pizza
Naga Shaurya, Aneesh Krishna, IRA Creations Film Launched
లాంఛ‌నంగా ప్రారంభ‌మైన హ్యాండ్స‌మ్ హీరో నాగ‌శౌర్య, అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ఐరా క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4
You are at idlebrain.com > News > Functions
Follow Us


28 October 2020
Hyderabad

Handsome Actor Naga Shaurya and the talented Director Aneesh Krishna are all set to team up for the next rom-com flick from Ira Creations.

With a formal pooja ceremony in attendance of few prominent industry people, the film has been launched today in Hyderabad.

Producer Naga Vamsi has handed over the film’s script to the makers. The muhurtham shot has been directed by Anil Ravipudi, while Koratala sounded the clapboard and Nara Rohit switched on the camera.

The movie is said to be surpassing family entertainer and will be produced by Usha Mulpuri.

For Director Aneesh Krishna this will be the third feature film in his basket.

The Team has also roped in Mahati Swara Sagar to render tunes for this talkie, this squad has previously given us a blockbuster song Choosi Choodangane. Sai Sriram will handle cinematography.

The regular filming will commence from December and other details to be unveiled soon.

Hero : Naga Shaurya
Director: Aneesh Krishna
Producer: Usha Mulpuri
Presents: Shankar Prasad Mulpuri
Banner: Ira Creations
Music Director: Mahati Swara Sagar
DOP: Sai Sriram
Co-Producer: Bujji
Digital Head: M.N.S.Gowtham
PRO: Vamsi Shekar

హ్యాండ్స‌మ్ హీరో నాగ‌శౌర్య హీరోగా `అలా ఎలా?` ఫేమ్ అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఐరా క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4 గా ఉష ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ఈ రోజు హైద‌రాబాద్ సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి సూప‌ర్ ‌సక్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ క్లాప్ నివ్వ‌గా, హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యంగ్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశి స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణకు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ మాజీమంత్రి పి. మ‌హేంద‌ర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. అనంత‌రం ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో...

తెలంగాణ మాజీమంత్రి పి. మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ - ``నాగ‌శౌర్య విభిన్నక‌థా చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించి రెండు రాష్ట్రాల‌లో హీరోగా మ‌రింత మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను. అలాగే భ‌విష్య‌త్తులో మ‌రిన్ని మంచి సినిమాలు తీయాల‌ని మ‌న‌స్పూర్తిగా ఆశీర్వ‌దిస్తున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ‌ మాట్లాడుతూ - ``నా మొద‌టి సినిమా `అలా ఎలా?`తో మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేశాను. ఈ సినిమాతో మ‌రోసారి మిమ్మ‌ల్ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి మంచి టీమ్‌తో మ‌రోసారి సిద్ద‌మ‌య్యాను. టోట‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌బ్జెక్ట్‌. నా ఫ‌స్ట్ సినిమాకి సినిమాటోగ్ర‌ఫి అందించిన సాయిశ్రీ‌రామ్‌, నాగ‌శౌర్య‌గారికి ఛలోతో మంచి మ్యూజిక‌ల్ హిట్ ఇచ్చిన మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ సినిమాకి వ‌ర్క్‌చేస్తున్నారు. త‌ప్ప‌కుండా ఒక మంచి సినిమా అవుతుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన నాగ‌శౌర్య‌గారికి అలాగే శ‌ంక‌ర్ ప్ర‌సాద్ స‌ర్‌కి, ఉష మేడ‌మ్‌గారికి, బుజ్జిగారికి నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు.``అన్నారు.

చిత్ర నిర్మాత ఉషా ము‌ల్పూరి మాట్లాడుతూ -``అలా ఎలా? ఫేమ్‌ అనీష్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్స్ నెం.4 ఈ రోజు ప్రారంభించ‌డం హ్యాపీగా ఉంది. ఈ కోవిడ్ టైమ్‌లో కూడా మా మీద ఉన్న అభిమానంతో మేము పిల‌వ‌గానే ఇక్క‌డికి వ‌చ్చిన కొర‌టాల శివ‌గారికి, అనిల్ రావిపూడి గారికి, నారా రోహిత్‌గారికి, నాగ‌వంశీ గారికి ధ‌న్య‌వాదాలు.
డిసెంబ‌ర్ మొద‌టి వారంనుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నాం. మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో స‌హ నిర్మాత బుజ్జి, సంగీత ద‌ర్శ‌కుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్ సాయిశ్రీ‌రామ్ త‌దితరులు పాల్గొన్నారు.

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: అనీష్ కృష్ణ‌
నిర్మాత‌: ఉష ముల్పూరి
స‌మ‌ర్ప‌ణ‌: శ‌ంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి
బ్యానర్: ఐరా క్రియేషన్స్
స‌హ నిర్మాత‌: బుజ్జి,
సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌,
సినిమాటోగ్రాఫ‌ర్‌: సాయిశ్రీ‌రామ్,
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: రాము
డిజిట‌ల్ హెడ్‌: ఎం.ఎస్‌.ఎన్‌. గౌత‌మ్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

 


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved