్లరి నరేష్ హీరోగా ఎస్ వి2 ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెం1 'నాంది` చిత్రం ప్రారంభం!!
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 January 2020
Hyderabad

అల్లరి నరేష్ హీరోగా ఎస్ వి2 ఎంటర్టైన్మెంట్ బేనర్ పై ప్రొడక్షన్ నెం1 గా విజయ్ కనకమేడలని దర్శకుడిగా పరిచయం చేస్తూ సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రం 'నాంది'. ఈ చిత్రం జనవరి 20న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్లాప్ నివ్వగా నిర్మాత కె ఎల్ దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

అల్లరి నరేష్ మాట్లాడుతూ - " ఎస్ వి2 ఎంటర్టైన్మెంట్ బేనర్ పై ప్రొడక్షన్ నెం 1గా 'నాంది' చిత్రం ప్రారంభమయినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా ద్వారా నిర్మాతగా సతీష్, విజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిక్షనల్ స్టోరీతో తెరకెక్కుతున్న క్రైమ్ డ్రామా. ఈ సినిమాలో నాది ఇంటెన్సివ్ క్యారెక్టర్. అందరూ కొత్తవారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేసే చిత్రం అవుతుంది" అన్నారు.

డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ - "ముందుగా ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, మా నిర్మాత సతీష్ గారికి ధన్యవాదాలు. ఇంట్రెస్టింగ్ కథ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సోషల్ ఎలిమెంట్ కూడా బ్లెండ్ అయి ఉంటుంది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది" అన్నారు.

నిర్మాత సతీష్ వేగేశ్న మాట్లాడుతూ - "నరేష్ హీరోగా నటిస్తున్న నాంది' చిత్రం తో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నాకు ఇవివి గారి సినిమాలంటే చాలా ఇష్టం. నరేష్ గారు ఈసినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నారు. జనవరి 22 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. మార్చి లో షూటింగ్ పూర్తి చేసి ఈ సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

మాటల రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ - "నరేష్ గారితో సినిమా చేయాలనేది నా కోరిక. మంచి కథ. తన జోనర్ మార్చుకొని నరేష్ గారు ఈ సినిమా చేయబోతున్నారు. ఆయన్ను మరో కోణం లో చూస్తారు" అన్నారు.

ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ చోటా కె ప్రసాద్, సినిమాటో గ్రాఫర్ సిద్‌, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, క‌థా ర‌చ‌యిత వెంక‌ట్‌ తదితరులు పాల్గొన్నారు.
అల్లరి నరేష్, వరలక్ష్మి శరత్ కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవి ప్రసాద్ , వినయ్ వర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్: సిద్,
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మకడలి.
ఎడిటర్: చోటా కె ప్రసాద్,
సంగీతం: శ్రీ చరణ్ పాకాల,
కథ: వెంకట్,
మాటలు; అబ్బూరి రవి,
పాటలు: రామజోగయ్య శాస్రి, శ్రీమణి,
ఫైట్స్: వెంకట్,
నిర్మాత; సతీష్ వేగేశ్న,
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: విజయ్ కనకమేడల


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved